BCCI | ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు.. మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు డబ్బులు లేవా..?
BCCI | ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్‌ల సందర్భంగా దిగ్గజ టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత శర్మ, విరాట్ కోహ్లి అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. సెంచరీలతో చెలరేగిపోయారు. ఇక తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తొలి రోజు మ్యాచ్‌లలోనూ ఈ ఇద్దరూ మళ్లీ సెంచరీలు చేసి అలరించారు.
BCCI | ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్‌ల సందర్భంగా దిగ్గజ టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత శర్మ, విరాట్ కోహ్లి అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. సెంచరీలతో చెలరేగిపోయారు. ఇక తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తొలి రోజు మ్యాచ్‌లలోనూ ఈ ఇద్దరూ మళ్లీ సెంచరీలు చేసి అలరించారు. ఢిల్లీ జట్టుకు ఆడుతున్న కోహ్లి 101 బంతుల్లో 131 పరుగులు చేయగా, ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ శర్మ 94 బంతుల్లో 155 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆయా ప్లేయర్ల ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరు 2027 వరల్డ్ కప్ కు సిద్ధంగా ఉన్నట్లే అని కితాబు ఇస్తున్నారు. అయితే వారు ఇద్దరు ఆడిన మ్యాచ్‌లను మాత్రం బీసీసీఐ ప్రసారం చేయలేదు. వేరే జట్లు ఆడిన రెండు మ్యాచ్‌లను మాత్రం ప్రసారం చేశారు. దీంతో బీసీసీఐపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయి ఉండి టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఆడే మ్యాచ్‌లను ప్రసారం చేయలేరా, మీ దగ్గర డబ్బులు లేవా, విజయ్ హజారే ట్రోఫీలో ఇతర జట్లకు చెందిన మ్యాచ్‌లను ప్రసారం చేసే బదులు రోహిత్, కోహ్లి ఆడిన ఆ రెండు మ్యాచ్‌లను ప్రసారం చేసి ఉండవచ్చు కదా.. అని ఫ్యాన్స్ బీసీసీఐ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కోహ్లి ఢిల్లీ జట్టు తరఫున బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆడాల్సి ఉంది. దీంతో ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆసక్తిని చూపించారు. అయితే భద్రతా కారణాలతో ఫ్యాన్స్‌కు అనుమతి ఇవ్వలేమని ఆ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో చివరి నిమిషంలో వేదికను మార్చారు.
ఇక రోహిత్ శర్మ ముంబై జట్టు తరఫున జైపూర్‌లోని ఓ స్టేడియంలో మ్యాచ్ ఆడాడు. ఆ స్టేడియంకు కేవలం కొందరు ప్రేక్షకులను మాత్రమే అది కూడా చాలా దూరం నుంచి చూసేందుకు అనుమతిచ్చారు. దీంతో తమ ఫేవరెట్ ప్లేయర్ బ్యాటింగ్ చూడలేకపోయామని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు ప్లేయర్ల మ్యాచ్‌లను టీవీలో కూడా ప్రసారం చేయలేదు. వేరే జట్ల మ్యాచ్‌లను ప్రసారం చేశారు. ఇది ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో వారు బీసీసీఐపై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే రోహిత్, కోహ్లి ఆడిన స్టేడియంలలో మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు గాను ఉపయోగించే కెమెరాలు, ఇతర పరికరాలను సరిగ్గా అమర్చలేరని, అందుకనే మ్యాచ్‌లను ప్రసారం చేయలేకపోయారని తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో జరగనున్న మిగిలిన మ్యాచ్‌లలో అయినా రోహిత్, కోహ్లి ఆడే మ్యాచ్‌లను ప్రసారం చేస్తారా, లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



