త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virat Kohli | కోహ్లి ఇన్‌స్టా ఖాతా మ‌ళ్లీ యాక్టివ్‌.. ఫ్యాన్స్ హ్యాపీ..

Virat Kohli | భారత క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానులకు ఊరట లభించింది. కొద్ది గంటల పాటు కనిపించకుండా పోయిన కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మళ్లీ యాక్టివ్ అయింది. 274 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఈ ఖాతా తిరిగి అందుబాటులోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

S

Sports | Published On Jan 30, 2026, 11.26 am IST

Virat Kohli | కోహ్లి ఇన్‌స్టా ఖాతా మ‌ళ్లీ యాక్టివ్‌.. ఫ్యాన్స్ హ్యాపీ..
Advertisement

Virat Kohli | భారత క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానులకు ఊరట లభించింది. కొద్ది గంటల పాటు కనిపించకుండా పోయిన కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మళ్లీ యాక్టివ్ అయింది. 274 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఈ ఖాతా తిరిగి అందుబాటులోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి ప్రొఫైల్‌లోని పాత 1,044 పోస్టులు, ఫొటోలు, వీడియోలు అన్నీ యథావిధిగా తిరిగి కనిపిస్తున్నాయి. అయితే కోహ్లి ఖాతా ఎందుకు అకస్మాత్తుగా డియాక్టివేట్ అయిందన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అకస్మాత్తుగా మాయం అవ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ అనుష్క శ‌ర్మ ఇన్ స్టా ఖాతాతోపాటు కోహ్లి ఎక్స్ ఖాతాలో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ పోస్టులు పెట్టారు.

సోదరుడి ఖాతా కూడా..

శుక్ర‌వారం (జ‌న‌వ‌రి 30, 2026) అర్థ‌రాత్రి నుంచే కోహ్లి ఖాతా మాయమైన‌ట్లు తెలుస్తుండ‌గా, ఉద‌యం కాసేప‌టికి మ‌ళ్లీ యాక్టివ్ అయింది. దీంతో కోహ్లి వార్త ట్రెండింగ్‌లోకి వెళ్లింది. అయితే ఈ ఘటన వెనుక కారణాలపై అనేక ఊహాగానాలు వినిపించాయి. కొందరు అభిమానులు కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నాడేమోనన్న సందేహాలను కూడా వ్యక్తం చేశారు. అయితే అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఖాతా తిరిగి యాక్టివ్ కావడంతో స్పష్టమైంది. అయితే ఇక్క‌డ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, కోహ్లి ఖాతాతో పాటు అదే సమయంలో అతని సోద‌రుడు వికాస్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా కనిపించకుండా పోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లి ఖాతా తిరిగి వచ్చినప్పటికీ, వికాస్ కోహ్లి ఖాతా మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. శుక్రవారం ఉదయం సుమారుగా 8:30 గంటల ప్రాంతంలో విరాట్ కోహ్లి ఖాతా మళ్లీ యాక్టివ్ అయింది. అయితే, ఇప్పటివరకు కోహ్లి ఎలాంటి కొత్త పోస్ట్‌ను షేర్ చేయలేదు.

ఫామ్‌లో ఉన్న కోహ్లి..

క్రికెట్‌లో మాత్రం కోహ్లి ఫామ్‌లోనే కొన‌సాగుతున్నాడు. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో ఒక శతకం, ఒక అర్ధశతకం సాధించి తన ఫామ్‌ను కొనసాగించాడు. భారత్ తరఫున అతను ఆడిన చివరి ఏడు వన్డే మ్యాచ్‌లలో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఇక సిరీస్ ముగిసిన అనంతరం కోహ్లి కుటుంబంతో సమయం గడిపేందుకు లండన్‌కు వెళ్లాడు. కానీ త్వ‌ర‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడేందుకు మ‌ళ్లీ భార‌త్‌కు రానున్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement