త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Under 19 World Cup | అండర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లోనూ నో హ్యాండ్ షేక్ వివాదం.. బంగ్లాదేశ్ కావాల‌నే అలా చేసిందా..?

Under 19 World Cup | అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా భార‌త్‌, బంగ్లాదేశ్ జట్ల కెప్టెన్ల మధ్య హ్యాండ్‌షేక్ జరగకపోవడంపై ఏర్పడిన వివాదానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టత ఇచ్చింది. ఇది పూర్తిగా అనుకోకుండా జరిగిన విషయం మాత్రమేనని, క్షణిక నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకుందని బీసీబీ తెలిపింది.

S

Sports | Published On Jan 18, 2026, 6.41 am IST

Under 19 World Cup | అండర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లోనూ నో హ్యాండ్ షేక్ వివాదం.. బంగ్లాదేశ్ కావాల‌నే అలా చేసిందా..?
Advertisement

Under 19 World Cup | అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా భార‌త్‌, బంగ్లాదేశ్ జట్ల కెప్టెన్ల మధ్య హ్యాండ్‌షేక్ జరగకపోవడంపై ఏర్పడిన వివాదానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టత ఇచ్చింది. ఇది పూర్తిగా అనుకోకుండా జరిగిన విషయం మాత్రమేనని, క్షణిక నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకుందని బీసీబీ తెలిపింది. దీనికి ఎలాంటి ఉద్దేశపూర్వక వైఖరి లేదని బోర్డు స్పష్టం చేసింది. ఈ సంఘటన బంగ్లాదేశ్ జట్టులో నాయకత్వ మార్పు నేపథ్యంలో చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా సాధారణ కెప్టెన్ మొహమ్మద్ అజిజుల్ హకీం తమీమ్ టాస్‌కు హాజరుకాలేకపోవడంతో, వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ టాస్‌కు వ‌చ్చాడు. మైదానంలో అతడు భారత కెప్టెన్ ఆయుష్ మాత్రేను కలిసిన సమయంలో హ్యాండ్‌షేక్ జరగకపోవడంపై ప్రేక్షకులు, అధికారులు వెంటనే గమనించారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుత భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ విషయం మరింత చర్చకు దారి తీసింది.

క్రీడాస్ఫూర్తికి క‌ట్టుబ‌డి ఉన్నాం:  బీసీబీ

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇటీవల దౌత్య సంబంధాల్లో ఒత్తిడులు ఉన్నప్పటికీ, ఇది రాజకీయ అంశాలకు సంబంధం లేనిదేనని బీసీబీ క‌చ్చితంగా తెలిపింది. యువ స్టాండ్ ఇన్ కెప్టెన్ వ్యక్తిగత నిర్లక్ష్యమే దీనికి కారణమని పేర్కొంది. అనారోగ్యం కారణంగా సాధారణ కెప్టెన్ అజిజుల్ హకీం టాస్‌కు హాజరుకాలేకపోయారు. ఆ సందర్భంలో వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ జట్టుకు ప్రతినిధ్యం వహించాడు. ప్రత్యర్థి కెప్టెన్‌తో హ్యాండ్‌షేక్ జరగకపోవడం పూర్తిగా అనుకోకుండా జరిగింది. అది క్షణిక దృష్టిలోపం వల్లే గానీ,ఎలాంటి అవమాన ఉద్దేశంతో కాదు.. అని బీసీబీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రత్యర్థులకు గౌరవం ఇవ్వ‌డం, క్రికెట్ స్ఫూర్తిని కాపాడటం కోసం జట్టు నిర్వహణకు తగిన సూచనలు ఇచ్చాం. ఆటగాళ్లకు క్రీడాస్ఫూర్తి, స్నేహభావం, పరస్పర గౌరవం వంటి విలువలను పాటించాల్సిన బాధ్యతను మరోసారి గుర్తు చేశాం. మైదానంలోనే కాదు, మైదానం వెలుపల కూడా క్రికెట్ విలువలకు బీసీబీ పూర్తి కట్టుబాటుతో ఉంది.. అని బీసీబీ తెలియ‌జేసింది.

భార‌త్ గెలుపు..

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, అభినవ్ కుందు అర్థసెంచరీలతో భారత్ 238 పరుగులు సాధించింది. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిన భారత్‌కు ఈ ఇద్దరూ 62 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కుందు 80 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి జట్టుకు ఆధారంగా నిలిచాడు. ఈ మ్యాచ్ వైభవ్ సూర్యవంశీకి చారిత్రాత్మకంగా మారింది. కేవలం 14 సంవత్సరాల‌ 296 రోజుల వయసులోనే అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో అర్థసెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. ఇక వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌కు ప‌లు మార్లు అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో మ్యాచ్‌ను చివ‌ర‌కు 29 ఓవ‌ర్ల‌కు కుదించారు. బంగ్లాదేశ్ ల‌క్ష్యాన్ని 165 ప‌రుగులుగా నిర్దారించారు. కానీ ఆ జ‌ట్టు 28.3 ఓవ‌ర్ల‌లో 146 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. దీంతో ఆ జ‌ట్టుపై భార‌త్ డీఎస్ఎస్ విధానంలో 18 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

Advertisement

తాజావార్తలు

Advertisement