త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yashasvi Jaiswal | టీ20ల‌లో య‌శ‌స్వి జైశ్వాల్ స్థానం ఎక్క‌డ‌..? ఆ ఫార్మాట్‌ను అత‌ను మ‌రిచిపోవాల్సిందేనా..?

Yashasvi Jaiswal | రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి త‌రువాత ఆల్ ఫార్మాట్ ప్లేయ‌ర్ ఎవ‌రైనా ఉన్నారా..? అని వెదికి చూస్తే క‌చ్చితంగా ఒక‌రి పేరు మాత్రం క‌నిపిస్తుంది. అత‌నే టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్‌. ఆ ఇద్ద‌రు దిగ్గ‌జ ప్లేయ‌ర్ల త‌రువాత ఆల్ ఫార్మాట్ ప్లేయ‌ర్‌గా గుర్తింపు పొందాడు.

S

Sports | Published On Dec 25, 2025, 8.35 pm IST

Yashasvi Jaiswal | టీ20ల‌లో య‌శ‌స్వి జైశ్వాల్ స్థానం ఎక్క‌డ‌..? ఆ ఫార్మాట్‌ను అత‌ను మ‌రిచిపోవాల్సిందేనా..?
Advertisement

Yashasvi Jaiswal | రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి త‌రువాత ఆల్ ఫార్మాట్ ప్లేయ‌ర్ ఎవ‌రైనా ఉన్నారా..? అని వెదికి చూస్తే క‌చ్చితంగా ఒక‌రి పేరు మాత్రం క‌నిపిస్తుంది. అత‌నే టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్‌. ఆ ఇద్ద‌రు దిగ్గ‌జ ప్లేయ‌ర్ల త‌రువాత ఆల్ ఫార్మాట్ ప్లేయ‌ర్‌గా గుర్తింపు పొందాడు. కానీ ప్ర‌స్తుతం జైశ్వాల్ టీ20 కెరీర్ మాత్రం అయోమ‌యంగా ఉంది. దేశ‌వాళీ టోర్నీలతోపాటు అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌లోనూ చాన్స్ ల‌భించిన‌ప్పుడ‌ల్లా స‌త్తా చాటుతూనే ఉన్నాడు. కానీ టెస్టు, వ‌న్డేల‌కు అత‌న్ని ఎంపిక చేసిన‌ట్లు టీ20ల‌కు ఎంపిక చేయ‌డం లేదు. మ‌రోవైపు వ‌న్డేల్లోనూ ఐసీసీ టోర్నీల్లో అత‌నికి స్థానం ల‌భించ‌డం లేదు. దీనిపై భార‌త మాజీ ప్లేయ‌ర్, మాజీ చీఫ్ సెలెక్ట‌ర్ దిలీప్ వెంగ్ సర్కార్ స్పందించారు. టీ20 వ‌రల్డ్ క‌ప్‌కు జైశ్వాల్‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై ఆయ‌న బీసీసీఐపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నిరుత్సాహంగా జైశ్వాల్‌..?

దేశ‌వాళీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా టీ20ల‌లో జైశ్వాల్ కూడా అద్భుత‌మైన ఆట‌తీరును క‌న‌బ‌రిచాడు. కానీ రెండో వికెట్ కీప‌ర్ అన్న కార‌ణంతో ఇషాన్ కిష‌న్‌ను ఎంపిక చేశారు. జైశ్వాల్ త‌న చివ‌రి టీ20 మ్యాచ్ శ్రీ‌లంక‌తో 2024 జూలైలో ఆడాడు. అప్ప‌టి నుంచి సెలెక్ట‌ర్లు అత‌ని వైపు చూడ‌డం లేదు. చాన్స్ వ‌చ్చినా బెంచికే ప‌రిమితం చేస్తున్నారు. దీంతో జైశ్వాల్ తీవ్ర నిరుత్సాహానికి గుర‌వుతున్న‌ట్లు అర్థం చేసుకోవ‌చ్చు. ఇదే విష‌యాన్ని వెంగ్ స‌ర్కార్ సైతం స్ప‌ష్టం చేశారు. జైశ్వాల్ టీ20ల‌లో 160 నుంచి 200 స్ట్రైక్ రేట్‌తో ర‌న్స్ చేస్తున్నాడు. దేశవాళీ టోర్నీల్లోనూ ఆడుతున్నాడు. అత‌న్ని టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఎంపిక చేయ‌కపోవడం ఆశ్చ‌ర్యంగా ఉంది. నేను సెలెక్ట‌ర్‌గా ఉండి ఉంటే జైశ్వాల్‌ను అస‌లు డ్రాప్ చేయ‌ను. క‌చ్చితంగా సెలెక్ట్ చేసేవాడిని. అత‌నో గొప్ప ప్లేయ‌ర్‌.. అని వెంగ్ స‌ర్కార్ అన్నారు.

సెలెక్ట‌ర్లు ఏం ఆలోచిస్తున్నారు..?

ప్ర‌స్తుతం ఉన్న సెలెక్ట‌ర్లు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఒక గొప్ప టీమ్‌ను సెలెక్ట్ చేసి ఉండ‌వ‌చ్చు. కానీ అందులో వారు జైశ్వాల్ ను మిస్ చేశారు. గిల్‌ను విడిచిపెట్టడం ఓకే. కానీ జైశ్వాల్ ను డ్రాప్ చేయ‌డం స‌రికాదు. ప్ర‌స్తుతం ప్లేయ‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇస్తూ అవ‌కాశాల కోసం చూస్తున్నారు. అలాంట‌ప్పుడు వారికి చాన్సులు రాక‌పోతే తీవ్ర నిరుత్సాహానికి గుర‌వుతారు. ఇది వారి కెరీర్‌పై ప్ర‌భావం చూపిస్తుంది.. అని వెంగ్ స‌ర్కార్ అన్నారు. అయితే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఫ‌లితం ఎలా ఉన్న‌ప్పటికీ ఆ త‌రువాత కెప్టెన్‌గా సూర్య‌ను త‌ప్పిస్తార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే శ్రేయాస్ అయ్య‌ర్‌ను అన్ని ఫార్మాట్ల‌కు కెప్టెన్‌గా చేసే చాన్స్ ఉంద‌ని సమాచారం. దీంతో జ‌ట్టులో అన్ని ఫార్మాట్ల‌లోనూ కీల‌క‌మార్పులు చోటు చేసుకుంటాయ‌ని కూడా తెలుస్తోంది. జైశ్వాల్ వ‌య‌స్సు ప్ర‌స్తుతం 24 ఏళ్లు. ఇంకా అత‌నికి చాలా కెరీర్ ఉంది. అత‌ను అన్ని ఫార్మాట్ల‌లోనూ ఆడితే ఒత్తిడి ప‌డుతుంద‌ని, క‌నుక త‌రువాత నెమ్మ‌దిగా అత‌నికి చాన్సులు ఇవ్వ‌వ‌చ్చ‌ని సెలెక్ట‌ర్లు ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఎంపిక చేయ‌లేద‌ని అంటున్నారు. అయితే వ‌చ్చే ఐపీఎల్ త‌రువాతే ఈ విష‌యాల‌పై స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement