త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

INDW Vs SLW | రెండో టీ20లోనూ భార‌త మహిళ‌ల జ‌ట్టు గెలుపు.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం..

INDW Vs SLW | విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా శ్రీ‌లంక మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భార‌త మహిళ‌ల జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. శ్రీ‌లంక నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భారత్ చాలా సునాయాసంగా ఛేదించింది. ఈ క్ర‌మంలో శ్రీ‌లంక‌పై భార‌త్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

S

Sports | Published On Dec 23, 2025, 10.03 pm IST

INDW Vs SLW | రెండో టీ20లోనూ భార‌త మహిళ‌ల జ‌ట్టు గెలుపు.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం..
Advertisement

INDW Vs SLW | విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా శ్రీ‌లంక మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భార‌త మహిళ‌ల జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. శ్రీ‌లంక నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భారత్ చాలా సునాయాసంగా ఛేదించింది. ఈ క్ర‌మంలో శ్రీ‌లంక‌పై భార‌త్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా శ్రీ‌లంక బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు ఆరంభం నుంచే త‌డ‌బ‌డింది. చాలా నెమ్మ‌దిగా స్కోరు చేస్తూ వ‌చ్చింది. వ‌రుస‌గా వికెట్ల‌ను కూడా కోల్పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆ జ‌ట్టు 9 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 128 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఆ జ‌ట్టు ప్లేయ‌ర్ల‌లో హ‌ర్షిత స‌మ‌ర‌విక్ర‌మ 32 బంతుల్లో 4 ఫోర్ల‌తో 33 ప‌రుగులు చేయ‌గా, కెప్టెన్ చ‌మారి ఆట‌ప‌ట్టు 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 31 ప‌రుగులు చేసింది. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకోలేక‌పోయారు.

ఇక భార‌త బౌల‌ర్ల‌లో వైష్ణ‌వి శ‌ర్మ‌, శ్రీ‌చ‌ర‌ణిల‌కు చెరో 2 వికెట్లు ద‌క్కాయి. అలాగే క్రాంతి గౌడ్‌, స్నేహ రాణా చెరొక వికెట్ తీశారు. అనంతరం 129 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్ చేసిన భార‌త్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఈ క్ర‌మంలోనే భార‌త్ 11.5 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్ల‌ను కోల్పోయి 129 ప‌రుగులు చేసింది. భార‌త ప్లేయ‌ర్ల‌లో షెఫాలీ వ‌ర్మ అర్థ సెంచ‌రీతో రాణించింది. 34 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో ష‌ఫాలి 69 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, మ‌రో ప్లేయ‌ర్ జెమీమా రోడ్రిగ్స్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స‌ర్ తో 26 ప‌రుగులు చేసి కాసేపు గ్రౌండ్‌లో మెరుపులు మెరిపించింది. దీంతో భార‌త్ అల‌వోక‌గా ల‌క్ష్యాన్ని ఛేదించింది. మ‌రో 8.1 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే మ్యాచ్‌ను ముగించింది. ఇక శ్రీ‌లంక బౌల‌ర్ల‌లో మ‌ల్కి మ‌దారా, కావ్య కావింది, క‌విష దిల్హ‌రిల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

ఈ మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం సాధించ‌డంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించ‌గా మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 26వ తేదీన కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురంలో రాత్రి 7 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. కాగా ఈ సిరీస్‌తో అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌ల కెరీర్‌ను ప్రారంభించిన భార‌త బౌల‌ర్ వైష్ణ‌వి శ‌ర్మ మొద‌టి మ్యాచ్‌లో వికెట్ల‌ను తీయ‌క‌పోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేసి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇక రెండో మ్యాచ్‌లో త‌న తొలి వికెట్ తీసిన వైష్ణ‌వి మ‌రో వికెట్‌ను కూడా తదుప‌రి ఓవ‌ర్‌లోనే ప‌డ‌గొట్టింది. కానీ ప‌రుగుల‌ను స‌మ‌ర్పించుకుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement