Rajiv Shukla | బంగ్లా వెనుక పాక్ ఉంది.. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తీవ్ర ఆరోపణలు..
Rajiv Shukla | టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో బంగ్లాదేశ్ నిర్ణయం వెనుక పాకిస్థాన్ పాత్ర ఉందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తీవ్ర ఆరోపణలు చేశారు. భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ తప్పుకోవడంతో, చివరి నిమిషంలో స్కాట్లండ్‌ను టోర్నీలోకి చేర్చాల్సి వచ్చిందని, ఈ పరిణామాలకు పాకిస్థానే కారణమని ఆయన అన్నారు.
Rajiv Shukla | టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో బంగ్లాదేశ్ నిర్ణయం వెనుక పాకిస్థాన్ పాత్ర ఉందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తీవ్ర ఆరోపణలు చేశారు. భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ తప్పుకోవడంతో, చివరి నిమిషంలో స్కాట్లండ్‌ను టోర్నీలోకి చేర్చాల్సి వచ్చిందని, ఈ పరిణామాలకు పాకిస్థానే కారణమని ఆయన అన్నారు. మీడియాతో మాట్లాడిన శుక్లా బంగ్లాదేశ్‌కు పూర్తి భద్రత కల్పిస్తామని భారత్ హామీ ఇచ్చిందని స్పష్టం చేశారు. వారి ఆందోళనలను కూడా పరిష్కరించామని చెప్పారు. అయితే పాకిస్థాన్ జోక్యం వల్ల పరిస్థితి మరింత క్లిష్టతరమైందని అన్నారు. బంగ్లాదేశ్ ఆడాలని తాము కోరుకున్నామని, పూర్తి భద్రత కల్పిస్తామని కూడా చెప్పామని, కానీ వారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత చివరి నిమిషంలో మొత్తం షెడ్యూల్ మార్చడం చాలా కష్టం అయిందని, అందుకే స్కాట్లండ్‌ను తీసుకురావాల్సి వచ్చిందని శుక్లా తెలిపారు.
బంగ్లాదేశ్‌ను తప్పుదోవ పట్టిస్తున్న పాకిస్థాన్: శుక్లా
పాకిస్థాన్ పాత్రపై ఆయన మరింత ఘాటుగా స్పందించారు. ఎటువంటి కారణం లేకుండా పాకిస్థాన్ ఈ విషయంలో జోక్యం చేసుకుంటోంది. బంగ్లాదేశ్‌ను రెచ్చగొడుతోంది. ఒకప్పుడు బంగ్లాదేశ్ ప్రజలపై పాకిస్థాన్ చేసిన అఘాయిత్యాలు అందరికీ తెలుసు. ఇప్పుడు వారిని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం పూర్తిగా తప్పు అని శుక్లా విమర్శించారు. కాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ తమ జట్టు టీ20 వరల్డ్ కప్‌లో ఆడడంపై ఇంకా సందిగ్ధంలోనే ఉన్నామని చెప్పిన తరువాత శుక్లా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాకిస్థాన్ ఈ టోర్నీలో పాల్గొనే విషయమై శుక్రవారం లేదా సోమవారం నిర్ణయం తీసుకుంటామని నక్వీ చెప్పిన అనంతరం శుక్లా ఈ విమర్శలు చేశారు. మరో వైపు నక్వీ వ్యవహార శైలిపై సొంత దేశ మాజీ క్రికెటర్లే విమర్శలు చేస్తున్నారు. నక్వీ ఏ ప్రయోజనం ఆశించి ఇలా చేస్తున్నారో తెలియదు కానీ దీర్ఘకాలంలో పాక్ క్రికెట్‌కు ఆయన వ్యవహారం వల్ల భారీ ఎత్తున నష్టం వస్తుందని అంటున్నారు.
కాగా ఈ అనిశ్చితి నడుమ పాకిస్థాన్ ప్రపంచకప్ కోసం తమ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. మరోవైపు రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్‌ను కూడా బహిష్కరించే అంశాన్ని పీసీబీ పరిశీలిస్తున్నట్టు పాకిస్తాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే పాక్ ఈ సాహసానికి ఒడిగడితే తీవ్ర పరిణాలు ఉంటాయి కనుక అలా చేయకపోవచ్చని తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



