INDW Vs SLW | మూడో టీ20లోనూ భారత్ గెలుపు.. సిరీస్ కైవసం..
INDW Vs SLW | కేరళలోని తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో మహిళల టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ చాలా సునాయాసంగా ఛేదించింది. 5 టీ20ల సిరీస్‌ను మరో 2 టీ20లు మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది.
INDW Vs SLW | కేరళలోని తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో మహిళల టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ చాలా సునాయాసంగా ఛేదించింది. 5 టీ20ల సిరీస్‌ను మరో 2 టీ20లు మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. ఓపెనర్ షెఫాలి వర్మ అర్థ సెంచరీతో రాణించగా, అంతకు ముందు బౌలర్లు సైతం మెరుగైన ప్రదర్శన చేశారు. దీంతో శ్రీలంకను చాలా తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ మరో 40 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో శ్రీలంకపై భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా శ్రీలంక బ్యాటింగ్ చేసింది. అయితే శ్రీలంక జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడుతున్నట్లు కనిపించినా ఆ తరువాత వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. దీంతో పరుగులు సాధించడం చాలా కష్టంగా ఫీలయ్యారు. భారత బౌలర్లు కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ క్రమంలో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఆ జట్టు ప్లేయర్లలో ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. టాప్ ఆర్డర్ ప్లేయర్లు దాదాపుగా అందరూ కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ 3 వికెట్లు తీసింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ స్మృతి మంధాన 6 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి విఫలం అయినా మరో ఓపెనర్ షెఫాలి వర్మ మాత్రం చివరి వరకు ఆడి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. 42 బంతులు ఆడిన షెఫాలి 11 ఫోర్లు 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అలాగే చివర్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, భారత్ 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్లను కోల్పోయి 115 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2 వికెట్లు తీసింది. కాగా ఈ మ్యాచ్‌లో విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఈ సిరీస్‌లో తదుపరి 4వ మ్యాచ్ ఈ నెల 28వ తేదీన రాత్రి 7 గంటలకు ఇదే వేదికలో జరగనుంది.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌దే విజయం.. ఆస్ట్రియన్ సైనిక నిపుణుడి సంచలన వ్యాఖ్యలు..!
మే 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



