త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virat Kohli | విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ‌ల‌పై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. సెల్ఫీ అడిగిన దివ్యాంగ బాలున్ని ప‌ట్టించుకోలేదు.. వీడియో..

S

Sports | Published On Dec 17, 2025, 7.47 am IST

Virat Kohli | విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ‌ల‌పై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. సెల్ఫీ అడిగిన దివ్యాంగ బాలున్ని ప‌ట్టించుకోలేదు.. వీడియో..
Advertisement

Virat Kohli | భార‌త క్రికెట‌ర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ దంప‌తులు త‌మ పిల్ల‌లు పుట్టిన‌ప్ప‌టి నుంచి లండ‌న్‌లో నివాసం ఉంటున్న విష‌యం విదితమే. మ్యాచ్‌లు ఉన్న‌ప్పుడు కోహ్లి, సినిమాల్లో న‌టించేందుకు అనుష్క శ‌ర్మ భార‌త్‌కు అప్పుడ‌ప్పుడు వ‌స్తున్నారు. ఇక కోహ్లి ఈ మ‌ధ్యే సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌కు భార‌త్‌కు వ‌చ్చాడు. మ్యాచ్‌ల‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. అయితే మ‌ళ్లీ లండ‌న్ వెళ్లిన అనంత‌రం కోహ్లి త‌న భార్య అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి తిరిగి ఇండియాకు వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే ఆ దంప‌తులు ఇద్ద‌రు తాజాగా బృందావ‌నం ఆశ్ర‌మంలో ప్రేమానంద్ జీని క‌లిసేందుకు వెళ్లారు. అయితే తిరిగి వ‌స్తుండ‌గా ఎయిర్ పోర్టులో ఓ దివ్యాంగ బాలుడు కోహ్లితో ఫొటో దిగేందుకు య‌త్నించాడు. కానీ కోహ్లి సెక్యూరిటీ అత‌న్ని ప‌క్క‌కు నెట్టేశారు. దీంతో కోహ్లిపై నెటిజ‌న్లు భ‌గ్గుమంటున్నారు. ఒక్క నిమిషం ఆగి ఆ బాలుడికి సెల్ఫీ ఇస్తే కోహ్లి ఏమైనా అరిగిపోతాడా.. అని కామెంట్లు పెడుతున్నారు.

కాగా ఈ సంఘ‌ట‌న తాలూకు వీడియో సామాజిక మాధ్య‌మాల్లోనూ వైర‌ల్‌గా మారింది. దీంతో నెటిజ‌న్లు ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందిస్తున్నారు. మీరు ప్రేమానంద్ జీ ఆశ్ర‌మానికి వెళ్లి వ‌చ్చింది ఇందుక‌నేనా, అక్క‌డ మీరు ఏం నేర్చుకున్నారు, ఒక్క నిమిషం ఆ బాలుడి క‌నీసం హాయ్ చెప్పే తీరిక కూడా కోహ్లికి లేదా, మీరు త్వ‌ర‌గా వెళ్లాల‌ని కోరుకోవ‌చ్చు, కానీ ఆ బాలున్ని చూస్తే మీకు కొంచెం కూడా జాలి క‌ల‌గ‌లేదా..? అని నెటిజ‌న్లు కోహ్లి దంప‌తుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ఈ త‌ర‌హా సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం సెల‌బ్రిటీల‌కు, అందులోనూ కోహ్లికి కొత్తేమీ కాదు. ఇలా త‌ర‌చూ వివాదాస్ప‌ద సంఘ‌ట‌న‌లు ఎందుక‌ని చెప్పి వారు లండ‌న్‌లో ఉంటున్నారు. త‌మ‌కు ప్రైవ‌సీ ఇవ్వాల‌ని కూడా వారు కోరారు. అయిన‌ప్ప‌టికీ వారు భార‌త్‌కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.

ఇక ఈ సంఘ‌ట‌న‌పై కొంద‌రు అభిమానులు కోహ్లికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. వారు త్వ‌ర‌గా వెళ్లే య‌త్నంలో ఉన్నారు, అలాంటి స‌మ‌యంలో వారిని కాసేపు చూడాల‌ని కోరుకోవాలి కానీ వారితో ఫొటో అంటే ఎలా, వీలు కాదు క‌దా, మ‌నం అర్థం చేసుకోవాలి, వారికి ప్రైవ‌సీ ఇవ్వాలి.. అని కొంద‌రు అభిమానులు అంటున్నారు. కాగా కోహ్లి ఇటీవ‌ల జ‌రిగిన సౌతాఫ్రికా సిరీస్‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సాధించాడు. సిరీస్‌లో మొత్తం 302 ప‌రుగులు చేయ‌గా, అందులో రెండు సెంచ‌రీలు ఉన్నాయి. ఇక జ‌న‌వ‌రిలో భార‌త్ లో ప‌ర్య‌టించ‌నున్న న్యూజిలాండ్ జ‌ట్టుతోనూ వ‌న్డేలు ఆడ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో కివీస్‌తో భార‌త్ మూడు వ‌న్డేలు, ఐదు టీ20ల‌ను ఆడ‌నుంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement