T20 World Cup | నేపాల్‌పై ఇటలీ జయకేతనం
T20 World Cup | టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేపాల్‌తో పోటీ పడిన ఇటలీ సునాయసంగా లక్ష్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఇటలీ సూపర్ 8 అవకాశాలను సజీవంగా ఉంచుకోగా, రెండూ ఓడిన నేపాల్ తన అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది.
వికెట్ నష్టపోకుండా 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదన
T20 World Cup | త్రినేత్ర.న్యూస్: టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేపాల్‌తో పోటీ పడిన ఇటలీ సునాయసంగా లక్ష్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఇటలీ సూపర్ 8 అవకాశాలను సజీవంగా ఉంచుకోగా, రెండూ ఓడిన నేపాల్ తన అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది.
టాస్ గెలిచిన ఇటలీ నేపాల్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా, నేపాల్ ఎనిమిది పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత ఏ దశలోనూ సరైన భాగస్వామ్యం నెలకొనకపోవడంతో 19.3 ఓవర్లకు 123 పరుగులు చేసి ఆలౌటైంది. నేపాల్ బ్యాటర్లలో అత్యధికంగా ఆరిఫ్ షేక్ 27 పరుగులు(24 బంతుల్లో) చేశారు. ఇటలీ బౌలర్లలో క్రిషన్ కలుమలాగే మూడు వికెట్లు పడగొట్టగా, బెన్ మనెంటి రెండు వికెట్లు, అలీ హసన్, స్మట్స్, జస్‌ప్రీత్‌సింగ్ తలా ఒక వికెట్ చొప్పున తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇటలీ ఓపెనర్లు ఇద్దరూ విజృంభించడంతో 12.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు జస్టిన్ మొస్కా 60 పరుగులు (44 బంతుల్లో అయిదు ఫోర్లు, మూడు సిక్సర్లతో), ఆంథోనీ మొస్కా 62 పరుగులు (32 బంతుల్లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో) చెలరేగారు. నేపాల్ బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






