త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanju Samson | హ్యాట్సాప్ సంజు.. శాంస‌న్‌కు కెప్టెన్ సూర్య‌ స‌లాం

Sanju Samson | అత‌ను ఎప్పుడూ టీమ్‌తోనే ఉంటాడు. కాని తుది జ‌ట్టులో స్థానం ఉండ‌దు. సెంచ‌రీలు చేసినా, త‌న బ్యాటింగ్‌తో జ‌ట్టును ఆదుకున్నా త‌దుప‌రి మ్యాచ్‌లో జ‌ట్టు యాజ‌మాన్యం అత‌డిని ఆడిస్తుందో లేదో కూడా తెలియ‌దు. ఇప్పుడు అత‌డే టీమ్ఇండియాను (Team India) టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో (T20 World Cup) సెమీస్‌కు చేర్చాడు. బ్యాటింగే ప్ర‌ధాన బ‌లంగా వ‌ర‌ల్డ్‌క‌ప్ బ‌రిలో దిగిన భార‌త‌జ‌ట్టును.. ఓపెన‌ర్ల వైఫ‌ల్యం వెంటాడింది.

G

Sports | Published On Mar 2, 2026, 7.13 am IST

Sanju Samson | హ్యాట్సాప్ సంజు.. శాంస‌న్‌కు కెప్టెన్ సూర్య‌ స‌లాం
Advertisement

Sanju Samson | త్రినేత్ర‌.న్యూస్‌: అత‌ను ఎప్పుడూ టీమ్‌తోనే ఉంటాడు. కాని తుది జ‌ట్టులో స్థానం ఉండ‌దు. సెంచ‌రీలు చేసినా, త‌న బ్యాటింగ్‌తో జ‌ట్టును ఆదుకున్నా త‌దుప‌రి మ్యాచ్‌లో జ‌ట్టు యాజ‌మాన్యం అత‌డిని ఆడిస్తుందో లేదో కూడా తెలియ‌దు. ఇప్పుడు అత‌డే టీమ్ఇండియాను (Team India) టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో (T20 World Cup) సెమీస్‌కు చేర్చాడు. బ్యాటింగే ప్ర‌ధాన బ‌లంగా వ‌ర‌ల్డ్‌క‌ప్ బ‌రిలో దిగిన భార‌త‌జ‌ట్టును.. ఓపెన‌ర్ల వైఫ‌ల్యం వెంటాడింది. దీంతో టోర్నీ నుంచి జ‌ట్టు నిష్క్ర‌మించే ప‌రిస్థితులు, మంచి ఫామ్‌లో ఉన్న ఆ హార్డ్‌హిట్ట‌ర్‌ను ఎందుకు ప‌క్క‌న బెడుతున్నార‌న్న విమ‌ర్శ‌లు అధిక‌మ‌వ‌డంతో.. తుది జ‌ట్టులో అత‌ని ఎంట్రీ త‌ప్ప‌నిస‌రి స‌రి అయింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో త‌క్కువ స్కోరే చేసినా ఫ‌రువాలేద‌నిపించాడు. చావో రేవో అని తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఒంటి చేత్తో వెస్టిండీస్‌ను ఇంటికి, టీమ్ఇండియాను సెమీస్‌కు పంపించాడు. అందుకే అత‌నికి కెప్టెన్ సూర్య (Surya Kumar Yadav) స‌లాం చేశాడు. అత‌డే ఆదివారం నాటిమ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌, న‌యా హీరో సంజు శాంస‌న్ (Sanju Samson).

ఒక‌వైపు అంతా త‌క్కువ స్కోర్‌కు ఔట‌వుతున్నా మొక్కవోని ప‌ట్టుద‌ల‌, దృఢ సంక‌ల్పంతో తుది వ‌ర‌కూ క్రీజ‌లో నిలిచ‌న శాంస‌న్‌.. త‌న చిర‌స్మ‌ర‌ణీయ‌ ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియాకు అద్భుత విజ‌యాన్ని అందించాడు. త‌న‌పై పెద్ద‌గా అంచ‌నాలేమీ లేక‌పోవ‌డంతో స్వేచ్ఛ‌గా, ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా ఒక్కో ప‌రుగు పేర్చుతూ త‌న ఇన్నింగ్స్‌ను నిర్మించుకున్నాడు. కెప్టెన్ సూర్య‌, తిల‌క్ వ‌ర్మ‌, హార్ధిక్‌తో క‌లిసి మంచి భాగ‌స్వామాలు నెల‌కొల్పాడు. ఆఖ‌రి రెండు ఓవ‌ర్ల‌లో భార‌త్‌కు 17 ప‌రుగులు అవ‌స‌ర‌మైన ద‌శ‌లో ఇన్నింగ్స్ 19వ ఓవ‌ర్ రెండో హార్ధిక్ పాండ్య ఔట్ కావ‌డంతో కొంత ఉత్కంఠ నెల‌కొంది. కానీ అదే ఓవ‌ర్‌లో సీమ్ ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబే రెండు ఫోర్లు కొట్టి.. విండీస్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. కానీ ఫినిషింగ్ ట‌చ్ మాత్రం శాంస‌న్‌దే. చివ‌రి ఓవ‌ర్‌లో తొలి బంతిని స్క్వేర్ లెగ్‌లో సిక్స్‌గా మ‌లిచిన అత‌డు.. త‌ర్వాతి బాల్‌ను మిడాన్‌లో బౌండ‌రీకి త‌ర‌లించి భార‌త్‌కు చిర‌స్మ‌ర‌ణీన విజ‌యాన్ని అందించాడు. దీంతో టీమ్ఇండియా సెమీస్‌లో స్థానం ద‌క్కించుకుంది. త‌దుప‌రి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడ‌నుంది.

కాగా, మ్యాచ్ ముగిసిన త‌ర్వాత పెవీలియ‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కెప్టెన్ సూర్యతోపాటు జ‌ట్టు స‌భ్యులు సంజు శాంస‌న్‌ను అభినందించారు. సూర్య త‌న క్యాప్ తీసీ త‌ల కిందికి వంచి స‌లాం కొట్టాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న‌ది. మ్యాచ్ విన్నర్ శాంస‌న్‌ను నెటిజ‌న్లు పొగ‌డ్త‌లో ముంచెత్తుతున్నారు.

https://x.com/StarSportsKan/status/2028166245741429181
https://x.com/deepu_drops/status/2028186576371798027

https://x.com/smritiirani/status/2028161054526914851

https://x.com/PiyushGoyal/status/2028159469901988115

 

Advertisement
Advertisement