SRH | సన్‌రైజర్స్‌కు షాక్.. ఆస్ట్రేలియాకు కెప్టెన్ పాట్ కమిన్స్..! మళ్లీ తిరిగి వచ్చేనా..?
SRH | సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ఇప్పటికే రెండు మ్యాచులకు దూరమయ్యాడు. ఆషెస్ సిరీస్‌లో మూడో టెస్టు తర్వాత నుంచి వెన్ను నొప్పి కారణంగా మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఇదే కారణంతో టీ20 వరల్డ్ కప్‌కు సైతం దూరమయ్యాడు.
SRH | సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ఇప్పటికే రెండు మ్యాచులకు దూరమయ్యాడు. ఆషెస్ సిరీస్‌లో మూడో టెస్టు తర్వాత నుంచి వెన్ను నొప్పి కారణంగా మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఇదే కారణంతో టీ20 వరల్డ్ కప్‌కు సైతం దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుంటున్నప్పటికీ.. ఐపీఎల్ ప్రారంభానికి ముందే హైదరాబాద్ జట్టుతో కలిసిన నెట్స్‌లో బౌలింగ్ సాధన చేశాడు. అయితే, ఇంకా క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి మ్యాచులు ఆడేందుకు అనుమతి లభించలేదు. తుది అనుమతి కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం.. త్వరలో స్కానింగ్ చేయనుండగా.. క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగనుంది.
ఏప్రిల్ 17 నాటికి మళ్లీ జట్టులో చేరే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఐపీఎల్ తొలి భాగాన్ని మిస్ అయ్యే అవకాశం ఉందని కమిన్స్ హింట్స్ ఇచ్చాడు. తాజా షెడ్యూల్ ప్రకారం కనీసం తొలి ఐదు మ్యాచ్‌లకు దూరంగా దూరమవడం ఖాయంగా కనిపిస్తోంది. స్కాన్ ఫలితాల ఆధారంగా అందుబాటులో ఉంటాడా లేదా విషయంలో స్పష్టత రానుంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ తర్వాతి మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఘోర పరాజయం పాలైన హైదరాబాద్.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 65 పరుగుల తేడాతో గెలిచింది. 227 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంటూ.. ప్రత్యర్థిని 161 పరుగులకే కట్టడి చేసింది.
టోర్నీకి ముందు హైదరాబాద్ బౌలింగ్ బలహీనంగా కనిపించినా.. జయదేవ్ ఉనద్కట్, ఈషాన్ మాలింగ, నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా కమిన్స్ గైర్హాజరీలో ఈ బౌలర్లు జట్టుకు కీలకంగా నిలిచారు. ఇక లక్నోతో జరిగే మ్యాచ్‌లో ఇదే జోష్ కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ బౌలింగ్‌పై వచ్చిన విమర్శలకు నితీశ్ రెడ్డి సమాధానం ఇచ్చాడు. జట్టు బౌలింగ్ బలహీనంగా లేదని.. అనుభవం యువ ప్రతిభ మధ్య సమతుల్యత ఉందని తెలిపాడు. మీరనుకుంటున్నంత బలహీనంగా ఏమీ లేదని.. జయదేవ్ ఉనద్కట్, మాలింగ రాణిస్తున్నారని, పేన్ సైతం మంచి ప్రదర్శన ఇస్తున్నాడని పేర్కొన్నారు. తాము ఆడుతున్న ఆటతీరు, భారీ స్కోర్లు కారణంగా బ్యాటింగ్ బలంగా కనిపిస్తోందని.. బౌలింగ్ విభాగం సైతం అంతే బలంగా ఉందని స్పష్టం చేశాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






