No Shake Hand Policy | నో షేక్ హ్యాండ్ పాలసీ.. భారత్ ఇంకా ఎంతకాలం అలా చేస్తుందో చూస్తాం: మోహ్‌సిన్ నక్వీ
No Shake Hand Policy | ఏప్రిల్ నెలలో పహల్‌గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల నడుమ సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాలు ఇప్పటికే తమ ఎయిర్‌స్పేస్‌లను పరస్పరం నిషేధించగా, ఈ ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది.
No Shake Hand Policy | ఏప్రిల్ నెలలో పహల్‌గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల నడుమ సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాలు ఇప్పటికే తమ ఎయిర్‌స్పేస్‌లను పరస్పరం నిషేధించగా, ఈ ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. పహల్‌గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన బాధితుల కుటుంబాలకు సానుభూతిగా పాకిస్థాన్ తో క్రికెట్ మ్యాచ్‌లలో భారత ప్లేయర్లు వారికి హ్యాండ్ షేక్ ఇవ్వడం లేదు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోంది. మొదటగా సెప్టెంబర్ నెలలో జరిగిన టీ20 ఆసియా కప్ మ్యాచ్‌లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు పాక్ ప్లేయర్లకు హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. ఇక ఆసియా కప్ ఫైనల్ లో గెలిచిన అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహ్‌సిన్ నక్వీ చేతుల మీదుగా కప్‌ను అందుకునేందుకు కూడా భారత్ నిరాకరించింది.
ఆ తరువాత జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లోనూ భారత ప్లేయర్లు ఇదే పాలసీని కొనసాగించారు. పాక్ మహిళల జట్టుకు హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. అనంతరం దోహాలో జరిగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్, ఇటీవల జరిగిన అండర్ 19 మెన్స్ ఆసియా కప్ టోర్నీ మ్యాచ్‌లలోనూ పాక్ ప్లేయర్లకు భారత ప్లేయర్లు హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. అండర్ 19 మెన్స్ ఆసియా కప్ ఫైనల్‌లో పాక్ చేతిలో భారత్ ఓడిన విషయం విదితమే. ఆ మ్యాచ్‌లోనూ భారత్ ఇదే పాలసీని కొనసాగించింది. అయితే ఈ విషయంపై మ్యాచ్ అనంతరం పాక్ అండర్ 19 టీమ్ కోచ్, పాక్ మాజీ ప్లేయర్ సర్ఫరాజ్ అహ్మద్ బహిరంగంగానే విమర్శలు చేశాడు. భారత్ అనుసరిస్తున్న పాలసీ సరికాదని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని అన్నాడు. అయితే తాజాగా ఇదే అంశంపై మరోమారు మోహ్‌సిన్ నక్వీ కూడా స్పందించాడు.
అండర్ 19 మెన్స్ ఆసియా కప్ ఫైనల్ అనంతరం భారత్ ప్రవర్తించిన తీరు సరికాదు. వారు ఇంకా ఎంత కాలం ఇలా హ్యాండ్ షేక్స్ ఇవ్వకుండా ఉంటారు. క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు. మా ప్రధాని కూడా అదే చెబుతూ వస్తున్నారు. భారత్ మాతో సరగ్గా ప్రవర్తించడం లేదు. ఏ సమస్యలు ఉన్నా వాటిని బయట చూసుకోవాలి. క్రికెట్‌తో లింక్ చేయకూడదు. వారు ఇంకా ఎంత కాలం హ్యాండ్ షేక్స్ ఇవ్వకుండా ఉంటారో చూస్తాం. దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం. భారత్‌పై చర్యలు తీసుకోవాలని కోరతాం.. అని అన్నాడు. అయితే మరోవైపు ఐసీసీ కూడా ఈ విషయంపై బీసీసీఐకి సూచనలు చేయగా, బీసీసీఐ మాత్రం ఆ పాలసీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. పాక్‌తో ఆడే మ్యాచ్‌లలో ఆ ప్లేయర్లకు ఎట్టి పరిస్థితిలోనూ షేక్ హ్యాండ్స్ ఇవ్వబోము అని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో బీసీసీఐ పాలసీ క్లియర్‌గా అర్థమైంది. ఇక జనవరి నెలలో అండర్ 19 మెన్స్ వరల్డ్ కప్ ఉండగా, ఫిబ్రవరిలో టీ20 వరల్డ్ కప్ ఉంది. ఈ క్రమంలోనే భారత్, పాక్‌లు తలపడితే అప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తారో చూడాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



