Steve Bucknor | సచిన్‌ను తప్పుగా ఔట్ ఇచ్చానని ఎట్టకేలకు ఒప్పుకున్న అంపైర్ స్టీవ్ బక్నర్
Steve Bucknor | వెస్టిండీస్‌కు చెందిన అంపైర్ స్టీవ్ బక్నర్ పేరు చెబితే చాలు.. ఒకప్పటి టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతారు. ఎందుకంటే ఆయన కేవలం భారత బ్యాటర్లను మాత్రమే అన్యాయంగా ఔట్ అని ప్రకటిస్తారని అప్పట్లో ఆరోపణలు ఉండేవి. ఓ టెస్టు మ్యాచ్‌లో ఆయన సచిన్‌ను ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ ఇచ్చిన నిర్ణయంపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది.
Steve Bucknor | వెస్టిండీస్‌కు చెందిన అంపైర్ స్టీవ్ బక్నర్ పేరు చెబితే చాలు.. ఒకప్పటి టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతారు. ఎందుకంటే ఆయన కేవలం భారత బ్యాటర్లను మాత్రమే అన్యాయంగా ఔట్ అని ప్రకటిస్తారని అప్పట్లో ఆరోపణలు ఉండేవి. ఓ టెస్టు మ్యాచ్‌లో ఆయన సచిన్‌ను ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ ఇచ్చిన నిర్ణయంపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. అయితే ఎట్టకేలకు బక్నర్ అప్పట్లో తాను ఇచ్చిన ఔట్ తప్పేనని అంగీకరించాడు. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ అంపైర్స్ అసోసియేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
అసలేం జరిగింది..?
2003-04 లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ బ్రిస్బేన్‌లో టెస్టు ఆడుతుండగా సచిన్ టెండుల్కర్ బ్యాటింగ్ సమయంలో జేసన్ గిలెస్పి వేసిని బంతిని ముందుగా సచిన్ విడిచిపెట్టబోయాడు. కానీ అది ఆయన ప్యాడ్స్ ను తాకింది. దీంతో గిలెస్పితోపాటు ఆసీస్ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్, ఇతర ప్లేయర్లు ఎల్‌బీడబ్ల్యూ కోసం చాలా గట్టిగా అప్పీల్ చేశారు. దీంతో ఆ మ్యాచ్‌లో అంపైర్‌గా ఉన్న స్టీవ్ బక్నర్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే సచిన్‌ను ఔట్‌గా ప్రకటించారు. ఆ క్షణంలో సచిన్ షాక్ అయి చూడగా, కామెంటేటర్ టోనీ గ్రెయిగ్ కూడా అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అదొక దారుణమైన నిర్ణయమని నేరుగా కామెంటరీలోనే చెప్పారు. అయితే సచిన్‌ను అప్పట్లో బక్నర్ అలా ఔట్ ఇవ్వడంపై పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తరువాత ఇచ్చిన గ్రాఫిక్‌లో బంతి వికెట్లను తగలకుండా మిస్ అవుతుందని కూడా వచ్చింది. అయితే బంతి బౌన్స్ అవుతుందన్న విషయాన్ని కూడా గుర్తించకుండా బక్నర్ అలా ఎలా ఔట్ ఇచ్చారు.. అని ఫ్యాన్స్ ఫైరయ్యారు. మాజీలు, విశ్లేషకులు కూడా బక్నర్ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు.
తప్పును అంగీకరిస్తున్నా: బక్నర్
అయితే ఆ ఔట్ నిర్ణయంపై బక్నర్ తాజాగా స్పందిస్తూ తాను సచిన్‌ను తప్పుగానే ఔట్ అని ప్రకటించానని, తనది తప్పుడు నిర్ణయమేనని స్పష్టం చేశారు. జీవితంలో మనిషి పొరపాట్లు చేయడం సహజమని, తాను తప్పును అంగీకరిస్తున్నానని, జీవితం అలా కొనసాగుతుందని అన్నారు. బక్నర్ ఆ మ్యాచ్ తరువాత 22 ఏళ్లకు ఇప్పుడు తనది తప్పని అంగీకరించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ కూడా ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. బక్నర్ అప్పట్లోనే సరిగ్గా నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది కదా.. అని కామెంట్లు పెడుతున్నారు. కాగా బక్నర్ వయస్సు ప్రస్తుతం 79 ఏళ్లు. ఆయన అప్పట్లో తరచూ తన వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచేవారు. తన కెరీర్‌లో బక్నర్ మొత్తం 120 టెస్టు మ్యాచ్‌లకు, పలు వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లకు అంపైరింగ్ బాధ్యతలను నిర్వర్తించారు.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



