Rahul Dravid | లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పొందడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా: రాహుల్ ద్రావిడ్
Rahul Dravid | భారత క్రికెట్‌లోని గొప్ప దిగ్గజాలతో కలిసి తాను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నారు. బీసీసీఐ నిర్వహించిన నమన్ అవార్డ్స్ 2026లో ఆయన ఆ అవార్డును పొందిన అనంతరం మాట్లాడారు.
Rahul Dravid | భారత క్రికెట్‌లోని గొప్ప దిగ్గజాలతో కలిసి తాను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నారు. బీసీసీఐ నిర్వహించిన నమన్ అవార్డ్స్ 2026లో ఆయన ఆ అవార్డును పొందిన అనంతరం మాట్లాడారు. ఈ అవార్డు తనకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను కల్పించిందని ద్రావిడ్ అన్నారు. గతంలో ఈ గౌరవాన్ని అందుకున్న ప్రముఖ క్రికెట్ దిగ్గజాలు తనకు ప్లేయర్‌గా, కోచ్‌గా ఉన్న సమయంలో ఎంతో ప్రేరణను ఇచ్చారని తెలిపారు. ఈ అవార్డు అందుకోవడంపై తాను ఎంతో కృతజ్ఞతతో ఉన్నానని, భారత్‌లోని గొప్ప క్రికెట్ దిగ్గజాలను తాను ఎల్లప్పుడూ ఆదర్శంగా తీసుకుంటానని తెలిపారు. ఈ గౌరవం తనకు ఎంతో వినమ్రతను కలిగించిందని, చిన్నతనం నుంచి ప్రారంభమైన తన క్రికెట్ ప్రయాణాన్ని ఈ అవార్డు ప్రతిబింబిస్తుందని తెలిపారు.
ప్రస్తుత జట్టును చూస్తుంటే గర్వంగా ఉంది..
అండర్ 15 క్రికెట్‌లో మొదటిసారి ఆడిన రోజుల నుంచి ఇప్పటి వరకు భారత క్రికెట్ తో ఇంతకాలం అనుబంధంగా ఉండే అవకాశం లభించడంపై తాను ఎంతో కృతజ్ఞతతో ఉన్నానని ద్రావిడ్ తెలిపారు. ప్లేయర్‌గా ఆడినప్పుడు, కోచ్‌గా పనిచేసినప్పుడు తరతరాల సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేశానని అన్నారు. తనకు లభించిన అవకాశాల మేరకు శక్తివంచన లేకుండా ఉత్తమంగా పనిచేసేందుకు కృషి చేశానని తెలిపారు. ప్రస్తుతం ఉన్న క్రికెట్ జట్టును చూస్తుంటే తనకు గర్వంగా ఉందని, భారత్ ఇకపై కూడా ఇలాగే విజయాలను కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ప్లేయర్‌గా, కోచ్‌గా విజయాలు..
కాగా భారత క్రికెట్‌కు ప్లేయర్‌గా, కోచ్‌గా అందించిన విశేష సేవలకు గాను రాహుల్ ద్రావిడ్‌కు బీసీసీఐ ఈ అవార్డును అందజేసింది. ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 24వేలకు పైగా పరుగులు చేశారు. ఒక దశాబ్దానికి పైగా భారత బ్యాటింగ్ లైనప్‌కు ఒక వాల్ లాగా నిలిచారు. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా, కోచ్‌గా అనేక చారిత్రాత్మక విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ద్రావిడ్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీలో సేవలు అందించారు. యువ ఆటగాళ్లను వెలికి తీశారు. ఆయన కోచింగ్‌లో భారత అండర్ 19 జట్టు 2018లో వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. తరువాత భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన శిక్షణలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలచుకుంది.
ఇక ఇదే కార్యక్రమంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేయగా, మహిళల విభాగంలో మిథాలీ రాజ్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు. అలాగే శుబమన్ గిల్, స్మృతి మంధానలకు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు లభించాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



