త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanju Samson | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు.. క‌ల‌వ‌ర పెడుతున్న సంజు శాంస‌న్ ఫామ్‌..?

Sanju Samson | మ‌రికొద్ది రోజుల్లో భార‌త్‌, శ్రీ‌లంక వేదిక‌లుగా టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 మెగా టోర్నీ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జ‌ట్ల‌న్నీ ఇప్ప‌టికే ప్రాక్టీస్ మొద‌లు పెట్టేశాయి. ప‌లు దేశాలు ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల‌తో బిజీగా ఉన్నాయి. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ముందు త‌మ ప్లేయ‌ర్లు, బెంచ్ సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షించుకుంటున్నాయి.

S

Sports | Published On Jan 28, 2026, 12.23 pm IST

Sanju Samson | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు.. క‌ల‌వ‌ర పెడుతున్న సంజు శాంస‌న్ ఫామ్‌..?
Advertisement

Sanju Samson | మ‌రికొద్ది రోజుల్లో భార‌త్‌, శ్రీ‌లంక వేదిక‌లుగా టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 మెగా టోర్నీ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జ‌ట్ల‌న్నీ ఇప్ప‌టికే ప్రాక్టీస్ మొద‌లు పెట్టేశాయి. ప‌లు దేశాలు ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల‌తో బిజీగా ఉన్నాయి. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ముందు త‌మ ప్లేయ‌ర్లు, బెంచ్ సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షించుకుంటున్నాయి. కొన్ని దేశాలు అస‌లు ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ ఇచ్చి ద్వైపాక్షిక సిరీస్‌ల‌లో సాధార‌ణ ప్లేయ‌ర్ల‌తో పాల్గొంటున్నాయి. అయితే టీమిండియా కూడా ప్ర‌స్తుతం కివీస్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. అందులో భాగంగానే ఇప్ప‌టికే 5 టీ20ల సిరీస్‌లో 3-0 ఆధిక్యాన్ని సాధించ‌డమే కాక‌, సిరీస్‌ను సైతం కైవ‌సం చేసుకుంది. అయితే అంతా బాగానే ఉంది కానీ, ఓపెన‌ర్, వికెట్ కీప‌ర్ సంజు శాంస‌న్ ఫామ్ ఇప్పుడు టీమిండియా స‌భ్యుల‌ను, అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది.

అనూహ్యంగా ప్ర‌పంచ క‌ప్‌కు ఎంపిక‌..

ఇటీవ‌ల సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో అనూహ్యంగా ఓ మ్యాచ్‌లో అవ‌కాశం ద‌క్కించుకున్న సంజు ఏకంగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఎంపిక‌య్యాడు. ఆ మ్యాచ్‌లో 37 ప‌రుగులు చేసిన సంజు శాంస‌న్ త‌న‌దైన శైలిలో షాట్ల‌తో అల‌రించాడు. ఆ మ్యాచ్ త‌రువాత సంజు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఎంపిక‌వ‌డంతో ఇక గిల్ స్థానంలో చ‌క్క‌ని బ్యాట‌ర్ ల‌భించిన‌ట్లే, టీమిండియాకు వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఎదురు ఉండ‌దు.. అని అంద‌రూ భావించారు. అయితే ఆ త‌రువాత వ‌ర‌ల్డ్ కప్ టీమ్‌నే బీసీసీఐ కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసింది. దీంతో అదే టీమ్ ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌తో ఆడుతోంది. అందులో భాగంగానే సంజు శాంస‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా మూడు మ్యాచుల్లోనూ ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగాడు. కానీ ఈ మూడు మ్యాచ్‌ల‌లోనూ సంజు పేల‌వ‌మైన ఆట తీరును క‌న‌బ‌రిచాడు.

వ‌రుస‌గా 3 మ్యాచుల్లో విఫ‌లం..

కివీస్‌తో మొద‌టి మ్యాచ్ ఈ నెల 21వ తేదీన నాగ‌పూర్‌లో జ‌ర‌గ్గా అందులో సంజు శాంస‌న్ కేవ‌లం 10 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట్ అయ్యాడు. అనంత‌రం 23వ తేదీన రాయ్‌పూర్ టీ20లో 6 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గా, తాజాగా 25వ తేదీన గువాహ‌టిలో నిర్వ‌హించిన మూడ‌వ టీ20లో ఏకంగా తొలి బంతికే డ‌కౌట్ అయ్యాడు. ఈ క్ర‌మంలో సంజు శాంస‌న్ ఫామ్ పై అనుమానాలు త‌లెత్తున్నాయి. కివీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాతో ఆడిన ఒక మ్యాచ్‌లో, అంతకు ముందు దేశ‌వాళీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ సంజు శాంస‌న్ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న‌ట్లు క‌నిపించాడు. అలాగే ఆడాడు కూడా. కానీ ఇప్పుడు వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల‌లో విఫ‌లం కావ‌డం అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతోంది. టీ20 ప్ర‌పంచ క‌ప్ ముందు అంద‌రూ ఓ వైపు ఫామ్‌లోకి వ‌స్తుంటే సంజు మాత్రం ఫామ్‌ను కోల్పోతున్నాడ‌ని ఫ్యాన్స్, మాజీలు, విశ్లేష‌కులు కామెంట్ చేస్తున్నారు.

ఓపెన‌ర్‌గా ఇషాన్ కిష‌న్‌, మిడిలార్డ‌ర్‌లో తిల‌క్‌..?

అయితే సంజు బ్యాటింగ్‌పై అనుమానాలు లేవ‌ని, అత‌ను క‌చ్చితంగా అద్భుత‌మైన ప్లేయ‌ర్ అని ఇప్ప‌టికే అత‌నికి జ‌ట్టు స‌భ్యులు మ‌ద్ద‌తుగా నిలిచారు. అలాగే మ‌రోవైపు కోచ్ గంభీర్ కూడా ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా తీసుకుని సంజు కోసం ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అత‌ను క‌చ్చితంగా చ‌క్క‌ని ప్ర‌ద‌ర్శ‌న ఇస్తాడ‌ని, అప్పుడ‌ప్పుడు ఇలా జ‌ర‌గ‌డం స‌హ‌జ‌మేన‌ని అంటున్నారు. అయితే ఒక వేళ సంజు గ‌న‌క ఫామ్‌లోకి రాకుండా ఇలాగే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లోనూ గ్రూప్ ద‌శ‌లో ప్ర‌ద‌ర్శ‌న ఇస్తే.. అప్పుడు క‌చ్చితంగా ఇషాన్ కిష‌న్‌ను ఓపెన‌ర్‌గా పంపించే చాన్స్ అధికంగా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎలాగూ కిష‌న్ ఫామ్‌లో ఉన్నాడు క‌నుక ఓపెన‌ర్ గా లేదా మొద‌టి వికెట్ అనంత‌రం ఆడినా పెద్ద తేడా ఉండ‌దు. క‌నుక సంజు విఫ‌లం అయితే అత‌ని స్థానంలో ఇషాన్‌ను ఆడించాల‌ని చూస్తున్నారు. అయితే సంజుని ఓపెన‌ర్‌గా తీసేస్తే మిడిలార్డ‌ర్‌లో పంపిస్తారా లేక ఆ స్థానంలో తిల‌క్ వ‌ర్మ‌ను ఆడిస్తారా.. అన్న విష‌యం తేలాల్సి ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement