త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

U-19 Asia Cup IND Vs PAK | అండ‌ర్ 19 ఆసియా క‌ప్ ఫైన‌ల్‌.. చిత్తుగా ఓడిన టీమిండియా..

U-19 Asia Cup IND Vs PAK | దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్ 19 ఆసియా క‌ప్ వ‌న్డే టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌పై పాకిస్థాన్ విజ‌యం సాధించింది. పాక్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో భార‌త్ త‌డ‌బ‌డింది. వ‌చ్చిన బ్యాట్స్‌మ‌న్ వ‌చ్చిన‌ట్లే షాట్‌లు ఆడి పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు.

S

Sports | Published On Dec 21, 2025, 5.27 pm IST

U-19 Asia Cup IND Vs PAK | అండ‌ర్ 19 ఆసియా క‌ప్ ఫైన‌ల్‌.. చిత్తుగా ఓడిన టీమిండియా..
Advertisement

U-19 Asia Cup IND Vs PAK | దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్ 19 ఆసియా క‌ప్ వ‌న్డే టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌పై పాకిస్థాన్ విజ‌యం సాధించింది. పాక్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో భార‌త్ త‌డ‌బ‌డింది. వ‌చ్చిన బ్యాట్స్‌మ‌న్ వ‌చ్చిన‌ట్లే షాట్‌లు ఆడి పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ఏ ద‌శ‌లోనూ కోలుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. బ్యాటింగ్ ఆర్డ‌ర్ పూర్తిగా వైఫ‌ల్యం చెందింది. దీంతో పాక్ ఈ మ్యాచ్‌లో భార‌త్‌పై 191 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఇరు జ‌ట్లు గ్రూప్ ద‌శ‌లో త‌ల‌ప‌డిన‌ప్పుడు భార‌త ప్లేయ‌ర్లు అద్భుతంగా రాణించారు. కానీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఒత్తిడి కార‌ణంగా భార‌త ప్లేయ‌ర్లు తేలిపోయారు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఫెయిల్ అయ్యారు. దీంతో ట్రోఫీ చేజారింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా పాక్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో పాకిస్థాన్ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్లలో 8 వికెట్ల న‌ష్టానికి 347 ప‌రుగుల స్కోరు చేసింది. పాక్ బ్యాట్స్‌మెన్‌ల‌లో ఓపెన‌ర్ స‌మీర్ మిన్హ‌స్ చెల‌రేగి ఆడి 113 బంతుల్లోనే 17 ఫోర్లు, 9 సిక్స‌ర్ల‌తో 172 ప‌రుగులు చేశాడు. అలాగే మ‌రో బ్యాట్స్‌మ‌న్ అహ్మ‌ద్ హుస్సెయిన్ 72 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 56 ప‌రుగులు చేశాడు. మిగిలిన ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో దీపేష్ దేవేంద్ర‌న్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, హెనిల్ ప‌టేల్‌, ఖిల‌న్ ప‌టేల్‌ల‌కు చెరో 2 వికెట్లు ద‌క్కాయి. క‌న్షిక్ చౌహాన్ 1 వికెట్ తీశాడు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన భార‌త్ 26.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 156 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో దీపేష్ దేవేంద్ర‌న్ చివ‌ర్లో 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 36 ప‌రుగులు చేసి కాసేపు మెరుపులు మెరిపించాడు. అయిన‌ప్ప‌టికీ అప్ప‌టికే ఓట‌మి ఖ‌రారైంది. ఇక మిగిలిన భార‌త బ్యాట్స్‌మెన్ అంద‌రూ విఫ‌లం అయ్యారు. క‌నీసం రెండంకెల స్కోరు కూడా సాధించ‌లేక‌పోయారు. వ‌చ్చిన వారు వ‌చ్చిన‌ట్లే పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ఇక పాక్ బౌల‌ర్ల‌లో అలీ రాజా 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, మ‌హ‌మ్మ‌ద్ స‌య్యం, అబ్దుల్ శుభ‌న్‌, హుఫైజా అహ్‌సాన్‌ల‌కు త‌లా 2 వికెట్లు ద‌క్కాయి. కాగా ఆసియా క‌ప్ టీ20 టోర్నీలో భార‌త సీనియ‌ర్ ప్లేయ‌ర్ల జ‌ట్టు విజ‌యం సాధించ‌గా, అటు ఇండియా ఎ టీమ్‌, ఇప్పుడు అండ‌ర్ 19 టీమ్ మాత్రం ప‌రాజ‌యం పాల‌య్యాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement