త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 Playoff Scenario | రసవత్తరంగా ఐపీఎల్‌ ప్లేఆఫ్‌ రేసు.. ముందంజలో నాలుగు జట్లు.. చెన్నైకి సవాల్‌.. ముంబయి కథ ముగిసినట్లే..!

IPL 2026 Playoff Scenario | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026 సీజన్‌లో ప్లేఆఫ్‌ రేసు ఆసక్తికరంగా మారింది. 70 లీగ్‌ మ్యాచుల్లో ఇప్పటి వరకు 44 మ్యాచులు పూర్తయ్యాయి. టోర్నీలో ఒక్కో జట్టు 14 మ్యాచులు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్‌ ఫోర్‌లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కు చేరుతాయి.

P

Sports | Published On May 3, 2026, 3.15 pm IST

IPL 2026 Playoff Scenario | రసవత్తరంగా ఐపీఎల్‌ ప్లేఆఫ్‌ రేసు.. ముందంజలో నాలుగు జట్లు.. చెన్నైకి సవాల్‌.. ముంబయి కథ ముగిసినట్లే..!
Advertisement

IPL 2026 Playoff Scenario | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026 సీజన్‌లో ప్లేఆఫ్‌ రేసు ఆసక్తికరంగా మారింది. 70 లీగ్‌ మ్యాచుల్లో ఇప్పటి వరకు 44 మ్యాచులు పూర్తయ్యాయి. టోర్నీలో ఒక్కో జట్టు 14 మ్యాచులు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్‌ ఫోర్‌లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కు చేరుతాయి. ప్రస్తుతం ప్లేఆఫ్‌ రేసు ఉత్కంఠంగా మారింది. చెన్నై చెపాక్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ముంబై ఇండియన్స్ (MI)పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, యువ ఆటగాడు కార్తిక్ శర్మ అర్ధసెంచరీలతో రాణించడంతో చెన్నై విజయం సాధించింది. ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. మరోవైపు ముంబయి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక ముంబయి ప్లేఆఫ్‌ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి. చెన్నైకి మాత్రం సవాల్‌గా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌-4 స్థానాల్లో మూడు జట్ల ఖాతాల్లో 12 పాయింట్లు ఉండగా.. మరో జట్టు 13 పాయింట్లతో ముందంజలో ఉంది.

టాప్‌-4లో బలమైన జట్లు.. ప్లేఆఫ్‌ రేసు ఇలా..

ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్‌కు దగ్గరయ్యాయి. ఈ నాలుగు జట్లకు 12, 13 పాయింట్లు, పాజిటివ్ నెట్ రన్‌రేట్ ఉండటం వల్ల 16 పాయింట్లకు చేరువయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, లక్నో జట్లకు మార్గం కష్టంగా మారింది. ఈ జట్లు మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. లీగ్‌లో ప్రతిజట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తాయి. విజయం సాధిస్తే 2 పాయింట్లు, మ్యాచ్ రద్దయితే ఒక పాయింట్‌ ఖాతాలో జమ చేస్తారు. ఏదైనా జట్టు ఖాతాలో 16 పాయింట్లు అంతకంటే ఎక్కువ ఉంటే ప్లేఆఫ్‌ బెర్తు దాదాపు ఖాయం. 14 పాయింట్లు ఉంటే నెట్‌రన్‌రేట్‌పై ఆధారపడాల్సి వస్తుంది. 12 అంతకంటే తక్కువ పాయింట్లు ఉంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. పాయింట్లు సమానంగా ఉంటే ఎక్కువ విజయాలు, నెట్‌రన్‌ రేట్‌, సీజన్‌లో తీసిన వికెట్ల ఆధారంగా ర్యాంక్‌ నిర్ణయిస్తారు.

జట్ల పరిస్థితి ఇది..

ప్రస్తుత సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆ జట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఆరు విజయాలతో అగ్రస్థానంలో ఉంది. మిగతా ఆరు మ్యాచుల్లో గెలిస్తే ఫ్లేఆఫ్‌ దాదాపు ఖాయం. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వద్ద 12 పాయింట్లు ఉన్నాయి. మరో రెండు మ్యాచుల్లో గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుతుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అకౌంట్‌లో 12 పాయింట్లు ఉన్నాయి. బ్యాటింగ్‌లో స్థిరత్వంతో ముదుకు సాగుతోంది. మరో రెండు మ్యాచులు గెలిస్తే ప్లేఆఫ్‌ ఆశలు పెరుగుతాయి. రాజస్థాన్ రాయల్స్ వద్ద 12 పాయింట్లు ఉండగా.. మిగతా నాలుగు మ్యాచుల్లో కనీసం రెండింట్లో గెలవాలి. గుజరాత్‌ టైటాన్స్‌ పది పాయింట్లతో ఉంది. మూడు, నాలుగు మ్యాచుల్లో గెలిస్తేనే అవకాశం ఉంటుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు వద్ద కేవలం ఎనిమిది పాయింట్లు మాత్రమే ఉన్నాయి. కనీసం ఆ జట్టు నాలుగు, ఐదు మ్యాచుల్లో గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద సైతం ఎనిమిది పాయింట్లు ఉండగా.. నెట్‌రన్‌ రేట్‌ దారుణంగా ఉంది. ఈ క్రమంలో భారీ విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది. ఇక కేకేఆర్‌ వద్ద ఐదేసి పాయింట్లు ఉండగా.. మిగతా ఆరు మ్యాచుల్లో తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన దుస్థితి. ఇక ముంబయి ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మాత్రం అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. మిగతా అన్ని మ్యాచుల్లో గెలిచినా అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే.

Advertisement
Advertisement