లోడ్ అవుతోంది...


మూడు సంవత్సరాలు కష్టపడి రాజాసాబ్ సినిమా చేస్తే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారని డైరెక్టర్ మారుతి అన్నారు. ఈ ట్రోల్ చేసేవాళ్ళందరూ.. భవిష్యత్తులో ఏదో ఒకరోజు పశ్చాత్తాపపడతారని పేర్కొన్నారు. మారుతి దర్శకత్వం వహించిన రాజాసాబ్ మూవీ ఇటీవల రిలీజైంది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ హీరోగా నటించారు. ఈ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ గురించి మారుతి మాట్లాడుతూ....
రాజాసాబ్ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. సంక్రాంతి హాలీడేస్ మొదలు కాకముందే ఈ సినిమా 200 కోట్ల మార్క్ టచ్ చేయడం హ్యాపీ. రిజల్ట్‌పై ప్రభాస్ రియాక్ట్ అయ్యారు. కూల్‌గా ఉండు. మనం కొత్త ప్రయత్నం చేశాం. ఆడియెన్స్‌కు రీచ్ కావడానికి కొంత టైమ్ పడుతుందని పాజిటివ్‌గా మాట్లాడారు. రీసెంట్ గా ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక ఆయనకు మెసేజ్ చేశా, ఆ సీన్స్ అన్నీ పర్పెక్ట్ గా సెట్ అయ్యాయని అన్నారు. రాజాసాబ్ కాన్సెప్ట్ కొందరికి అర్థం కావడం లేదు. హారర్ మూవీస్ లో దెయ్యాన్ని చంపడం ఈజీ. ఎలాగైనా చంపొచ్చు. కానీ ప్రభాస్ గారి లాంటి పాన్ ఇండియా హీరోతో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి సాదా సీదా హారర్ కామెడీ చేయొద్దనే ఇలా ఫాంటసీ, సైకలాజికల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి బిగ్ స్కేల్ రాజాసాబ్‌ను రూపొందించాం.
రాజా సాబ్ లాంటి సినిమా చేయడం సులువు కాదు. ఒక వ్యక్తి ట్రాన్స్ లోకి వెళ్లాడు అనేది విజువల్ గా చూపించడం కష్టం. అతని సబ్ కాన్షియస్ మైండ్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆ సీన్లలోని డెప్త్ అర్థం కావాలంటే రెండు సార్లు అయిన సినిమా చూడాలి. ఈ మూవీలోని ఓల్డ్ గెటప్ లో రివర్స్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాం. కొన్ని సీన్స్ కోసం ప్రభాస్ గారు 15 డేస్ ఎలా చేద్దామని ఆలోచించారు. వందశాతం ఎఫర్ట్స్ పెట్టారు. ప్రభాస్‌ను కలర్ ఫుల్ గా సాంగ్స్, డ్యాన్స్ లతో చూపించారని, కొత్తగా ప్రెజెంట్ చేశారని అభిమానులు అభినందిస్తున్నారు . ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఫోన్‌లు చేస్తున్నారు. నాగ్ అశ్విన్ గారు, సందీప్ వంగా చాలా మంది మెసేజ్‌లు పెట్టారు.
ట్రోలింగ్ కామన్ అయిపోయింది. విడుదలైన ప్రతి సినిమాపై విమర్శలు వస్తున్నాయి. మూడు సంవత్సరాలు కష్టపడి మూడు గంటల సినిమా చేస్తే ఇష్టం వచ్చినట్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రోల్ చేసేవాళ్ళందరూ.. భవిష్యత్తులో ఏదో ఒకరోజు పశ్చాత్తాపపడతారు. ఇదేదో శాపం అని కాదు.. ఒక ఫిలిం మేకర్ గా నా బాధ మాత్రమే. రాజాసాబ్ గురించి నలుగురు చెడుగా మాట్లాడితే నలభై మంది వెళ్లి సినిమా చూస్తున్నారు. సినిమా బాగుంది అని అంటున్నారు. ప్రీమియర్ షోస్ కు అనుమతి, బుకింగ్స్ ఇలాంటివి నా పరిధిలోకి రావు. సినిమాను అనుకున్న టైమ్‌లో కంప్లీట్ చేయడమే నా చేతిలో ఉంటుంది. రాజాసాబ్ ద్వారా ఒక పెద్ద స్టార్ తో కూడా సినిమా బాగా చేయగలను అని నిరూపించుకున్నాను. ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేయాలన్నది నా కల. అది నెరవేరుతుందనే నమ్మకముంది

జనవరి 12, 2026

జనవరి 12, 2026

జనవరి 11, 2026





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam