Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీని జట్టులోకి త్వరగా తీసుకోండి.. సెలెక్టర్లకు మాజీల సూచన..
Vaibhav Suryavanshi | భారత యువ క్రికెట్ జట్టు సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని వీలైనంత త్వరగా సీనియర్ టీమ్‌లోకి తీసుకోవాలని భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ శ్రీకాంత్ సూచించారు. వైభవ్ సూర్యవంశీని ఫాస్ట్ ట్రాక్‌లో జట్టులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.
Vaibhav Suryavanshi | భారత యువ క్రికెట్ జట్టు సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని వీలైనంత త్వరగా సీనియర్ టీమ్‌లోకి తీసుకోవాలని భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ శ్రీకాంత్ సూచించారు. వైభవ్ సూర్యవంశీని ఫాస్ట్ ట్రాక్‌లో జట్టులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. 14 ఏళ్ల వయస్సులోనే అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న సూర్యవంశీని కచ్చితంగా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఈ ఏడాది నిర్వహించిన ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడిన వైభవ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఆ వయస్సులోనే సీనియర్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని సత్తా చాటడంతో అందరి దృష్టి అతనిపై పడింది. ఆ తరువాత అండర్ 19, టీ20లు, ఇతర లీగ్ మ్యాచ్‌లలోనూ వైభవ్ రాణిస్తూనే ఉన్నాడు. దీంతో అతన్ని సీనియర్ టీమ్‌లోకి వీలైనంత త్వరగా తీసుకురావాలని పలువురు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్, మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం వైభవ్ సూర్యవంశీని త్వరగా టీమ్‌లోకి తేవాలని పేర్కొనగా, ఇప్పుడు క్రిస్ శ్రీకాంత్ కూడా అవే వ్యాఖ్యలు చేశారు. తన యూట్యూబ్ చానల్ చీకీ చీకాలో ఓ వీడియోలో శ్రీకాంత్ మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీని అసలు టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయాల్సింది. కానీ ఐసీసీ నిబంధనల ప్రకారం ప్లేయర్ కనీస వయస్సు 15 ఏళ్లు ఉండాలి. వైభవ్ వయస్సు ఇప్పుడు 14 ఏళ్లే. కొన్ని రోజుల్లోనే అతనికి 15 ఏళ్లు నిండుతాయి. వయస్సు నిబంధన వల్ల అతన్ని టీ20 వరల్డ్ కప్‌లో సెలెక్ట్ చేయలేదని భావిస్తున్నా. కానీ ఆ తరువాత అయినా సరే అతన్ని జట్టులోకి తీసుకురావాల్సిందే. కనీసం సెలెక్ట్ చేసి బెంచ్‌లో అయినా కూర్చోబెట్టాలి. వీలున్నప్పుడు చాన్స్ ఇవ్వాలి. అతను ఆడడం చూస్తుంటే టీ20లలో భారత్‌కు మరో అద్భుతమైన ప్లేయర్ లభించాడని అనిపిస్తోంది.. అని శ్రీకాంత్ అన్నారు.
టీ20లలో వైభవ్ ఆడితే ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తాడు. అతను ఓ వైపు, అభిషేక్ ఓ వైపు.. లేదా వైభవ్, ఇషాన్ కిషన్.. ఇలాగైనా ఓపెనర్లను ట్రై చేయవచ్చు. ముగ్గురూ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్లే. వారు ఓపెనర్లుగా ఉంటే ప్రత్యర్థి జట్టు పని అయిపోయినట్లే. మొదటి 6 ఓవర్లలో వారు సృష్టించే విధ్వంసానికి టీమిండియా సగం మ్యాచ్ గెలుస్తుంది. అందువల్ల వైభవ్ సూర్యవంశీని టీ20లలోకి తీసుకురావాలి. బీసీసీఐ, సెలెక్టర్లు ఫాస్ట్ ట్రాక్‌గా అతన్ని టీ20లలోకి తేవాలి.. అని శ్రీకాంత్ వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 50 ఓవర్ల మ్యాచ్‌ల టోర్నీలోనూ వైభవ్ సూర్యవంశీ సత్తా చాటాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 84 బంతుల్లోనే 190 పరుగులు చేయడం అందరి దృష్టినీ మరోసారి ఆకర్షించింది. ఈ క్రమంలోనే అతన్ని సీనియర్ జట్టులోకి త్వరగా తీసుకురావాలని పలువురు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీనియర్ జట్టులోకి వైభవ్ ఎప్పుడు వస్తాడో చూడాలి.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



