IND vs AFG | 152 రన్స్‌కే అఫ్గాన్ ఆలౌట్.. డెబ్యూ మ్యాచ్‌లోనే మానవ్ సుతార్ సత్తా
IND vs AFG | త్రినేత్ర.న్యూస్: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ (Manav Suthar) దెబ్బకు అఫ్గానిస్థాన్ (IND vs AFG) కుదేలైంది. భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
IND vs AFG | త్రినేత్ర.న్యూస్: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ (Manav Suthar) దెబ్బకు అఫ్గానిస్థాన్ (IND vs AFG) కుదేలైంది. భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 113/5తో మూడో రోజు ఆటను ప్రారంభించిన అఫ్గన్లు 156 పరుగులకే ఆలౌటయ్యారు. రహ్మత్ షా (60, 135 బాల్స్‌లో) మినహా మిగిలిన బ్యాటర్లంతా వచ్చినవారు వచ్చినట్లే పెవీలియన్‌కు చేరారు. దీంతో భారత్‌కు 412 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్‌పై హాఫ్ చేసిన తొలి అఫ్గాన్ బ్యాటర్‌గా రహ్మత్ నిలిచాడు.
కాగా, కేవలం 35 పరుగులే ఇచ్చి 6 వికెట్లతో సత్తా చాటిన మానవ్ సుతార్ ఓ ఘనత సాధించాడు. టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లోనే 5 వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2008లో ఆస్ట్రేలియాపై అమిత్ మిశ్రా 5/71తో ఈ ఫీట్ అందుకున్నాడు.
తొలి ఇన్నింగ్‌లో 8 వికెట్ల నష్టానికి 564 వద్ద డిక్లేర్ చేసిన భారత్.. అఫ్గాన్‌ను 156 రన్స్‌కే కట్టడిచేసింది. దీంతో భారీ ఆధిక్యం సాధించిన టీమ్ ఇండియా.. అఫ్గాన్‌ను ఫాలో ఆన్ ఆడిస్తున్నది. లంచ్ బ్రేక్ సమయానికి ఫాలోఆన్‌లో అఫ్గాన్ 21/0 స్కోర్ చేసింది. ప్రస్తుతం సెథిఖుల్లా అటల్ (16), అబ్దుల్ మాలిక్ (2) క్రీజులో ఉన్నారు.
The fifth one always hits different 🌟
A moment Manav Suthar will replay for the rest of his life 🎞️
Updates ▶️ https://t.co/Au50EfVM30#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/yUo8AsXHZu
— BCCI (@BCCI) June 8, 2026
తాజావార్తలు
- ●Thaman | యాక్టింగ్ టార్చర్ - హీరో ఎంట్రీపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ●B.Tech student suicide | టూర్‌కు వెళ్తున్నానని చెప్పాడు.. ఒంగోలులో శవమై తేలాడు
- ●BKC Mumbai Car Free Friday | ట్రాఫిక్ కష్టాలకు చెక్: ముంబై బీకేసీలో 'కార్-ఫ్రీ ఫ్రైడే'.. ఇకపై ప్రతి శుక్రవారం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డే!
- ●TMC | టీఎంసీకి మరో షాక్.. రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాజీనామా
- ●Child Obesity | చిన్నారుల్లో అధికమవుతున్న ఊబకాయం సమస్య.. ఫోన్లే కారణమా..?
- ●Pinarayi Vijayan | ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు.. రేవంత్‌పై పినరయి విజయన్ ఫైర్

Thaman | యాక్టింగ్ టార్చర్ - హీరో ఎంట్రీపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

B.Tech student suicide | టూర్‌కు వెళ్తున్నానని చెప్పాడు.. ఒంగోలులో శవమై తేలాడు

BKC Mumbai Car Free Friday | ట్రాఫిక్ కష్టాలకు చెక్: ముంబై బీకేసీలో 'కార్-ఫ్రీ ఫ్రైడే'.. ఇకపై ప్రతి శుక్రవారం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డే!

TMC | టీఎంసీకి మరో షాక్.. రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాజీనామా




