సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన భారత్.. మూడు వన్డేల సిరీస్ 2-1తో కైవసం..
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 270 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 39.5 ఓవర్లలోనే ఛేదించింది. భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సమిష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా సునాయాసంగా నెగ్గింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోయిన విషయం విదితమే. ఈ క్రమంలో టీమిండియా సభ్యులు, కోచ్, సెలెక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అలాగే రెండో వన్డేలోనూ పేలవమైన బౌలింగ్ కారణంగా అందరూ విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ ఈ మ్యాచ్‌లో తమ అద్భుతమైన ఆట తీరుతో విమర్శకుల నోళ్లు మూయించారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే సఫారిలు పూర్తిగా 50 ఓవర్లు కూడా ఆడలేదు. 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ క్వింటన్ డికాక్, కెప్టెన్ టెంబా బవుమా మాత్రమే రాణించారు. 89 బంతులు ఆడిన డికాక్ 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు చేసి ఔట్ అవ్వగా, కెప్టెన్ బవుమా 67 బంతుల్లో 5 ఫోర్లతో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణలు చెరో 4 వికెట్లు తీశారు. అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజాలకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత ప్లేయర్లు ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా క్రమంగా వేగం పెంచారు. ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ తొలి వికెట్‌కు ఏకంగా 155 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో రోహిత్ 75 పరుగులు చేసి ఔటవ్వగా, జైశ్వాల్ 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 116 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే కోహ్లి అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో కోహ్లి 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సఫారి బౌలర్లలో కేశవ్ మహారాజ్‌కు 1 వికెట్ దక్కింది. కాగా వన్డే సిరీస్ ముగిసిన నేపథ్యంలో భారత్, సౌతాఫ్రికాల మధ్య ఈ నెల 9వ తేదీ నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మొత్తం 5 టీ20లను ఆడనున్నారు. తొలి టీ20 9వ తేదీన రాత్రి 7 గంటలకు కటక్‌లో జరగనుంది. మరో నాలుగు టీ20లు వరుసగా చండీగఢ్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌లలో జరగనున్నాయి. టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



