Ishan Kishan | ఎత్తు తక్కువ ఉన్నా భారీ సిక్సర్లు ఎలా సాధ్యం..? కిషన్ లాంటి ప్లేయర్ల రహస్యం ఇదే..!
Ishan Kishan | టీ20 క్రికెట్ అంటే ఎవరికైనా సరే ముందుగా గుర్తుకు వచ్చేది బ్యాటర్లు బాదే భారీ సిక్సులే. అసలు టీ20 ఆట ఉద్భవించిందే ఈ కాన్సెప్టుపై. తక్కువ ఓవర్లు ఉంటాయి. వికెట్లు పడినా బంతిని బాదడం ఒక్కటే లక్ష్యం. వికెట్లు పడకపోతే బాదడం ఇంకా భారీగా ఉంటుంది.
Ishan Kishan | టీ20 క్రికెట్ అంటే ఎవరికైనా సరే ముందుగా గుర్తుకు వచ్చేది బ్యాటర్లు బాదే భారీ సిక్సులే. అసలు టీ20 ఆట ఉద్భవించిందే ఈ కాన్సెప్టుపై. తక్కువ ఓవర్లు ఉంటాయి. వికెట్లు పడినా బంతిని బాదడం ఒక్కటే లక్ష్యం. వికెట్లు పడకపోతే బాదడం ఇంకా భారీగా ఉంటుంది. అభిమానులకు ఇదే కావాలి. బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్‌మెన్ ఎంత పవర్‌ఫుల్ గా, ఎంత స్టైలిష్ గా సిక్స్ కొడతారన్నది అభిమానులు చూస్తుంటారు. తక్కువ బంతుల్లోనే ఎక్కువ స్కోరు చేయాలి. భారీ సిక్సర్లను బాదాలి. ఇదే టీ20 కాన్సెప్టు. ఇందులో భాగంగా భారీ సిక్సర్లను కొట్టేందుకు బ్యాట్స్‌మెన్ శ్రమిస్తుంటారు. అయితే టెక్నిక్, పవర్, స్వింగ్ సరిగ్గా ఉంటే బ్యాట్స్ మెన్ పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఈ విషయంలో బ్యాటర్ల ఎత్తు కూడా సమస్య కాదు. ఇవే అంశాలను ఇప్పటికే అనేక మంది బ్యాటర్లు తమ ప్రదర్శనలతో రుజువు చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఇషాన్ కిషన్ వీర బాదుడు నేపథ్యంలో మరోసారి ఈ విషయం చర్చకు వస్తోంది.
కిషన్‌ను తక్కువగా అంచనా వేసిన పాక్..
ఇషాన్ కిషన్ భారత జట్టుకు దూరమయ్యాక చాలా కాలం విరామం అనంతరం మళ్లీ ఈ మధ్యే జట్టులోకి ఎంపికయ్యాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సత్తా చాటాడు. అయితే అతను ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడుతున్నాడు సరే, మరి టీ20 ప్రపంచ కప్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగిస్తాడా.. అని అభిమానులు సందేహం వ్యక్తం చేశారు. కానీ అతను వరల్డ్ కప్ టోర్నీలోనూ వీరబాదుడు బాదుతున్నాడు. దీంతో అతని దెబ్బకు ప్రత్యర్థి జట్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ కూడా ఇషాన్ కిషన్‌ను తక్కువ అంచనా వేసింది. వారు అభిషేక్ శర్మ కోసం ప్లాన్ వేసి దాన్ని పక్కాగా అమలు చేశారు. కానీ కిషన్ ను మరిచారు. అదే అతనికి కలసి వచ్చింది. కొలంబోలో జరిగిన తాజా గ్రూప్ మ్యాచ్‌లో అతను క్రీజులో ఉన్నంత సేపు వీర విహారం చేశాడు. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా పాక్‌కు చెందిన ప్రతి బౌలర్‌ను ఉతికి ఆరేశాడు. అయితే న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన సిరీస్‌తోపాటు తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలోనూ కిషన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కామెంటేటర్లు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కిషన్ ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ అతను సిక్సులు బాదుతున్న తీరు వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ ప్లేయర్లంతా ఇంతే..
కిషన్ ఎత్తు 5 అడుగుల 6 ఇంచులు కాగా అతను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కన్నా ఒక ఇంచు ఎత్తు ఎక్కువగా ఉంటాడు. సచిన్ ఎత్తు 5 అడుగుల 5 ఇంచులు. ఇక మరో మాజీ ఆసీస్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ (5 అడుగుల 7 ఇంచులు) కూడా వీరిలాగే హైట్ ను కలిగి ఉంటాడు. అలాగే భారత జట్టులోని రిషబ్ పంత్, రింకు సింగ్, వెస్టిండీస్ జట్టుకు చెందిన సునీల్ నరైన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎత్తు తక్కువగా ఉండే బ్యాటర్లు చాలా మంది ఉన్నారు. వీళ్లందరూ తక్కువ ఎత్తు ఉన్నా భారీగా సిక్సర్లను బాదడంలో, బంతిని స్టేడియం అవతలకు తరలించడంలో దిట్టలుగా పేరుగాంచారు. అయితే కిషన్ మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో కామెంటేటర్లు కూడా ఇదే విషయాన్ని ప్రస్తాంచారు. ఈ క్రమంలోనే ఎత్తు తక్కువగా ఉన్నవారు అంతటి భారీ సిక్సర్లను ఎలా బాదుతారో వారు వివరించారు.
భారీ సిక్సర్లను ఇలా కొడతారు..
ఎత్తు ఎక్కువగా ఉన్నవారికి సాధారణంగా వారి బ్యాటింగ్ ఆర్చ్‌లోనే శక్తి జనరేట్ అవుతుంది. కనుక వారు బ్యాట్‌ను కాస్త స్వింగ్ చేస్తే చాలు, బంతి వెళ్లి బౌండరీ అవతల పడుతుంది. వారు శారీరకంగా ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం లేదు. టైమింగ్, టెక్నిక్ ఉంటే చాలు. కానీ ఎత్తు తక్కువగా ఉన్నవారు ఆ రెండింటితోపాటు శారీరకంగా కూడా శ్రమించాల్సి వస్తుంది. వారు ఎక్కువ పవర్‌ను జనరేట్ చేయాలి. సిక్సర్ బాదేందుకు శరీరం నుంచి పవర్‌ను స్వీకరించాలి. అయితే ఎత్తు తక్కువగా ఉండడం వల్ల వారికి ఆ పవర్ సులభంగానే జనరేట్ అవుతుంది. ఎలా అంటే.. ఎత్తు తక్కువగా ఉన్నవారికి గురుత్వాకర్షణ పాయింట్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎత్తు ఎక్కువగా ఉండే వారితో పోలిస్తే బ్యాలెన్స్ అద్భుతంగా సెట్ అవుతుంది. ఈ క్రమంలో శరీరం నిలకడగా ఉంటుంది. ఆ సమయంలో బంతికి తగినట్లుగా శరీర భంగిమను మార్చి ఒక స్థానంలో ఉండి తమ శక్తినంతా కూడదీసుకుని అద్భుతమైన పవర్‌తో షాట్ ఆడతారు. దీంతో బంతి బౌండరీ అవతల పడుతుంది. భారీ సిక్సర్ అవుతుంది. ఈ క్రమంలో బ్యాటర్‌కు టెక్నిక్, టైమింగ్ కూడా అవసరమే. అవి రెండు కూడా కలిస్తేనే బంతి సిక్సర్‌గా మారుతుంది. ఇలా ఎత్తు తక్కువగా ఉన్నవారు భారీ సిక్సర్లను బాదుతారు.

శరీర భంగిమ, షాట్, టెక్నిక్ కీలకం..
అయితే కిషన్ లాంటి చాలా మంది బ్యాటర్లు భిన్న రకాల టెక్నిక్‌లను, షాట్‌లను, శరీర భంగిమలను ఉపయోగిస్తారు. అందుకనే కొన్ని సందర్భాల్లో వారు భంగిమను మార్చుకుని షాట్ ఆడుతూనే బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోతుంటారు. రిషబ్ పంత్ ఎక్కువగా ఇలా ఆడడాన్ని గమనించవచ్చు. వారు తమ భంగిమతో బలంగా షాట్ ఆడాక సహజంగానే ఆ భంగిమలో నిలకడగా ఉండలేరు. కనుకనే పట్టుతప్పి క్రీజులో కిందపడతారు. కిషన్‌కు కూడా ఇలాగే జరుగుతుంది. వీరు తమ భంగిమలను అద్భుతంగా మార్చుకుంటూ భారీ షాట్లను ఆడగలరు. ఇక ఎత్తు ఎక్కువగా ఉన్నవారు సిక్సర్లను ఆడే విధానం వేరుగా ఉంటుంది. కానీ ఎత్తు తక్కువగా ఉన్నవారు అంతటి భారీ సిక్సర్లను బాదుతుంటే చూసేవారికి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చిన్న వ్యక్తి భారీ షాట్లను ఎలా ఆడగలుగుతున్నాడు.. అని సందేహం వస్తుంది. కానీ పైన తెలిపిన విధంగా ఆలోచిస్తే అసలు విషయం తెలుస్తుంది.
కిషన్ లాంటి వారు ఇవే కాకుండా బ్యాట్‌ను స్పీడ్‌గా కొరడాలా ఝులిపించడం, బ్యాట్‌పై ఉండే స్వీట్ స్పాట్‌లను గుర్తించి వాటికి అనుగుణంగా బంతులు బ్యాట్‌కు తాకేలా షాట్లు ఆడడం, అధునాతనంగా ఉండే క్రీడాసామగ్రిని ఉపయోగించడం, అద్భుతమైన పవర్‌ను, బ్యాట్ స్వింగ్‌ను కలిగి ఉండడం వంటి అంశాలను కూడా పాటిస్తారు. అందుకనే ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ అంతటి భారీ సిక్సర్లను బాదగలుగుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026

ICC Women’s T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ నందినికి ఛాన్స్..!
మే 2, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



