త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavya Maran | సిక్సర్ల సునామీ సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు: ఓడినా స్వయంగా వెళ్లి అభినందించిన కావ్యా మారన్

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తమ జట్టు ఓడినా ఆ కుర్రాడిని కావ్యా మారన్ అభినందించిన వీడియో వైరల్ అయింది.

J

Sports | Published On May 28, 2026, 11.55 pm IST

Kavya Maran | సిక్సర్ల సునామీ సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు: ఓడినా స్వయంగా వెళ్లి అభినందించిన కావ్యా మారన్
Advertisement

Kavya Maran | త్రినేత్ర.న్యూస్ : బుధవారం జరిగిన ఐపీఎల్ 2026 (IPL 2026) ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడగా.. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సన్‌రైజర్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. అయితే, తమ జట్టు ఓడిపోయిందన్న బాధను పక్కనపెట్టి.. ఆ వండర్ కిడ్ దగ్గరకు ఎస్ఆర్‌హెచ్ కో-ఓనర్ కావ్యా మారన్ (Kavya Maran) స్వయంగా వెళ్లి అభినందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మనసు గెలుచుకున్న కావ్యా మారన్

మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఆడినా, ఆట ముగిశాక క్రీడాస్ఫూర్తి చాటడం ఐపీఎల్ కే ప్రత్యేకం. దాన్ని కావ్యా మారన్ మరోసారి నిరూపించారు. మ్యాచ్ అనంతరం నేరుగా వైభవ్ సూర్యవంశీ వద్దకు వెళ్లిన ఆమె.. చిరునవ్వుతో షేక్ హ్యాండ్ (Handshake) ఇచ్చారు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావంటూ ఆ కుర్రాడిని ప్రత్యేకంగా కొనియాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) లో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రత్యర్థి జట్టు ఓనర్ అయినా కూడా ఎంతో హుందాగా వ్యవహరించిన ఆమె స్పోర్టివ్ స్పిరిట్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు

ఈ మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్స్‌తో వైభవ్ అసాధారణ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (Chris Gayle) రికార్డును ఈ 15 ఏళ్ల కుర్రాడు బ్రేక్ చేశాడు. ఈ సీజన్‌లో ఏకంగా 65 సిక్సర్లు, 55 ఫోర్లు బాదిన వైభవ్.. 242 స్ట్రైక్ రేట్ (Strike Rate), 45 సగటుతో మొత్తం 680 పరుగులు సాధించి టోర్నీలోనే టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

ఇలాంటి టాలెంట్‌ను చూడలేదన్న కోచ్

వైభవ్ విధ్వంసంపై సన్‌రైజర్స్ అసిస్టెంట్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ (James Franklin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. "ఇలాంటి టాలెంట్‌ను ఎవరూ చూసి ఉండరు. ప్రస్తుతం అతడు ఆడుతున్న తీరు చూస్తుంటే భయం వేస్తోంది. అతని కెరీర్‌లో ఇంకా 25 ఏళ్ల సమయం ఉంది.. ముందుముందు అతడు మరింత మెరుగ్గా, బలంగా తయారవుతాడు," అని అన్నారు.

బౌలర్లకు అతడిని కట్టడి చేయడం అసాధ్యంగా మారిందని ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు. "పిచ్ బాగున్నప్పుడు బౌలర్లకు మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది. పవర్ ప్లే (Power play) లో అతన్ని అడ్డుకోవడానికి మేము ఫుల్ లెంగ్త్ బంతులు వేయడానికి ప్రయత్నించాం. కానీ, ఆ కుర్రాడు తన టాలెంట్‌తో బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ, తనకు కావాల్సిన స్ట్రైక్ జోన్‌లోకి బంతిని పంపుకుంటూ భారీ షాట్లు ఆడాడు. నిజంగా ఇదొక అద్భుతమైన ఇన్నింగ్స్," అని ఫ్రాంక్లిన్ ప్రశంసల వర్షం కురిపించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement