త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ishan Kishan | ఇషాన్ కిష‌న్ క‌ళ్లు చెదిరే క్యాచులు.. మీరూ చూసేయండి..

Ishan Kishan | త్రినేత్ర‌.న్యూస్‌: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైన‌ల్‌లో అక్ష‌ర్ ప‌టేల్ (Axar Patel) అందుకున్న రెండు క్యాచులు మ్యాచును మ‌లుపుతిప్పాయి. అదేవిధంగా ఫైనల్‌లోనూ మ‌రో ప్లేయ‌ర్ ఆట‌ను మ‌న‌వైపు తిప్పాడు. చురుకైన ఫీల్డింగ్‌తో క‌ళ్లు చెదిరే క్యాచులు అందుకుని ఇన్‌ఫామ్ బ్యాట్స్‌మెన్‌ను పెవీలియ‌న్ వైపు న‌డిచేలా చేశాడు. అత‌డే ఇషాన్ కిష‌న్ (Ishan Kishan).

G

Sports | Published On Mar 9, 2026, 6.17 am IST

Ishan Kishan | ఇషాన్ కిష‌న్ క‌ళ్లు చెదిరే క్యాచులు.. మీరూ చూసేయండి..
Advertisement

Ishan Kishan | త్రినేత్ర‌.న్యూస్‌: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైన‌ల్‌లో అక్ష‌ర్ ప‌టేల్ (Axar Patel) అందుకున్న రెండు క్యాచులు మ్యాచును మ‌లుపుతిప్పాయి. అదేవిధంగా ఫైనల్‌లోనూ మ‌రో ప్లేయ‌ర్ ఆట‌ను మ‌న‌వైపు తిప్పాడు. చురుకైన ఫీల్డింగ్‌తో క‌ళ్లు చెదిరే క్యాచులు అందుకుని ఇన్‌ఫామ్ బ్యాట్స్‌మెన్‌ను పెవీలియ‌న్ వైపు న‌డిచేలా చేశాడు. అత‌డే ఇషాన్ కిష‌న్ (Ishan Kishan). అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ ఆక‌ట్టుకున్నాడు ఇషాన్‌. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 5 వికెట్ల న‌ష్టానికి 255 ర‌న్స్ చేసింది. టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ ముగ్గురూ అర్ధ‌సెంచ‌రీలు సాధించారు. వారిలో ఇషాన్ కిష‌న్ కూడా ఉన్నాడు. 25 బంతుల్లోనే 54 ప‌రుగులు రాబ‌ట్టాడు. అందులో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ఇక ఫీల్డింగ్‌లోనూ అద‌ర‌గొట్టిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్‌.. జ‌స్‌ప్రీత్ బుమ్రా వేసిన‌ 3.1వ‌ ఓవ‌ర్‌లో ర‌చిన్ ర‌వీంద్ర (1) బ్యాట్‌ను బంతి ఎడ్జ్ తీసుకున్న‌ది. దీంతో ఫైన్ లెగ్‌లో ఉన్న ఇషాన్ అద్భుతంగా క్యాచ్ ప‌ట్టాడు.

 

ఇక వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేసిన ఇన్నింగ్స్ 8.1వ ఓవ‌ర్‌లో డేంజ‌ర‌స్ బ్యాట‌ర్ టిమ్ సీఫెర్ట్ భారీ షాట్ కొట్టాడు. బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఉన్న‌ ఇషాన్ ప‌రిగెడుతూ వ‌చ్చి క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్ర‌మంలో నియంత్ర‌ణ కోల్పోయి బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర‌గా వెళ్లాడు. అయితే అదేస‌మ‌యంలో బాల్‌ను పైకి విసిరి, మ‌ళ్లీ దానిని అందుకున్నాడు. దీంతో సీఫెర్ట్ నిరాశ‌గా వెనుతిర‌గ‌క త‌ప్ప‌లేదు. మొత్త‌గా టీమ్ఇండియా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో రాణించ‌డంతో న్యూజీలాండ్ 96 ర‌న్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో భార‌త జ‌ట్టు ముచ్చ‌ట‌గా మూడోసారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ఫ్ ట్రోఫీని అందుకున్న‌ది.

https://x.com/StarSportsIndia/status/2030675786416669145

https://x.com/StarSportsIndia/status/2030681446529327504

Advertisement
Advertisement