త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Smriti Mandhana | మ‌రో అరుదైన రికార్డు సాధించిన స్మృతి మంధాన‌.. 10వేల ప‌రుగుల క్ల‌బ్ లో చేరిక‌..

Smriti Mandhana | భార‌త మ‌హిళా క్రికెట్ జట్టు ఓపెనింగ్ ప్లేయర్ స్మ‌తి మంధాన మ‌రో అరుదైన రికార్డును సాధించింది. 2025లో ఆమె అనేక రికార్డులు సాధించ‌గా తాజాగా సాధించిన రికార్డు మాత్రం చాలా ప్ర‌త్యేక‌మైన‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ఏడాది అంతా ఆమెకు అద్భుతంగా కొన‌సాగింది.

S

Sports | Published On Dec 29, 2025, 6.57 pm IST

Smriti Mandhana | మ‌రో అరుదైన రికార్డు సాధించిన స్మృతి మంధాన‌.. 10వేల ప‌రుగుల క్ల‌బ్ లో చేరిక‌..
Advertisement

Smriti Mandhana | భార‌త మ‌హిళా క్రికెట్ జట్టు ఓపెనింగ్ ప్లేయర్ స్మ‌తి మంధాన మ‌రో అరుదైన రికార్డును సాధించింది. 2025లో ఆమె అనేక రికార్డులు సాధించ‌గా తాజాగా సాధించిన రికార్డు మాత్రం చాలా ప్ర‌త్యేక‌మైన‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ఏడాది అంతా ఆమెకు అద్భుతంగా కొన‌సాగింది. ఈ క్ర‌మంలోనే తిరువ‌నంత‌పురంలో తాజాగా శ్రీ‌లంక‌తో జ‌రిగిన 4వ టీ20 మ్యాచ్‌లో అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. మ‌హిళా క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 10వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న 4వ ప్లేయ‌ర్‌గా నిలిచింది. ఈ జాబితాలో భార‌త మాజీ ప్లేయ‌ర్ మిథాలి రాజ్ ఇప్ప‌టికే అగ్ర స్థానంలో ఉండ‌గా, ఇప్పుడు ఆ క్ల‌బ్ లో స్మృతి చేరింది. శ్రీ‌లంక‌తో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో 10వేల ప‌రుగుల మైలు రాయికి 27 ప‌రుగుల దూరంలో నిలిచిన స్మృతి ఈ రికార్డును ఎట్ట‌కేల‌కు సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసి భార‌త్ గెలుపులో కీల‌క‌పాత్ర పోషించ‌డ‌మే కాక ఆ అరుదైన ఘ‌న‌త‌ను కూడా సొంతం చేసుకుంది.

మ‌హిళ‌ల క్రికెట్‌లో అంత‌ర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 10వేల ప‌రుగుల‌ను పూర్తి చేసుకున్న ప్లేయ‌ర్లు ముగ్గురే ఉన్నారు. వారిలో భార‌త మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ 10,868 ప‌రుగుల‌తో అగ్ర‌స్థానంలో ఉండ‌గా, న్యూజిలాండ్‌కు చెందిన సూజీ బేట్స్ 10,652 ప‌రుగుల‌తో రెండో స్థానంలో ఉంది. అలాగే ఇంగ్లండ్‌కు చెందిన షార్లెట్ ఎడ్‌వార్డ్స్ 10,273 పరుగుల‌తో మూడో స్థానంలో నిలిచింది. ఇక శ్రీ‌లంక‌తో జ‌రిగిన తాజా మ్యాచ్‌లో స్మృతి మంధాన 80 ప‌రుగులు చేసింది. దీంతో అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 10వేల ప‌రుగులు చేసిన 4వ ప్లేయ‌ర్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలోనే మ్యాచ్ అనంత‌రం స్మృతి 10,053 ప‌రుగుల‌తో ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిల‌వ‌డం విశేషం.

అయితే మిథాలి రాజ్ రికార్డుకు మ‌రో 800 ప‌రుగుల దూరంలోనే స్మృతి ఉంది. పైగా ఆమెకు ఇంకా బోలెడంత ఆట మిగిలి ఉంది. క‌నుక ఆమె క‌చ్చితంగా ఆ రికార్డును కూడా బ్రేక్ చేసి ఆ జాబితాలో అగ్ర స్థానంలో నిలుస్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇందుకు ఆమెకు మ‌రో ఏడాది లేదా రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అప్ప‌టి వ‌ర‌కు ఆమె ఎలాగూ క‌చ్చితంగా ఆడుతుంది కాబ‌ట్టి ఆ రికార్డు కూడా బ్రేక్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కాగా స్మృతి వ‌న్డేల్లో 5322 ప‌రుగులు చేయ‌గా, టీ20ల‌లో 4022 ప‌రుగులు చేసింది. టెస్టుల్లో 629 ప‌రుగులు సాధించింది. ఇక ఈ ఘ‌న‌త సాధించేందుకు స్మృతికి మొత్తం అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 281 ఇన్నింగ్స్ ప‌ట్ట‌డం విశేషం. అయితే మిథాలి క‌న్నా స్మృతి 10 త‌క్కువ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘ‌న‌త సాధించింది.

కాగా స్మృతి మంధాన అంత‌ర్జాతీయ మ‌హిళ‌ల క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 17 సెంచ‌రీలు సాధించ‌డం విశేషం. 2 సెంచ‌రీల‌ను ఆమె టెస్టుల్లో న‌మోదు చేయ‌గా, టీ20ల‌లో ఒక సెంచరీ సాధించింది. ఇక మిగిలిన 14 సెంచ‌రీల‌ను వ‌న్డేల‌లో సాధించింది. అయితే వాటిల్లో 9 సెంచ‌రీల‌ను ఆమె గ‌త 2 ఏళ్ల కాలంలోనే సాధించ‌డం విశేషం. ఇక వ‌న్డేల‌లో 5వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న 5వ ప్లేయ‌ర్‌గా మంధాన ఈ ఏడాది ఇప్ప‌టికే రికార్డు సాధించింది. అలాగే టీ20ల‌లో 4వేల‌కు పైగా ప‌రుగులు పూర్తి చేసుకున్న రెండో ప్లేయ‌ర్ గా కూడా ఆమె రికార్డుల‌కెక్కింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ ప్లేయ‌ర్ సూజీ బేట్స్ తొలి స్థానంలో ఉంది. ఇక తాజాగా శ్రీ‌లంకతో జరిగిన నాలుగో టీ20లో మంధాన కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడింది. 48 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 80 ప‌రుగులు చేసి టీమిండియా విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement