త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjay Manjrekar | మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం.. ఆ త‌ప్పు వ‌ల్లే 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ పోయింది..?

Sanjay Manjrekar | భార‌త క్రికెట్ జ‌ట్టు ఈ మ‌ధ్య కాలంలో ఐసీసీ ఈవెంట్‌ల‌లో స‌త్తా చాటుతూనే వ‌స్తోంది. పురుషులు, మ‌హిళ‌లు పోటీ ప‌డి మ‌రీ రాణిస్తున్నారు. 2024లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్, ఆ త‌రువాత 2025లో చాంపియ‌న్స్ ట్రోఫీ, మొన్నీ మ‌ధ్యే మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌.. ఇలా టీమిండియా ఎన్నో ఘ‌న విజ‌యాల‌ను సాధించింది.

S

Sports | Published On Dec 27, 2025, 10.47 am IST

Sanjay Manjrekar | మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం.. ఆ త‌ప్పు వ‌ల్లే 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ పోయింది..?
Advertisement

Sanjay Manjrekar | భార‌త క్రికెట్ జ‌ట్టు ఈ మ‌ధ్య కాలంలో ఐసీసీ ఈవెంట్‌ల‌లో స‌త్తా చాటుతూనే వ‌స్తోంది. పురుషులు, మ‌హిళ‌లు పోటీ ప‌డి మ‌రీ రాణిస్తున్నారు. 2024లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్, ఆ త‌రువాత 2025లో చాంపియ‌న్స్ ట్రోఫీ, మొన్నీ మ‌ధ్యే మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌.. ఇలా టీమిండియా ఎన్నో ఘ‌న విజ‌యాల‌ను సాధించింది. అయిన‌ప్ప‌టికీ 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఓట‌మి మాత్రం ఇప్ప‌టికీ ఫ్యాన్స్‌ను బాధిస్తోంది. ఆ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఓట‌మిని త‌ల‌చుకున్న‌ప్పుడ‌ల్లా గుండెల్లో ఏదో రాయి ప‌డిన‌ట్లు అనిపిస్తుంది. కోట్లాది మంది అభిమానులు క‌ప్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. మైదానంలో వేల మంది ఫ్యాన్స్ సొంత గ‌డ్డ‌పై క‌ప్ మ‌న‌దే అని ఆశించారు. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు అయ్యాయి. టీమిండియా ఫైన‌ల్‌లో ఘోర ఓట‌మి పాలైంది.

ఆ పొర‌పాటే కార‌ణం..?

అయితే ఆ మ్యాచ్ ఓట‌మి అనంత‌రం చాలా మంది ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేశారు. మాజీలు, విశ్లేకులు టీమిండియా ఓట‌మికి అనేక కార‌ణాల‌ను విశ్లేషించారు. కానీ ప్ర‌స్తుతం మ‌రో కొత్త విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. భారత మాజీ క్రికెట‌ర్‌, కామెంటేట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ ఇదే విష‌యంపై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించారు. 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఫైన‌ల్ మ్యాచ్ కోసం అహ్మ‌దాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఎంచుకున్న పిచ్ స‌రైంది కాద‌ని అన్నారు. అది చాలా స్లో పిచ్ అని, దాన్ని సెలెక్ట్ చేసుకుని త‌ప్పు చేశార‌ని అన్నారు. అలాంటి పిచ్ పై భార‌త బ్యాట్స్‌మెన్ షాట్ సెలెక్ష‌న్ స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్లే త్వ‌ర‌గా వికెట్ల‌ను స‌మర్పించుకున్నార‌ని, కాస్త ఓపిగ్గా ఆడి ఉంటే మ‌రిన్ని భారీ ప‌రుగులు సాధించి ఉండే వార‌ని, దీంతో చేజింగ్‌లో ఆసీస్‌కు క‌ష్టం అయ్యేద‌ని అన్నారు. ఈ విధంగా పిచ్ సెలెక్ష‌న్‌లో పొరపాటు చేయ‌డం వ‌ల్లే టీమిండియా ఆ మ్యాచ్‌లో ఓడింద‌ని అన్నారు.

కాగా సంజ‌య్ మంజ్రేక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు క్రికెట్ ప్ర‌పంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్ప‌టి వ‌ర‌కు లేని ఓ కొత్త అంశాన్ని తెర‌మీద‌కు తేవ‌డంతో మ‌ళ్లీ ఆ గాయాన్ని అంద‌రూ మ‌రోసారి బాధ‌గానైనా స‌రే చ‌ర్చించుకుంటున్నారు. అయితే త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీని భార‌త్‌లోనే నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఫైన‌ల్‌ను మ‌ళ్లీ అదే స్టేడియంలో ప్లాన్ చేస్తున్నారు. పాకిస్థాన్ ఫైన‌ల్‌కు చేరితే వేదిక శ్రీ‌లంక‌కు మారుతుంది. లేదంటే అదే స్టేడియం ఫైన‌ల్‌కు ఎంపిక‌వుతుంది. మ‌రి పాకిస్థాన్ ఫైన‌ల్‌కు చేరకుండా ఒక వేళ భార‌త్ గ‌న‌క ఫైన‌ల్‌కు చేరితే మ‌ళ్లీ అదే స్టేడియంలో ఆడాల్సి వ‌స్తుంది. అప్పుడు ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement