Iceland Cricket | అతనిలో అద్భుత ప్రతిభ.. ఇలాంటి కోచ్‌ను తీసుకునే ఉద్దేశం మాకు అస్సలు లేదు..
Iceland Cricket | టీ20 ప్రపంచ చాంపియన్.. హార్డ్ హిట్టర్లతో నిండిన జట్టు. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అర్ష్ దీప్ సింగ్.. మరీ ముఖ్యమంగా ప్రధాన కోచ్‌కు అత్యంత ఇష్టమైన హర్షిత్ రాణా జట్టులో ఉన్నప్పటికీ.. పసికూన చేతిలో పరాభవం.
Iceland Cricket | త్రినేత్ర.న్యూస్: టీ20 ప్రపంచ చాంపియన్.. హార్డ్ హిట్టర్లతో నిండిన జట్టు. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అర్ష్ దీప్ సింగ్.. మరీ ముఖ్యమంగా ప్రధాన కోచ్‌కు అత్యంత ఇష్టమైన హర్షిత్ రాణా జట్టులో ఉన్నప్పటికీ.. పసికూన చేతిలో పరాభవం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమడంతో ఐర్లాండ్‌తో (Ireland) జరిగిన రెండు టీ20 మ్యాచుల్లోనూ ఓడిపోయిన టీమ్ఇండియా (Team India ) సిరీస్‌ను కోల్పోయిన అపప్రధ మూటగట్టుకున్నది. దీంతో జట్టు చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై (Gautam Gambhir) విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో సెటైర్లతో వార్తల్లో నిలిచే ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు (Iceland Cricket).. గంభీర్‌ను ఉద్దేశించి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. అత్యంత ప్రతిభ కలిగిన అతడిని తమ కోచింగ్ స్టాఫ్‌లోకి (coaching staff) తీసుకునే ఉద్దేశం మాకు అస్సలు లేదంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.
We can confirm that we don't wish to add Gautam Gambhir to our coaching staff. He clearly has talent, though. To take those Indian players and deliver those results in Ireland takes truly remarkable gifts.
— Iceland Cricket (@icelandcricket) June 28, 2026
`మేం గౌతమ్ గంభీర్‌ను మా కోచింగ్ స్టాఫ్‌లో చేర్చుకోవాలని అనుకోవడం లేదు. మాకు ఇష్టం కూడా లేదు. అయితే ఆయనలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ఇలాంటి మేటి భారత ఆటగాళ్లను పెట్టుకుని, ఐర్లాండ్ గడ్డపై ఇలాంటి ఫలితాలను రాబట్టడానికి నిజంగా అసాధారణమైన ప్రతిభ కావాలి. అది గంభీర్ వద్ద పుష్కలంగా ఉందనిపిస్తున్నది` అంని ఐస్‌లాండ్ క్రికెట్ పోస్టు చేసింది.

గవాస్కర్ ఆగ్రహం..
మరోవైపు టీమ్ఇండియా మేనేజ్‌మెంట్, గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) తీవ్ర విమర్శలు చేశారు. సూపర్ ఫామ్‌లో ఉన్న బుడ్డోడు వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) ఐర్లాండ్‌లో ఆడించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. `ఐర్లాండ్‌ను పెద్ద ముప్పుగా భావించకుండా యువ ఆటగాడు సూర్యవంశీకి తొలి మ్యాచ్‌లోనే అవకాశం ఇస్తారని నేను నిజంగా అనుకున్నా. అభిషేక్ శర్మ లేదా సంజూ శాంసన్‌లలో ఒకరికి రెస్ట్ ఇచ్చి, వైభవ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపాల్సింది. ఇంగ్లండ్ వంటి కఠినమైన పర్యటనకు ముందు ఒక యువకుడిని అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయం చేయడానికి ఇది చాలా మంచి మార్గం. కానీ ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదు` అండూ గవాస్కర్ మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

IND vs IRE | వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ.. గంభీర్ వ్యూహంపైనే అందరి దృష్టి..! సీతాన్షు కొటక్ ఏమన్నారంటే..?
జూన్ 26, 2026

Nitish Kumar Reddy | మీడియా సమావేశంలో ఉండగా అమ్మ నుంచి ఫోన్.. నితీశ్ రెడ్డి ఏం చేశాడంటే?.. వీడియో
జూన్ 14, 2026

IND vs AFG Test | ఏకైక టెస్ట్ భారత్‌దే.. అఫ్గానిస్థాన్‌పై ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో విక్టరీ
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●NRI | విదేశాల్లోని భారతీయులు ఇక్కడికి డబ్బు పంపిస్తే జాగ్రత్త.. రూల్స్‌ను పాటించకపోతే నోటీసులు ఇస్తారు..
- ●Telangana student | స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
- ●Suicide | ‘సర్’ జాబితాలో పేరు లేదని భయం.. జైలుకు పంపిస్తారేమోనని వ్యక్తి ఆత్మహత్య
- ●Heavy Rain | మళ్లీ మునిగిన ముంబై.. అస్సాంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్.. అరుణాచల్‌తో తొమ్మిది మంది గల్లంతు
- ●Vijayabhaskar Resign to AIADMK | పళనిస్వామికి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా
- ●Airtel | జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. భారీగా పెరిగిన కొత్త సబ్స్క్రైబర్లు..

NRI | విదేశాల్లోని భారతీయులు ఇక్కడికి డబ్బు పంపిస్తే జాగ్రత్త.. రూల్స్‌ను పాటించకపోతే నోటీసులు ఇస్తారు..

Telangana student | స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

Suicide | ‘సర్’ జాబితాలో పేరు లేదని భయం.. జైలుకు పంపిస్తారేమోనని వ్యక్తి ఆత్మహత్య

Heavy Rain | మళ్లీ మునిగిన ముంబై.. అస్సాంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్.. అరుణాచల్‌తో తొమ్మిది మంది గల్లంతు



