Suryakumar Yadav | సందిగ్ధంలో సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు.. టీ20 వరల్డ్ కప్ వరకే చాన్స్..?
Suryakumar Yadav | ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ టీ20 సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం ముగిసిన సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ను కూడా భారత్ 3-1 తేడాతో చేజిక్కించుకుంది.
Suryakumar Yadav | ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ టీ20 సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం ముగిసిన సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ను కూడా భారత్ 3-1 తేడాతో చేజిక్కించుకుంది. ఈ క్రమంలోనే టీ20లలో కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ రికార్డు అద్భుతంగా ఉంది. ఏకంగా 80 శాతానికి పైగా సక్సెస్ రేటుతో సూర్య దూసుకుపోతున్నాడు. అయితే కెప్టెన్‌గా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినప్పటికీ ప్లేయర్ గా కనీసం పాస్ మార్కులను కూడా సూర్య పొందలేకపోతున్నాడు. ఈ మధ్య కాలంలో అతను 30 పైచిలుకు స్కోరు చేసిన ఇన్నింగ్స్‌ను దాదాపుగా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. దీంతో రానున్న టీ20 వరల్డ్ కప్‌లో సూర్య బ్యాటింగ్ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు.
ఒక్క మ్యాచ్ చాలు..
ఇక టీ20 వరల్డ్ కోసం బీసీసీఐ ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆశ్చర్యంగా అందులో నుంచి వైస్ కెప్టెన్ శుబమన్ గిల్‌ను తప్పించారు. ఇషాన్ కిషన్, సంజులకు చోటు కల్పించారు. గిల్ ఫామ్ లో లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్య చెప్పారు. అయితే సూర్య మాటేమిటి..? అతను కూడా ఫామ్ లో లేడు కదా..? అంటే.. అవును.. కానీ సూర్య కెప్టెన్‌గా మంచి సక్సెస్ రేట్‌లో దూసుకెళ్తున్నాడు. కనుక అతని కెప్టెన్సీ టీమిండియాకు అవసరం. మరి బ్యాటింగ్ సరిగ్గా చేయడం లేదు కదా.. అంటే.. అది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమే. కానీ ఫామ్‌లో ఉండడం, లేకపోవడం అన్నది ఒక్క మ్యాచ్‌తో పని. కేవలం ఒక్క మ్యాచ్‌లో మెరుగైన ఇన్నింగ్స్ ఆడితే చాలు, అది సూర్య లాంటి బ్యాట్స్‌మెన్‌కు ఎంతో ఆత్మ విశ్వాసాన్ని అందిస్తుంది. దీంతో తరువాతి మ్యాచ్‌లలోనూ స్థిరమైన ప్రదర్శన చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఫ్యాన్స్ కూడా సూర్య నుంచి అదే కోరుకుంటున్నారు.
కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాడు కాబట్టే..
అయితే కెప్టెన్‌గా రాణిస్తున్న కారణంగానే సూర్య ఇంకా జట్టులో ఉన్నాడు. అదే ఒక సాధారణ ప్లేయర్‌గా ఉండి ఉంటే ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కు కూడా అతన్ని ఎంపిక చేసేవారు కాదేమో అంటే అతిశయోక్తి కాదు. కేవలం కెప్టెన్ గా బాగా సక్సెస్ అయ్యాడన్న కారణంగానే సూర్య ఇప్పటికీ ఇంకా జట్టులో ఉన్నాడు. లేదంటే అతన్ని గిల్ మాదిరిగానే పక్కన పెట్టేసి ఉండేవాళ్లు. ఈ క్రమంలోనే రానున్న న్యూజిలాండ్ సిరీస్ అతనికి కీలకంగా మారింది. కనీసం ఆ సిరీస్‌లో అయినా బ్యాట్‌తో రాణించాలని సూర్య కోరుకుంటున్నాడు. అయితే ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించారు కనుక ఆ టోర్నీ ముగిసే వరకు అతని కెప్టెన్సీకి ఢోకా ఉండదు. కానీ టోర్నీలో జట్టు ఫలితం ఎలా ఉన్నా సరే అతను ఆ తరువాత కొనసాగే అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే చాలా మంది ప్లేయర్లు ఇప్పటికే క్యూలో ఉన్నారు. పైగా సూర్య వయస్సు ప్రస్తుతం 35 ఏళ్లు. వచ్చే టీ20 వరల్డ్ కప్‌కు ఇంకా వయస్సు పెరుగుతుంది. కనుక అప్పటి వరకు సూర్యను కెప్టెన్‌గా కొనసాగించే అవకాశాలు దాదాపుగా ఉండవు. ఇప్పటి నుంచే వేరే ప్లేయర్‌ను కెప్టెన్‌గా నియమించి జట్టును రూపొందిస్తారు. కనుక ఇప్పుడు జరగబోయే టీ20 వరల్డ్ కప్ సూర్యకు కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఆఖరిది అని చెప్పవచ్చు. అందువల్ల టీ20 వరల్డ్ కప్ అనంతరం సూర్య భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
టీమిండియా కప్పు గెలిచినా, గెలవకపోయినా టోర్నీ తరువాత సూర్యకు బదులుగా ఇంకో ప్లేయర్‌ను కెప్టెన్ గా చేసే చాన్స్ ఉంటుంది. అప్పటి వరకు సూర్య ఫామ్‌లో ఉంటే ఇంకొన్నా ళ్ల పాటు జట్టులో కొనసాగుతాడు. లేకపోతే ఉద్వాసన పలకక తప్పదు. దీంతో అతని కెరీర్ దాదాపుగా ముగిసినట్లే అవుతుంది. ఈ క్రమంలోనే సూర్య ఇదే పేలవమైన ఆట తీరును వరల్డ్ కప్‌లోనూ కొనసాగించి చివరకు అలాగే నిష్క్రమిస్తాడా, లేక ఇంకొన్నాళ్ల పాటు జట్టులో ఉంటాడా..? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది. ఏది ఏమైనా రానున్న న్యూజిలాండ్ టీ20 సిరీస్ మాత్రం అతనికి కీలకంగా మారనుందని చెప్పవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



