Gautam Gambhir | అభిషేక్ శర్మకు అదే చెప్పా.. కీలక వివరాలను వెల్లడించిన గంభీర్..
Gautam Gambhir | టీ20 ప్రపంచకప్ 2026లో వరుస మ్యాచ్‌లలో విఫలం అయి విమర్శలు ఎదుర్కొన్న ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ గురించి భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టోర్నమెంట్ మొత్తం పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అభిషేక్ ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తన అసలు ఆటను ప్రదర్శించాడు.
Gautam Gambhir | టీ20 ప్రపంచకప్ 2026లో వరుస మ్యాచ్‌లలో విఫలం అయి విమర్శలు ఎదుర్కొన్న ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ గురించి భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టోర్నమెంట్ మొత్తం పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అభిషేక్ ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తన అసలు ఆటను ప్రదర్శించాడు. అతను దూకుడుగా ఆడి అర్ధశతకం సాధించి జట్టు భారీ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. అయితే వరుస వైఫల్యాల తర్వాత చాలా మంది అభిషేక్ మరింత జాగ్రత్తగా ఆడాలని సూచించినప్పటికీ, గంభీర్ మాత్రం అతను ఇంకా దూకుడుగా ఆడాలని కోరుకున్నట్లు తెలిపారు. జియోహాట్‌స్టార్ నిర్వహించిన ఫాలో ది బ్లూస్ కార్యక్రమంలో మాట్లాడిన గంభీర్ ఐపీఎల్ 2014 సీజన్‌లో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని కూడా వివరించారు. అప్పట్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డక్ అవుట్ అయిన తరువాత నాలుగో మ్యాచ్‌లో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు.
అభిషేక్‌పై ఎలాంటి సందేహం లేదు: గంభీర్
“2014 ఐపీఎల్ సమయంలో నాకు అభిషేక్ కంటే కూడా బ్యాడ్ ఎక్స్‌పీరియెన్స్ ఎదురైంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డక్ అవుట్ అయ్యాను, నాలుగో మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. నేను అతనికి చెప్పింది ఒక్కటే, ఫ్యాన్స్ నీ స్కోర్లను చూసి నీ ఫామ్ గురించి మాట్లాడతారు. కానీ నిజానికి నువ్వు ఫామ్ కోల్పోలేదు, కేవలం పరుగులు చేయలేకపోతున్నావు అంతే. ఒక ఆటగాడి ఫామ్‌ను అంచనా వేయాలంటే కనీసం 20 నుంచి 30 బంతులు ఆడిన తర్వాత మాత్రమే చెప్పాలి. కానీ అతను టోర్నీలో వరుస మ్యాచ్‌లలో 20 బంతులను కూడా ఎదుర్కోలేదు” అని గంభీర్ తెలిపారు.
అభిషేక్‌పై తన అంచనాల గురించి చెబుతూ తదుపరి మ్యాచ్‌లో అతను మరింత దూకుడుతో ఆడాలని తాను కోరుకున్నానని గంభీర్ వెల్లడించారు. “తదుపరి మ్యాచ్‌లో అతను గత మ్యాచ్ కంటే మరింత దూకుడుగా ఆడాలని మాత్రమే నేను కోరుకున్నాను. మొదటి బంతినే స్టేడియం బయటకు కొట్టాలనుకుంటే అలా చేయాలి. కానీ దానికి పూర్తి స్థాయిలో నిబద్ధత చూపాలి. ప్రపంచం నీ గురించి ఏమనుకుంటుందన్నది అసలు ముఖ్యం కాదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఆ 30 మంది నీ గురించి ఏమనుకుంటున్నారనేదే ముఖ్యమైంది. అదే ప్రతి ఆటగాడికి ముఖ్యమై ఉండాలి. అభిషేక్ గురించి ఎప్పుడూ ఎలాంటి సందేహం లేదు. నిజం చెప్పాలంటే ఆ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఎవరి గురించి అయినా మాకు ఎప్పుడూ విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డాయి. దేశానికి ప్రతినిధ్యం వహించడానికి ఎంపికైన ప్రతి ఆటగాడిపై మాకు పూర్తి నమ్మకం ఉంది” అని గంభీర్ చెప్పారు.
సంజూను అందుకనే తీసుకున్నారా..?
సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడం, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం వంటి అంశాలపై కూడా గంభీర్ స్పందించారు. “మేము మరింత దూకుడుగా ఆడాలని అనుకున్నాం. గత ఒకటిన్నర సంవత్సరాలుగా మా సిద్ధాంతం అదే. మైదానంలోకి వెళ్లి సాధ్యమైనంత దూకుడుగా ఆడటం. సంజూను జట్టులోకి తీసుకురావడం ప్రత్యర్థి జట్టు ఆఫ్ స్పిన్నర్‌ను ఎదుర్కోవడానికేం కాదు. మొదటి ఆరు ఓవర్లలో మరింత ఫైర్‌పవర్‌తో, మరింత దూకుడుగా ఆడగలమా అనే దానికోసమే అతన్ని తీసుకున్నాం” అని ఆయన వివరించారు. జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు సంజూ శాంసన్‌తో జరిగిన సంభాషణ కూడా చాలా సాధారణంగా జరిగిందని గంభీర్ తెలిపారు.
“సంజూ ఏం చేయగలడో మాకు బాగా తెలుసు. అతని ప్రతిభ, దూకుడు గురించి ఎప్పుడూ ఎలాంటి సందేహం లేదు. జిమ్‌లో ఉన్నప్పుడు నేను అతనితో మాట్లాడాను. నిజానికి అతనికి ట్రైనింగ్ ఇస్తున్నా. నేను అతనికి ‘జింబాబ్వేతో మ్యాచ్‌లో నువ్వు ఆడతావు’ అని చెప్పాను. అప్పుడు అతను ‘సరే’ అన్నాడు. మా మధ్య జరిగే సంభాషణలు అలా చాలా సాధారణంగా ఉంటాయి” అని గంభీర్ అన్నారు.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026

IPL 2026 | కోల్‌కతాతో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
మే 3, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



