త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jayawardene | సూర్య‌కుమార్‌ను అందుక‌నే ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా దించాం.. క్లారిటీ ఇచ్చిన జ‌య‌వ‌ర్ధ‌నే..

Jayawardene | ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై జరిగిన మ్యాచ్‌లో జట్టు వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను బెంచ్‌పై ఉంచడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. జట్టుకు కీలక ఆటగాడైన సూర్యకుమార్‌ను ఆదివారం రెండో ఇన్నింగ్స్‌లో మాత్రమే మైదానంలోకి దించారు.

S

Sports | Published On Mar 30, 2026, 11.05 am IST

Jayawardene | సూర్య‌కుమార్‌ను అందుక‌నే ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా దించాం.. క్లారిటీ ఇచ్చిన జ‌య‌వ‌ర్ధ‌నే..
Advertisement

Jayawardene | ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై జరిగిన మ్యాచ్‌లో జట్టు వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను బెంచ్‌పై ఉంచడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. జట్టుకు కీలక ఆటగాడైన సూర్యకుమార్‌ను ఆదివారం రెండో ఇన్నింగ్స్‌లో మాత్రమే మైదానంలోకి దించారు. అయితే అతను ఎక్కువసేపు నిలవకపోయినా, ఈ విధంగా అత‌న్ని వినియోగించడం అభిమానుల్లో అనుమానాల‌ను రేకెత్తించింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే ఈ విష‌యంపై స్పష్టత ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత సూర్యకుమార్‌కు కొంత విశ్రాంతి అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సూర్య‌కు విశ్రాంతి అవ‌స‌రం: జ‌య‌వ‌ర్ధ‌నే

అవసరం లేని కథనాల‌ను సృష్టించవ‌ద్ద‌ని జ‌య‌ర్ధ‌నే కోరారు. జట్టులో అందరూ సంతోషంగానే ఉన్నార‌ని, స్కై వచ్చి జట్టులో చేరాడ‌ని, అతను కొద్దిరోజులు అదనంగా విశ్రాంతి కోరుకున్నాడ‌ని తెలిపారు. అతనికి కొంచెం తొడ కండ‌రాల‌ సమస్య కూడా ఉంద‌ని, ఫీల్డింగ్ చేస్తున్నాడ‌ని, ఈ మ్యాచ్ తర్వాత మరో ఐదు రోజులు సమయం ఉందని, అందుకే అతనికి కొంత అదనపు సమయం ఇవ్వాలని అనుకున్నామ‌ని వివ‌రించారు. చివరికి అతనే తాను త‌క్కువ స‌మ‌యం పాటు ఆడాల‌ని కోరుకుంటున్నాన‌ని త‌మ‌కు చెప్పాడ‌ని, అందువ‌ల్లే అత‌న్ని కేవ‌లం బ్యాట‌ర్‌గానే ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దించామ‌ని తెలిపారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి వివాదం లేదని జయవర్ధనే స్పష్టం చేశారు. మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ చిన్న గాయంతో బాధపడుతున్నాడని కూడా తెలిపారు.

గ‌త సీజ‌న్‌లో రోహిత్‌ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా..

ఆదివారం కేకేఆర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సూర్య‌ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా దింప‌డం కేవ‌లం చిన్న మార్పు అని, దీనిపై అంత రాద్ధాంతం, చ‌ర్చ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌య‌వ‌ర్ధ‌నే స్ప‌ష్టం చేశారు. ఎవ‌రూ దీనిపై ఊహాగాల‌ను ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని, ఆట‌గాళ్లను సీజ‌న్ మొత్తం ఫిట్‌గా ఉంచాల‌నేదే త‌మ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. అంత‌కు మించి ఏమీ జ‌రగ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. కాగా ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు గత సీజన్‌లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను పలుమార్లు ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడిన విష‌యం తెలిసిందే. దీంతో రోహిత్ గ‌తేడాది ఐపీఎల్ సీజ‌న్‌లో చాలా మ్యాచ్‌ల్లో కేవ‌లం బెంచికే ప‌రిమితం అయ్యాడు. అయితే ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో మాత్రం రోహిత్ మైదానంలో ఉండ‌గా, సూర్య బెంచ్‌కు ప‌రిమితం అయ్యాడు.

సూర్య‌ను అందుక‌నే ఇంపాక్ట్‌గా దింపారా..?

ముంబైకి అనేక సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించి పెట్ట‌డంతోపాటు భార‌త్‌కు టీ20 ప్ర‌పంచ క‌ప్‌ను సాధించిన రోహిత్ లాంటి ప్లేయ‌ర్‌ను ముంబై టీమ్‌, కెప్టెన్ పాండ్యా స‌రిగ్గా వినియోగించుకోవ‌డం లేద‌ని, రోహిత్ అద్భుత‌మైన కెప్టెన్ అని, అత‌న్ని ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా పంప‌డం స‌రికాద‌ని, అత‌ని కెప్టెన్సీ మెళ‌కువ‌ల‌ను పాండ్యా తెలుసుకోవాల‌ని, రోహిత్ మైదానంలో ఉండాల‌ని విశ్లేష‌కులు, అభిమానులు విమ‌ర్శ‌లు చేశారు. అయితే ఆ కార‌ణాల వ‌ల్లే రోహిత్‌ను ఈసారి మైదానంలో ఉంచారా అన్న విష‌యంపై స్ప‌ష్టం రాలేదు. కానీ ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో మాత్రం రోహిత్ నుంచి చాలా సార్లు పాండ్యా ఫీల్డింగ్ కోసం సూచ‌న‌లు తీసుకోవ‌డం క‌నిపించింది. దీంతో ఈసారి సూర్య‌ను బెంచ్‌కే పరిమితం చేశార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే రానున్న మ్యాచ్‌ల‌లోనూ ముంబై జ‌ట్టు ఇదే పంథాను కొన‌సాగిస్తుందా, లేదా అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement