Daniel Vettori | పాక్ ప్లేయర్‌ను కొనడంపై వివరణ ఇచ్చిన సన్ రైజర్స్ కోచ్
Daniel Vettori | ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి చెందిన ది హండ్రెడ్ 2026 టోర్నమెంట్ ప్లేయర్ల వేలంలో పాకిస్థాన్ బౌలింగ్ ఆల్ రౌండర్ అబ్రార్ అహ్మద్‌ను సన్ రైజర్స్ యాజమాన్యం కొనుగోలు చేయడంపై భారత్‌లో భారీ ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచ్ డానియెల్ వెటోరీ స్పందించారు.
Daniel Vettori | ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి చెందిన ది హండ్రెడ్ 2026 టోర్నమెంట్ ప్లేయర్ల వేలంలో పాకిస్థాన్ బౌలింగ్ ఆల్ రౌండర్ అబ్రార్ అహ్మద్‌ను సన్ రైజర్స్ యాజమాన్యం కొనుగోలు చేయడంపై భారత్‌లో భారీ ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచ్ డానియెల్ వెటోరీ స్పందించారు. పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేసిన నిర్ణయం సరైందేనని స్పష్టం చేశారు. అబ్రార్ భిన్న రకాలుగా బౌలింగ్ చేయగలడు. అతని బౌలింగ్‌లో ఇంకా చాలా మంది ప్లేయర్లు ఆడలేదు. ఇది మా టీమ్‌కు ప్లస్ పాయింట్ అవుతుంది.. అని వెటోరీ చెప్పారు. పాకిస్థాన్ ప్లేయర్లపై వస్తున్న విమర్శల గురించి తనకు తెలుసని, అయితే వారిని ఎంపిక చేయవద్దనే ప్రత్యేక సూచనలు ఏవీ తమకు అందలేదని తెలిపారు.
అబ్రార్‌కు ప్రాధాన్యత ఇచ్చాం: వెటోరీ
వేలానికి వచ్చేటప్పుడు అందుబాటులో ఉన్న ప్రతి ప్లేయర్‌ను తాము పరిశీలించామని వెటోరీ తెలిపారు. అబ్రార్ అందుబాటులోకి వచ్చిన వెంటనే అతను తమ ఎంపికలో ఉన్నాడని వివరించారు. అయితే అబ్రార్‌కే తాము తొలి ప్రాధాన్యతను ఇచ్చామని పేర్కొన్నారు. కాగా ఈ వేలంలో అమ్ముడైన రెండో పాకిస్థాన్ ప్లేయర్‌గా అబ్రార్ నిలిచాడు. అతని కంటే ముందు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ను బర్మింగ్ హామ్ ఫీనిక్స్ జట్టు 1.40 లక్షల పౌండ్లకు (దాదాపు రూ.1.72 కోట్లు) కొనుగోలు చేసింది. అయితే బర్మింగ్ హామ్ ఫీనిక్స్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీలతో ఎలాంటి సంబంధం లేదు.
కావ్యా మారన్‌పై విమర్శలు..
కాగా మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కోసం సన్‌రైజర్స్ లీడ్స్, ట్రెంట్ రాకెట్స్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు అతడిని 1.90 లక్షల పౌండ్లకు (దాదాపు రూ.2.34 కోట్లు) సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేసింది. ఈ వేలం కార్యక్రమానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్యా మారన్ హాజరయ్యారు. వేలం ప్రక్రియలో ఆమె స్వయంగా పాల్గొని బిడ్డింగ్ నిర్వహించారు. అయితే ఈ వేలంలో అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టును నిషేధించాలని, కావ్య మారన్ క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయితే పాకిస్థాన్ ఫ్యాన్స్ మాత్రం తమ ప్లేయర్‌ను కొన్నందుకు కావ్యకు కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని క్రీడగా చూడాలని, రాజకీయాలు ఆపాదించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. ఇక ది హండ్రెడ్ టోర్నమెంట్ జూలై 21 నుంచి ఆగస్టు 16 వరకు జరగనుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



