T20 World Cup 2026 | టిమ్ డేవిడ్‌ను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న ఆసీస్.. కారణం అదేనా..?
T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుకు అపశకునాలు ఎదురవుతున్నాయి. గాయంతో జట్టుకు దూరమైన పవర్‌హిట్టర్ టిమ్ డేవిడ్ తిరిగి జట్టులో చేరినప్పటికీ గ్రూప్ దశలో అతను అందుబాటులోకి రావడంపై ఇంకా స్పష్టత రాలేదు.
T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుకు అపశకునాలు ఎదురవుతున్నాయి. గాయంతో జట్టుకు దూరమైన పవర్‌హిట్టర్ టిమ్ డేవిడ్ తిరిగి జట్టులో చేరినప్పటికీ గ్రూప్ దశలో అతను అందుబాటులోకి రావడంపై ఇంకా స్పష్టత రాలేదు. పాకిస్థాన్‌తో జరిగిన తాజా టీ20 సిరీస్‌కు తొడ కండరాల గాయం కారణంగా దూరమైన టిమ్ డేవిడ్ ఇప్పుడు ప్రపంచకప్‌లో ఆడుతున్నాడు. అయితే పూర్తిగా ఫిట్‌నెస్ సాధించే వరకు అతన్ని జాగ్రత్తగా వినియోగించాలనే ఆలోచనలో జట్టు మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ టెస్టును పూర్తిచేసి వైద్య అనుమతి పొందినప్పటికీ టిమ్ డేవిడ్‌ను వెంటనే ఆడించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధంగా లేనట్లు సమాచారం. కీలక నాకౌట్ మ్యాచ్‌ల నాటికి అతన్ని యాక్టివ్‌గా ఉంచడమే లక్ష్యంగా గ్రూప్ దశ మ్యాచ్‌లకు దూరంగా ఉంచే అవకాశముందని తెలుస్తోంది.
గ్రూబ్ బి మ్యాచ్‌లకు టిమ్ డేవిడ్ దూరం..?
అయితే ఈ విషయంపై జట్టు మేనేజ్‌మెంట్‌తో టిమ్ డేవిడ్ పర్సనల్‌గా మాట్లాడినట్లు తెలుస్తోంది. తనకు ఇప్పుడు ఆడాలని ఉన్నా, కోచ్‌లు మాత్రం కాస్త ఆగాలని సూచించారని తెలిసింది. మిడిల్ ఆర్డర్‌లో వేగంగా మ్యాచ్ గమనాన్ని మార్చగల ఆటగాడైన టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియాకు కీలక అస్త్రంగా మారాడు. అందుకే మరో గాయం రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే టిమ్ డేవిడ్‌ను గ్రూప్ దశలో విశ్రాంతిలో ఉంచితే, ఆస్ట్రేలియా గ్రూప్-బిలో ఆడే తొలి నాలుగు మ్యాచ్‌లకు అతను దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్‌లు ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక, ఓమన్ జట్లతో జరగనున్నాయి. వీటిలో ఫిబ్రవరి 16న సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంకతో జరిగే మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది. గ్రూప్ ఫలితాలపై ప్రభావం చూపే ఈ మ్యాచ్‌లో డేవిడ్ లేకపోవడం ఆస్ట్రేలియాకు లోటుగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
సూపర్ 8 స్టేజిలోనే ఎంట్రీ..?
ఇక టిమ్ డేవిడ్ పరిస్థితి మాత్రమే కాదు, గాయాల సమస్య ఆస్ట్రేలియాను మొత్తం వెంటాడుతోంది. స్టార్ పేసర్, రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్ను గాయం కారణంగా ఇప్పటికే టోర్నీకి దూరమయ్యాడు. అతని స్థానంలో బిగ్ బాష్ లీగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన బెన్ డ్వార్షుయిస్‌ను ఎంపిక చేశారు. అదే విధంగా అనుభవజ్ఞుడైన పేసర్ జోష్ హేజల్‌వుడ్ కూడా పూర్తిగా కోలుకోకపోవడంతో ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అతను గత యాషెస్ సిరీస్‌కూ అందుబాటులో లేడు. కాగా సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టును మిచెల్ మార్ష్ నడిపించనున్నాడు. కీలక దశల్లో ఆటగాళ్లను సరిగ్గా వినియోగించడమే విజయానికి మార్గమని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే ముఖ్య ఆటగాళ్లను రక్షిస్తూ, అవసరమైన వేళ పూర్తి బలంతో బరిలోకి దిగాలన్నదే ఆస్ట్రేలియా వ్యూహంగా మారిందని అర్థమవుతోంది. ఈ క్రమంలో టిమ్ డేవిడ్ సూపర్ 8 స్టేజ్‌లో మ్యాచ్‌లు ఆడుతాడని స్పష్టమవుతోంది. అయితే అభిమానులు మాత్రం గ్రూప్ దశలో అతని భారీ సిక్సర్లను వీక్షించే అవకాశాన్ని కోల్పోనున్నారు.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

Tim David | టిమ్ డేవిడ్‌కు షాక్.. 30శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించిన ఐపీఎల్..!
మే 12, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



