త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGPSC | అక్టోబ‌ర్ 26న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీర్ ప‌రీక్ష‌.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!

TGPSC | ఈ నెల 26వ తేదీన‌(సోమ‌వారం) టీజీపీఎస్సీ( TGPSC ) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీర్( Assistant Environmental Engineer) పోస్టుల భ‌ర్తీకి రాత‌ప‌రీక్ష నిర్వ‌హించేందుకు స‌ర్వం సిద్ధం చేసింది. సీబీఆర్‌టీ( CBRT ) ప‌ద్ధ‌తిలో రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో 55 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

S

Telangana | Published On Oct 24, 2026, 7.39 pm IST

TGPSC | అక్టోబ‌ర్ 26న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీర్ ప‌రీక్ష‌.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!
Advertisement

TGPSC | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 26వ తేదీన‌(సోమ‌వారం) టీజీపీఎస్సీ( TGPSC ) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీర్( Assistant Environmental Engineer) పోస్టుల భ‌ర్తీకి రాత‌ప‌రీక్ష నిర్వ‌హించేందుకు స‌ర్వం సిద్ధం చేసింది. సీబీఆర్‌టీ( CBRT ) ప‌ద్ధ‌తిలో రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో 55 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ రాత‌ప‌రీక్ష‌ల‌కు 14489 మంది అభ్య‌ర్థులు హాజ‌రు కానున్నారు. ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 వ‌ర‌కు పేప‌ర్1, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్ 2 ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

అభ్య‌ర్థుల‌కు సూచ‌న‌లు ఇవే..

  • ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు ఉద‌యం 8.30 గంట‌ల‌కే ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల‌ని సూచించారు. 9.30 గంట‌ల వ‌ర‌కే అనుమ‌తి ఉంటుంద‌న్నారు. ఇక మ‌ధ్యాహ్నం సెష‌న్‌కు మ‌ధ్యాహ్నం 1 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తించ‌నున్నారు.
  • అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా త‌మ ఒరిజిన‌ల్ ఐడీ కార్డును తీసుకురావాల‌న్నారు.
  • ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌కు అనుమ‌తి లేదు.
  • చెప్పులు మాత్ర‌మే ధ‌రించాలి.
  • షూ వేసుకుంటే అనుమ‌తించ‌రు.
Advertisement
Advertisement