త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs PAK | భార‌త్‌-పాక్ మ్యాచ్‌కు భారీ భ‌ద్ర‌త‌.. శ్రీ‌లంక ప్ర‌క‌ట‌న‌..

IND Vs PAK | మ‌రికొద్ది రోజుల్లో భార‌త్‌, శ్రీ‌లంక వేదిక‌లుగా టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026 టోర్నీ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో అంద‌రికీ ఈ టోర్నీలో జ‌ర‌గ‌నున్న భార‌త్‌-పాక్ మ్యాచ్ ప‌ట్ల ఆస‌క్తి పెరుగుతోంది. భారత్‌తో ఆడ‌డంపై పాకిస్థాన్ ఇప్ప‌టికే ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తుండ‌గా, మ్యాచ్ జ‌రిగే అవ‌కాశాలు 100 శాతం ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

S

Sports | Published On Jan 30, 2026, 9.52 am IST

IND Vs PAK | భార‌త్‌-పాక్ మ్యాచ్‌కు భారీ భ‌ద్ర‌త‌.. శ్రీ‌లంక ప్ర‌క‌ట‌న‌..
Advertisement

IND Vs PAK | మ‌రికొద్ది రోజుల్లో భార‌త్‌, శ్రీ‌లంక వేదిక‌లుగా టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026 టోర్నీ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో అంద‌రికీ ఈ టోర్నీలో జ‌ర‌గ‌నున్న భార‌త్‌-పాక్ మ్యాచ్ ప‌ట్ల ఆస‌క్తి పెరుగుతోంది. భారత్‌తో ఆడ‌డంపై పాకిస్థాన్ ఇప్ప‌టికే ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తుండ‌గా, మ్యాచ్ జ‌రిగే అవ‌కాశాలు 100 శాతం ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ ప్ర‌పంచం కూడా ఈ మ్యాచ్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. మ‌రోవైపు ఈ మ్యాచ్ ప‌ట్ల అభిమానుల్లోనూ రోజు రోజుకీ ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే ఈ ప్ర‌పంచ క‌ప్ టోర్నీలో భార‌త్‌, పాక్ ఆడే మ్యాచ్‌కు అసాధార‌ణ రీతిలో భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని శ్రీ‌లంక స్ప‌ష్టం చేసింది.

ఎలైట్ క‌మాండో యూనిట్ల మోహ‌రింపు..

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శ్రీ‌లంక ప్రభుత్వం అప్రమత్తమైంది. టోర్నమెంట్ ఎటువంటి అంతరాయం లేకుండా సాగేందుకు అత్యున్నత స్థాయిలో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీలంక క్రీడల మంత్రి సునిల్ కుమార గమాగే తెలిపారు. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఆయన మీడియాకు వెల్లడించారు. భద్రతా ముప్పు నేపథ్యంలో రెండు జట్ల రక్షణ కోసం సైన్యం ప్రత్యేక ఎలైట్ కమాండో యూనిట్లను మోహరించనుంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీలంక అధికారులు స్పష్టం చేశారు.

పాక్ ఆ సాహ‌సానికి ఒడిగ‌డుతుందా..?

కాగా, భద్రతా కారణాలు చూపుతూ భారత్‌కు రావడానికి నిరాకరించిన బంగ్లాదేశ్, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరింది. అయితే ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించడంతో బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ హెచ్చరించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. టెలికాం ఆసియా స్పోర్ట్ కథనం ప్రకారం, తమ గ్రూప్‌లోని మిగతా రెండు మ్యాచ్‌ల‌లో పాకిస్థాన్ గెలిస్తే, భారత్‌తో మ్యాచ్‌ను వదిలేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వర్గాలు స్పందిస్తూ, పాకిస్థాన్ మిగతా రెండు మ్యాచ్‌లు గెలిస్తే, భారత్‌తో మ్యాచ్‌ను ఫోర్‌ఫీట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి, అని పేర్కొన్నాయి. అయితే పాకిస్థాన్ నిజంగానే అలా చేస్తే అప్పుడు ఐసీసీ ఎలాంటి చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తుంది, అన్న‌ది ప్ర‌స్తుతం ఉత్కంఠ‌గా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement