WPL 2026 | డబ్ల్యూపీఎల్ లో నాట్ సివర్-బ్రంట్ సెంచరీ.. ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు..
WPL 2026 | ముంబై ఇండియన్స్ వుమెన్ జట్టు ఆల్‌రౌండర్ నాట్ సివర్-బ్రంట్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. డబ్ల్యూపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది.
WPL 2026 | ముంబై ఇండియన్స్ వుమెన్ జట్టు ఆల్‌రౌండర్ నాట్ సివర్-బ్రంట్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. డబ్ల్యూపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. వడోదరలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వుమెన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ 57 బంతుల్లో 100 పరుగులు సాధించి అజేయంగా నిలిచింది. నాట్ సివర్ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 1 సిక్సర్ ఉండడం విశేషం. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే సివర్-బ్రంట్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆర్‌సీబీ బౌలర్లపై ఎలాంటి కనికరం లేకుండా విరుచుకుపడి బౌండరీలను బాదుతూ ముంబై ఇన్నింగ్స్‌కు భారీ ఊపునిచ్చింది. ఆమె బ్యాటింగ్‌లో కనిపించిన ఆత్మవిశ్వాసం, టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
బెంగళూరుపై ఘన విజయం..
ఈ చారిత్రక ఇన్నింగ్స్‌కు ముందు ఓపెనర్ హేలీ మాథ్యూస్ పునాది వేసింది. గాయాల నుంచి తిరిగి వచ్చిన మాథ్యూస్ అద్భుత ఫామ్‌లో కనిపిస్తూ 39 బంతుల్లో 56 పరుగులు చేయగా, ఆమెతో కలిసి సివర్-బ్రంట్ రెండో వికెట్‌కు 131 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ భాగస్వామ్యం ఆర్‌సీబీ బౌలింగ్ విభాగాన్ని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. సయాలి సత్గరే, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ వంటి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి199 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అయితే ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ వుమెన్ జట్టు 35 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ రిచా ఘోష్ స్పూర్తిదాయక ఇన్నింగ్స్ తో ఓ దశలో ఆర్‌సీబీ గెలుస్తుందని భావించారు. కానీ ఒత్తిడి కారణంగా భారీగా పరుగులను చేయాల్సి వచ్చింది. దీంతో లక్ష్య చేధనకు బెంగళూరు కొన్ని పరుగుల దూరంలో ఆగిపోయింది. 50 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో రిచా ఘోష్ మెరుపులు మెరిపించినా ఆమె ఒంటరి పోరాటం వృథా అయింది. 20 ఓవర్లలో బెంగళూరు 9 వికెట్లను కోల్పోయి 184 పరుగులను మాత్రమే చేయగలిగింది. దీంతో బెంగళూరుపై ముంబై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

జట్టు ప్రయోజనాల కోసమే ఆడతా: బ‌్రంట్
మ్యాచ్ అనంతరం మాట్లాడిన సివర్-బ్రంట్, 90 పరుగుల వద్ద ఔటైపోయిన ఆటగాళ్లను గతంలో చాలామందిని చూసినట్లు గుర్తుచేసుకుంది. అందుకే సెంచరీ పూర్తి చేయాలనే ఒత్తిడి కొద్దిగా ఉన్నప్పటికీ, జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే లక్ష్యంతోనే ఆడినట్లు తెలిపింది. 90ల్లో ఔటయ్యే ఆటగాళ్లను చాలా మందిని చూశాను. అందుకే అదే పరిస్థితి రాకూడదని అనుకున్నాను. కానీ అదే సమయంలో జట్టు కోసం ఎంత ఎక్కువగా సాధ్యమైతే అంత ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాను. ఆ స్కోరు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగా కూడా ఎంతో ఆనందంగా ఉంది. నా భాగస్వామి కేథరిన్ చూస్తూ ఉంటుందని ఆశిస్తున్నాను. అయితే ఆమె చాలా టెన్షన్ పడే వ్యక్తి, కాబట్టి చూస్తుందో లేదో తెలియదు. కానీ ఆమె టీ తాగుతూ, నేను సెంచరీ చేయాలని కోరుకుంది. అదే జరిగిందని చాలా సంతోషంగా ఉంది, అని ఆమె నవ్వుతూ చెప్పింది.
ఒత్తిడిలో ఆర్‌సీబీ..
ఇది తన తొలి టీ20 సెంచరీ అని పేర్కొన్న సివర్-బ్రంట్, ఇది చివరిది కాకూడదని ఆశిస్తున్నట్లు తెలిపింది. అలాగే గాయాల తర్వాత తిరిగి వచ్చి అద్భుత అర్ధసెంచరీ చేసిన హేలీ మాథ్యూస్‌కు కూడా ప్రత్యేకంగా ప్రశంసలు దక్కాయి. హేలీ తిరిగి వచ్చి ఈ స్థాయిలో ఆడటం చాలా సంతోషంగా ఉంది. ఆమెతో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు ఎప్పుడూ ఇష్టం, అని ఆమె తెలిపింది. కాగాగా, సివర్-బ్రంట్ - మాథ్యూస్ జోడీ నెలకొల్పిన 131 పరుగుల భాగస్వామ్యం డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున నాలుగో అతిపెద్ద భాగస్వామ్యంగా నమోదైంది. ఆసక్తికరంగా, ముంబైకి చెందిన టాప్-4 భాగస్వామ్యాల్లో వీరిద్దరూ అన్ని చోట్ల ఉండటం విశేషంగా మారింది. ఈ చారిత్రక సెంచరీతో నాట్ సివర్-బ్రంట్ పేరు డబ్ల్యూపీఎల్ చరిత్రలో శాశ్వతంగా నమోదైంది. అయితే వరుసగా 5 మ్యాచులలో విజయం సాధించిన బెంగళూరు మళ్లీ వరుసగా 2 మ్యాచ్‌లలో ఓడింది. దీంతో ఆ జట్టుపై ఒత్తిడి నెలకొందని స్పష్టంగా కనిపిస్తోంది. మరి రానున్న మ్యాచ్‌లలో అయినా మళ్లీ బెంగళూరు పుంజుకుంటుందా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



