T20 World Cup 2026 South Africa Team | టీ20 వరల్డ్ కప్‌కు సౌతాఫ్రికా జట్టు ఎంపిక.. స్టార్ ప్లేయర్లకు ఉద్వాసన..
T20 World Cup 2026 South Africa Team | భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా వరకు క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించేశాయి. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు తమ వరల్డ్ కప్ టీమ్‌లను ప్రాబబుల్స్ గా వెల్లడించాయి.
T20 World Cup 2026 South Africa Team | భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా వరకు క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించేశాయి. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు తమ వరల్డ్ కప్ టీమ్‌లను ప్రాబబుల్స్ గా వెల్లడించాయి. ఇక ఇదే కోవలో సౌతాఫ్రికా కూడా టీ20 వరల్డ్ కప్ కోసం తమ జట్టు సభ్యులను ప్రకటించింది. అయితే ఆ జట్టు మాత్రం ప్లేయర్ల ఎంపికలో సంచలన నిర్ణయం తీసుకుంది. పలువురు స్టార్ ఆటగాళ్లను ఏకంగా పక్కన పెట్టింది. దీంతో క్రికెట్ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ర్యాన్ రికిల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ పక్కకు..
భారత జట్టు సెలెక్టర్లు కూడా శుబమన్ గిల్‌ను ఎంపిక చేయకుండా షాకిచ్చిన విషయం తెలిసిందే. అయితే గిల్ ఫామ్‌లో లేడు. కనుక అతన్ని తీసుకుని రిస్క్ చేయలేమని భావించిన సెలెక్టర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌ల వైపే మొగ్గు చూపారు. కనుక సెలెక్టర్లు ఒక విధంగా మంచి నిర్ణయమే తీసుకున్నారని చెప్పవచ్చు. కానీ సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మాత్రం ఫామ్‌లో ఉన్న ప్లేయర్లను పక్కన పెట్టి షాకిచ్చింది. ఆ దేశ టీ20 లీగ్ ఎస్ఏ20 టోర్నీలో స్వైర విహారం చేస్తున్న ర్యాన్ రికిల్టన్‌ను ప్రోటీస్ క్రికెట్ బోర్డు పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇదే లీగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్, బార్ట్ మన్, రస్సీ వాన్ డర్ డుస్సెన్ వంటి ప్లేయర్లు కూడా సత్తా చాటుతున్నారు. అయినప్పటికీ వారిని ఆ దేశ క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయకుండా పక్కన పెట్టడం గమనార్హం. అయితే ఆ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
జట్టు ఇదే..
కాగా టీ20 వరల్డ్ కప్‌కు గాను సౌతాఫ్రికా జట్టు కెప్టెన్‌గా ఎయిడెన్ మార్కరమ్‌ను నియమించారు. ఇక ఇతర ప్లేయర్ల విషయానికి వస్తే కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోని డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, జార్డ్ లిండా, క్వెనా మఫాకా, జేసన్ స్మిత్ టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపికయ్యారు. వీరు ఇప్పుడు మొదటిసారిగా టీ20 వరల్డ్ కప్ ఆడుతుండడం విశేషం. అలాగే కగిసో రబాడా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోకియా, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్‌లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో సౌతాఫ్రికా గ్రూప్ డిలో ఇతర జట్లతో పోటీ పడనుంది. ఇందులో ఆఫ్గనిస్థాన్, కెనడా, న్యూజిలాండ్, యూఏఈ జట్లు ఉన్నాయి. అయితే సంచనాలు ఏమీ నమోదు కాకపోతే సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఈ గ్రూప్ నుంచి తదుపరి దశకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సఫారిల జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 9న కెనడాతో ఆడనుంది.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌దే విజయం.. ఆస్ట్రియన్ సైనిక నిపుణుడి సంచలన వ్యాఖ్యలు..!
మే 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



