త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC | బంగ్లాదేశ్‌కు ఐసీసీ అధికారి చుర‌క‌లు.. “సేఫ్ కాద‌న్న‌ప్పుడు జ‌ర్న‌లిస్టులైనా ఎలా వ‌స్తారు..?”

ICC | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 నేప‌థ్యంలో ఇప్ప‌టికే కోలుకోలేని దెబ్బ త‌గిలి విల‌విల‌లాడుతున్న బంగ్లాదేశ్‌కు మ‌రో గ‌ట్టి షాక్ త‌గిలింది. టోర్న‌మెంట్‌ను క‌వర్ చేసేందుకు గాను జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చే అక్రిడిటేష‌న్ల‌ను బంగ్లాదేశ్‌కు ఇచ్చేందుకు ఐసీసీ నిరాక‌రించింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెల‌రేగ‌డంతో ఐసీసీ అధికారి ఒక‌రు స్పందించారు.

S

Sports | Published On Jan 28, 2026, 7.47 am IST

ICC | బంగ్లాదేశ్‌కు ఐసీసీ అధికారి చుర‌క‌లు.. “సేఫ్ కాద‌న్న‌ప్పుడు జ‌ర్న‌లిస్టులైనా ఎలా వ‌స్తారు..?”
Advertisement

ICC | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 నేప‌థ్యంలో ఇప్ప‌టికే కోలుకోలేని దెబ్బ త‌గిలి విల‌విల‌లాడుతున్న బంగ్లాదేశ్‌కు మ‌రో గ‌ట్టి షాక్ త‌గిలింది. టోర్న‌మెంట్‌ను క‌వర్ చేసేందుకు గాను జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చే అక్రిడిటేష‌న్ల‌ను బంగ్లాదేశ్‌కు ఇచ్చేందుకు ఐసీసీ నిరాక‌రించింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెల‌రేగ‌డంతో ఐసీసీ అధికారి ఒక‌రు స్పందించారు. బంగ్లాదేశ్‌కు చుర‌క‌లు అంటించారు. "భార‌త్ సుర‌క్షితం కాద‌ని వాదిస్తున్న‌ప్పుడు ప్లేయ‌ర్లు మాత్ర‌మే కాదు, జ‌ర్న‌లిస్టులు అయినా ఎలా వ‌స్తారు, అందుక‌నే బంగ్లాదేశ్ జర్న‌లిస్టుల‌కు అక్రిడిటేష‌న్ల‌ను ఇవ్వ‌లేదు" అని వ్యంగ్యంగా స‌మాధానం ఇచ్చారు. దీంతో బంగ్లాదేశ్ మీడియా సంస్థ‌లు, సీనియ‌ర్ జర్న‌లిస్టులు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

ఐసీసీ నిర్ణ‌యం తీవ్ర విచార‌క‌రం: రానా అబ్బాస్‌

ఈ విష‌యంపై బంగ్లాదేశ్ మీడియా సంస్థ ఆజ్‌క‌ర్ ప‌త్రిక‌కు చెందిన స్పోర్ట్స్ ఎడిట‌ర్ రానా అబ్బాస్ మాట్లాడుతూ "ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణ‌యం తీవ్ర విచార‌క‌రం" అని అన్నారు. "ఇలాంటి సంఘ‌ట‌న‌లు బంగ్లాదేశ్‌కు ఇంతకు ముందు ఎన్న‌డూ ఎదురు కాలేదు. బంగ్లాదేశ్ 1999లో తొలిసారిగా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆడింది. కానీ అంత‌కన్నా ముందే ఐసీసీ ఈవెంట్ల‌కు బంగ్లాదేశ్ జ‌ర్న‌లిస్టులు వెళ్లి క‌వ‌ర్ చేశారు. ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క‌, హై వోల్టేజ్ మ్యాచ్‌ల‌ను ఇండియాలో నిర్వ‌హించినా కూడా బంగ్లాదేశ్ మీడియా క‌వ‌ర్ చేసింది. గ‌తంలో ఎన్న‌డూ ఎవ‌రూ ఈ విధంగా మ‌మ్మ‌ల్ని రిజెక్ట్ చేయ‌లేదు. ఐసీసీ ఈవెంట్ల‌కు సంబంధించిన చ‌రిత్ర‌లో ఇలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం నిజంగా దుర‌దృష్ట‌క‌రం" అని అన్నారు.

బంగ్లాదేశ్ జ‌ర్న‌లిస్టుల దారెటు..?

"బంగ్లాదేశ్ జ‌ర్న‌లిస్టుల‌కు అక్రిడిటేష‌న్ల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డం తీవ్ర విచార‌క‌రం. మ్యాచ్‌ల‌లో పాల్గొన‌క‌పోయినా ఆ దేశానికి చెందిన జ‌ర్న‌లిస్టుల‌కు మాత్రం మ్యాచ్‌ల‌ను క‌వ‌ర్ చేసేందుకు అనుమ‌తి ఉంటుంది. ఇందుకు ఫిఫానే ఉదాహ‌ర‌ణ‌. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణ‌యం కార‌ణంగా శ్రీ‌లంక‌లోనూ మ్యాచ్‌ల‌ను క‌వ‌ర్ చేయ‌లేక‌పోతున్నాం" అన్నారు. కాగా ఈ విష‌యం ఇప్ప‌టికే బంగ్లాదేశ్‌కు చెందిన జ‌ర్న‌లిస్టులు అక్క‌డి బంగ్లాదేశ్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేష‌న్ (బీఎస్పీఏ), బంగ్లాదేశ్ స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్స్ క‌మ్యూనిటీ (బీఎస్జేసీ)లను సంప్రదించారు. దీంతో త‌దుపరి కార్యాచ‌ర‌ణ‌ను వారు ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. అయితే బంగ్లాదేశ్ జ‌ర్న‌లిస్టుల‌కు మాత్రం ఇలా అనుమ‌తి నిరాక‌రించ‌డం త‌మ‌ను తీవ్రంగా దిగ్భ్రాంతికి, విచారానికి గురి చేసింద‌ని రానా అబ్బాస్ అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement