Kapil Dev | గౌతమ్ గంభీర్ టీమిండియాకు కోచ్ కాదు.. కపిల్ దేవ్ సంచలన కామెంట్స్..
తాజాగా నిర్వహించిన ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఐసీసీ సెంటనరీ సెషన్ అనే కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ భారత క్రికెట్ జట్టు కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కోచ్ అనే పదాన్ని పూర్తిగా మార్చేశారని అన్నారు.
Kapil Dev | సొంత గడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌లను క్వీన్ స్వీప్ గా కోల్పోయిన అనంతరం భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక స్థిరమైన జట్టుతో ఆడించకుండా ఐపీఎల్ ప్లేయర్లతో టెస్టులను ఆడించడం, జుట్టులో నిరంతరం మార్పులు చేయడం, బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం, ఫామ్‌లో లేని ప్లేయర్లను తీసుకోవడం వంటి అంశాలపై గంభీర్ విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తరచూ అనేక మంది మాజీలు, విశ్లేషకులు గంభీర్ నిర్ణయాలను తప్పుబడుతూనే ఉన్నారు. అయితే తాజాగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వరల్డ్ కప్ విన్నింగ్ ఛాంపియన్ కపిల్ దేవ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గంభీర్ అసలు టీమిండియా కోచ్ కాదని, కోచ్ పాత్ర వేరే ఉంటుందని, గంభీర్ జట్టుకు కేవలం మేనేజర్ మాత్రమే అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
కోచ్ పదాన్ని మార్చేశారు..
తాజాగా నిర్వహించిన ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఐసీసీ సెంటనరీ సెషన్ అనే కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ భారత క్రికెట్ జట్టు కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కోచ్ అనే పదాన్ని పూర్తిగా మార్చేశారని అన్నారు. కోచ్ అంటే స్కూళ్లలో క్రికెట్ గురించి తెలియని వారికి ఇచ్చే శిక్షణను కోచింగ్ అంటారని, అక్కడే భిన్న రకాల ప్లేయర్లు తయారవుతారని అన్నారు. కానీ ఒక జాతీయ జట్టుకు శిక్షణ ఇచ్చే వారిని కోచ్ అనరని, మేనేజర్‌గా వ్యవహరిస్తారని అన్నారు. గౌతమ్ గంభీర్ టీమిండియాకు కోచ్ కారని, ఆయన జట్టుకు ఒక మేనేజర్ మాత్రమే అని అన్నారు. ఒక లెగ్ స్పిన్నర్ లేదా వికెట్ కీపర్‌కు గంభీర్ ఎలా కోచింగ్ ఇస్తారు..? కనుక కోచ్ అన్న పదాన్ని వాడడం ఇక్కడ సరైంది కాదు, గంభీర్ జట్టుకు మేనేజర్ మాత్రమే అని అన్నారు.
చర్చనీయాంశంగా కపిల్ కామెంట్స్..
జట్టుకు మేనేజర్‌గా ఉన్నవారు ప్లేయర్లందరినీ వెన్ను తట్టి ప్రోత్సహించాలి. ఒక ప్లేయర్ సరిగ్గా ఆడకపోతే అతన్ని తిట్టడం, సెంచరీ చేసిన ప్లేయర్‌తో డిన్నర్, పార్టీలు చేసుకోవడం సరికాదు. నేను ఆ స్థానంలో ఉంటే సెంచరీ చేసిన వారిని పట్టించుకోను. మ్యాచ్‌లో విఫలం అయిన వారితో డిన్నర్ చేస్తాను.. అని కపిల్ అన్నారు. సరైన ఆటతీరును కనబరచని వారిని తిట్టకూడదని, వారికి అండగా ఉంటూ వారిని ప్రోత్సహించాలని అన్నారు. జట్టులో ఐకమత్యం, సమిష్టితత్వం ఉండేలా జట్టును మార్చడమే మేనేజర్ పని అని అన్నారు. కనుక కోచ్ అన్న పదానికి అర్థం లేదని కపిల్ పేర్కొన్నారు. అయితే కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కొందరు ఆయన చేసిన కామెంట్స్‌ను సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం ఆయనను తప్పుపడుతున్నారు. కోచ్ అన్నాక అన్ని రకాలుగా జట్టును ప్రోత్సహిస్తారని, మేనేజర్ అంటే వేరే అర్థం వస్తుందని అంటున్నారు.
కాగా టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న హోం టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లక్నో టీ20లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుందామని భావించారు. కానీ తీవ్రమైన పొగమంచు కారణంగా మ్యాచ్ రద్దు అయింది. దీంతో చివరి టీ20 ద్వారా అసలు ఫలితం తేలనుంది. మరోవైపు సౌతాఫ్రికా ఈ టీ20లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ రెండు జట్ల మధ్య అహ్మదాబాద్‌లో ఇవాళ రాత్రి 7 గంటలకు చివరి టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా మంచు ఆటంకం కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



