Gautam Gambhir | డియర్ గంభీర్, ఇక చాలు.. పక్కకు తప్పుకోండి..
Gautam Gambhir | న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 338 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి అద్భుతంగా 124 పరుగులు సాధించాడు. కానీ ఆ శతకం భారత్‌కు విజయాన్ని అందించలేకపోయింది. కోహ్లికి సరైన మద్దతు లభించకపోవడమే భారత్ ఓటమికి ప్రధాన కారణంగా మారింది.
Gautam Gambhir | న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 338 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి అద్భుతంగా 124 పరుగులు సాధించాడు. కానీ ఆ శతకం భారత్‌కు విజయాన్ని అందించలేకపోయింది. కోహ్లికి సరైన మద్దతు లభించకపోవడమే భారత్ ఓటమికి ప్రధాన కారణంగా మారింది. హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి అర్ధశతకాలు చేసినప్పటికీ అది చాలలేదు. ఈ ఓటమితో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1–2తో కోల్పోయింది. ఇది భారత గడ్డపై న్యూజిలాండ్‌కు తొలి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. కెప్టెన్ శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి కీలక ఆటగాళ్లు ఎవరూ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఫలితంగా కోహ్లి పోరాటం వృథా అయ్యింది. కాగా మ్యాచ్ అనంతరం భారత మాజీ బ్యాటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కోహ్లి పోరాట తత్వాన్ని ప్రశంసిస్తూ, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
బౌలర్లు కూడా విఫలం..
2023 వరల్డ్‌కప్‌లో జడేజా సైలెంట్ కిల్లర్‌లా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతనిలో అప్పటి ఉత్సాహం కనిపించడం లేదు. కుల్దీప్ యాదవ్ కూడా తీవ్రంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. విరాట్ కోహ్లి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ప్రతి మ్యాచ్‌లో కోహ్లినే పరుగులు చేయాలా? అలా అయితే భారత్ ఎన్ని మ్యాచ్‌లు గెలుస్తుంది? అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో వ్యాఖ్యానించారు. భారత్ ఒక్క ఆటగాడిపైనే ఆధారపడుతోంది. నిజానికి న్యూజిలాండ్ బౌలింగ్ అంత బలమైనది కాదు. అయినా జేడెన్ లెనాక్స్ 10 ఓవర్లలో 42 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఫౌల్క్స్ ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ వికెట్లు తీశాడు. కైల్ జేమిసన్ శుబ్‌మన్ గిల్‌ను అద్భుతమైన బంతితో ఔట్ చేశాడు. క్రిస్టియన్ క్లార్క్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇది వారి మూడో స్థాయి బౌలింగ్ అటాక్ అని అన్నారు.
గంభీర్‌పై తీవ్ర విమర్శలు..
ఈ సిరీస్‌లో జడేజా ప్రదర్శన నిరాశాజనకంగా మారింది. మూడో మ్యాచ్‌లో ఆరు ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాటింగ్‌లోనూ 4, 27, 12 పరుగులే చేశాడు. దీంతో వన్డే జట్టులో జడేజా భవిష్యత్తుపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా గిల్ వరుస మ్యాచ్‌లలో విఫలం అయ్యాడు. మరోవైపు టీమిండియా గత 37 ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్న రికార్డు ఈ వన్డేతో తుడిచిపెట్టుకుపోయింది. కివీస్ చాలా ఏళ్ల తరువాత తొలిసారిగా వన్డే సిరీస్‌ను భారత గడ్డపై గెలుచుకుంది. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టు కూర్పు సరిగ్గా లేదని, అర్షదీప్ సింగ్‌ను ముందు మ్యాచ్‌లలో ఎందుకు ఆడించలేదని, గిల్‌కు ఇంకా ఎన్ని చాన్సులు ఇస్తారని మండిపడుతున్నారు. గంభీర్ ఇకనైనా తప్పుకుంటే జట్టు బాగుపడుతుందని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున గంభీర్‌ను ట్రోల్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



