త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Washington Sundar | భార‌త జ‌ట్టుకు షాక్‌.. వ‌న్డే సిరీస్ నుంచి ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ అవుట్‌..!

Washington Sundar | టీమిండియాకు మ‌రో షాక్ త‌గిలింది. న్యూజిలాండ్ జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్ నుంచి ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సంద‌ర్ త‌ప్పుకున్నాడు. భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య వ‌డోద‌ర వేదిక‌గా జ‌రిగిన వ‌న్డేలో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది.

P

Sports | Published On Jan 12, 2026, 8.17 pm IST

Washington Sundar | భార‌త జ‌ట్టుకు షాక్‌.. వ‌న్డే సిరీస్ నుంచి ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ అవుట్‌..!
Advertisement

Washington Sundar | టీమిండియాకు మ‌రో షాక్ త‌గిలింది. న్యూజిలాండ్ జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్ నుంచి ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సంద‌ర్ త‌ప్పుకున్నాడు. భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య వ‌డోద‌ర వేదిక‌గా జ‌రిగిన వ‌న్డేలో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. సైడ్ స్ట్రెయిన్ కార‌ణంగా సుంద‌ర్ సిరీస్ నుంచి వైదొల‌గ‌డంతో అత‌ని స్థానంలో ఆయుష్ బ‌దోనికి తొలిసారిగా జాతీయ జ‌ట్టు నుంచి పిలుపువ‌చ్చింది. తొలి వ‌న్డేలో బౌలింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఎడ‌మ కింద ప‌క్క‌టెముక‌ల భాగంలో తీవ్ర‌మైన అసౌక‌ర్యం క‌లిగింద‌ని, దాంతో వైద్య ప‌రీక్ష‌ల కోసం ముంబ‌యికి వెళ్లాడు. కోలుకునేందుకు రెండువారాల స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని స‌మాచారం. అయితే, సుంద‌ర్‌కు బ‌దులుగా ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ ప్ర‌త్యామ్నాయంగా ఉండ‌గా.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ బీసీసీఐ జ‌ట్టులోకి తీసుకుంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు వైస్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ విష‌యంలో రిస్క్ చేయ‌కూడ‌ద‌ని సెలెక్ట‌ర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. మిగ‌తా రెండు వ‌న్డేల‌కు నితీశ్‌కుమార్‌రెడ్డిని తుది జ‌ట్టులోకి తీసుకునేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతోంది. టీమిండియా చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ శ‌నివారం వ‌ర‌కు వ‌డోద‌ర‌లో క‌నిపించారు. శనివారం ప్రాక్టీస్ సెష‌న్‌లో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌, గంభీర్‌తో ఏకాంతంగా చ‌ర్చిస్తూ క‌నిపించారు.

ఇదిలా ఉండ‌గా.. న్యూజిలాండ్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌కు సైతం సుంద‌ర్ ఫిట్‌గా ఉండే అవ‌కాశం లేదు. కీల‌క టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఆల్‌రౌండర్ గాయ‌ప‌డ‌డం టీమ్ మేనేజ్‌మెంట్‌ను, సెల‌క్ష‌న్ క‌మిటీని ఆందోళ‌న‌కు గురి చేస్తున్న‌ది. ఇదిలా ఉండ‌గా.. న్యూజిలాండ్‌తో జరిగే తొలి మూడు టీ20లకు తిలక్ వర్మ లేకుండానే భారత్ బరిలోకి దిగనుంది. తిలక్ జట్టుకు దూరమవడం, వాషింగ్టన్ ఫిట్‌నెస్ భార‌త్ జ‌ట్టుకు ఇబ్బందిక‌రంగా మారింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫిబ్ర‌వ‌రిలో మొద‌లుకానున్న‌ది. టీమిండియా తొలి మ్యాచ్‌ను ఫిబ్ర‌వ‌రి 7న ఆడుతుంది. ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు అందుబాటులో ఉండాల‌ని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తున్న‌ది.

Advertisement

తాజావార్తలు

Advertisement