Vaibhav Suryavanshi | యూత్ వన్డేల్లో తొలి వికెట్ తీసిన వైభవ్ సూర్యవంశీ.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. వీడియో వైరల్..
Vaibhav Suryavanshi | టీమిండియా యంగ్ అండ్ డైనమిక్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ఆసియా కప్ అండర్ 19 వన్డే టోర్నీలో 95 బంతుల్లోనే 171 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అనంతరం అందరి కళ్లు అతని తదుపరి మ్యాచ్ పై పడ్డాయి. ఈ క్రమంలోనే ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లోనూ అతను మెరుపులు మెరిపిస్తాడని అందరూ భావించారు. కానీ అతను ఈ మ్యాచ్‌లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. మొదటి 3 ఓవర్లలో అతనికి కేవలం 4 బంతులు మాత్రమే ఆడేందుకు లభించాయి. అయినప్పటికీ అతను పరుగులు రాబట్టడంలో కాస్త తడబడ్డాడు. ఈ క్రమంలోనే కేవలం 6 బంతులు మాత్రమే ఆడిన వైభవ్ 5 పరుగులే చేసి ఔటయ్యాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. మరోవైపు ఇంకో భారత ఓపెనర్, జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రే పాకిస్థాన్‌పై బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో పవర్ ప్లేలో భారత్ అత్యధిక పరుగులు రాబట్టింది.
భారత ఇన్నింగ్స్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ ఆరోన్ జార్జ్ మాత్రం ధాటిగా ఆడాడు. ఓ వైపు స్ట్రైక్ రొటేట్ చేస్తూనే మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా ఫోర్లు, సిక్సులను బాదుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే అతను 88 బంతుల్లో 85 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి జార్జ్ రెండో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అలాగే అభిజ్ఞాన్ కుందుతో కలిసి జార్జ్ 5వ వికెట్‌కు 60 పరుగులను జోడించాడు. ఇక ఆఫ్ స్పిన్నర్ ఆల్ రౌండర్ కన్షిక్ చౌహాన్ నిలకడగా ఆడి భారత్ డిఫెండబుల్ స్కోర్ సాధించేలా చేశాడు. 46 బంతుల్లో చౌహాన్ 46 పరుగులు చేయగా, భారత్ 240 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇక భారత్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ కొన్ని ఓవర్లపాటు వికెట్లు కోల్పోకుండా ఆడే ప్రయత్నం చేసింది. కానీ పరుగులను రాబట్టలేకపోయింది. ఈ క్రమంలో బౌలింగ్ వేసిన భారత బౌలర్ దీపేష్ దేవేంద్రన్ పాక్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. మొదటి వికెట్లను తీయడంతో పాక్ స్కోరు 14 ఓవర్లు ముగిసే సరికి 30 పరుగులకు 3 వికెట్లుగా ఉంది. అనంతరం బౌలింగ్ వేసిన చౌహాన్ పాక్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్‌ను తరువాతి ఓవర్‌లో ఔట్ చేయడంతో పాక్ స్కోరు 30 పరుగులకు 4 వికెట్లుగా మారింది. అయితే పాక్ కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్, హుజైఫా అహ్‌సాన్‌లు 5వ వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో వారి భాగస్వామ్యం కీలకంగా మారుతున్న వేళ వికెట్ తీయడం భారత్‌కు తప్పనిసరిగా మారింది. దీంతో కెప్టెన్ మాత్రే బౌలింగ్ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా అతను వైభవ్ సూర్యవంశీ చేతికి బౌలింగ్ చేయమని బంతిని అందించాడు.
దీంతో రంగంలోకి దిగిన వైభవ్ 24వ ఓవర్‌లో తన స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో ముందు కొన్ని పరుగులను సమర్పించుకున్నా తరువాత ఫర్హాన్‌ను ఔట్ చేశాడు. వైభవ్ వేసిన బంతిని షాట్ ఆడే క్రమంలో ఫర్హాన్ షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు మళ్లించాడు. కానీ బంతి అక్కడనే గాల్లోకి లేచింది. దీంతో ఆ పొజిషన్‌లో ఉన్న ఫీల్డర్ సులభంగా క్యాచ్ పట్టాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఖాతాలో యూత్ వన్డేల్లో తొలి వికెట్ చేరింది. ఆ తరువాత పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అడపా దడపా బౌండరీలను బాదినప్పటికీ నిరంతరాయంగా వికెట్లను కోల్పోయారు. దీంతో ఆ జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో రాణించలేకపోయినా, బాల్‌తో ఒక వికెట్ తీసి పాకిస్థాన్ కీలక భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. దీంతో అతని ఓవర్ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్ ఈ టోర్నీలో తన రెండో గెలుపును నమోదు చేసుకుంది.
https://twitter.com/SonySportsNetwk/status/2000172334250893715
సంబంధిత వార్తలు

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026

ICC Women’s T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ నందినికి ఛాన్స్..!
మే 2, 2026

ICC Test Rankings | ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. మూడో స్థానానికి భారత్
మే 1, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



