Vaibhav Suryavanshi | యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ వయస్సు నిజంగా 14 ఏళ్లేనా..? ఏదైనా మోసం చేస్తున్నారా..?
Vaibhav Suryavanshi | భారత అండర్ 19 క్రికెట్ జట్టు యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ వయస్సుపై పలువురు తాజాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని వయస్సుకు తగినట్లు అతని ఆట లేదని, ఆ వయస్సులో అంతటి భారీ షాట్లు ఎలా ఆడగలడని, సీనియర్ బౌలర్ల బౌలింగ్‌లో సైతం ఏమాత్రం బెదరకుండా అతను షాట్స్ ఆడుతున్నాడని పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అతని వయస్సు ఇంకా ఎక్కువగానే ఉండి ఉంటుందని, కానీ ఆ విషయం దాస్తున్నారని అంటున్నారు. అయితే దీనిపై సూర్యవంశీ తండ్రి సంజీవ్ స్పష్టత ఇచ్చారు.
వైభవ్ సూర్యవంశీ వయస్సును దాచి పెట్టి మోసం చేస్తున్నారని వస్తున్న కామెంట్లపై అతని తండ్రి సంజీవ్ మాట్లాడుతూ గతంలోనూ అతని ఆటపై కొందరు ఇలాగే అనుమానం వ్యక్తం చేశారు. అప్పట్లో అతనికి బీసీసీఐ టెస్టు కూడా చేసింది. వైభవ్‌కు 8 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు బీసీసీఐ అతనికి బోన్ టెస్ట్ నిర్వహించి వయస్సును ధ్రువీకరించింది. ఆ తరువాతనే అతను ఆయా టీమ్‌లలో ఆడుతున్నాడు. దీన్ని ఇప్పుడు వివాదం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు, బీసీసీఐ అడిగితే మళ్లీ టెస్టు చేయించేందుకు సిద్ధమని తెలిపారు. అయితే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల వయస్సులోనే సీనియర్ బౌలర్లకు సైతం ముచ్చెమటలు పట్టించాడు. గత ఐపీఎల్ సీజీన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన అతను 7 ఇన్నింగ్స్‌లో 36 సగటుతో 252 పరుగులు సాధించగా అందులో ఒక అర్థ సెంచరీ, ఒక సెంచరీ ఉన్నాయి. అతని ఐపీఎల్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 206గా ఉంది.
ఇక తాజాగా దుబాయ్‌లో యూఏఈతో జరిగిన అండర్ 19 వన్డే ఆసియా కప్ మ్యాచ్‌లో 95 బంతుల్లోనే 171 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలోనే అతను తన వయస్సుకు మించి ఆట ఆడుతున్నాడని పేర్కొంటూ కొందరు అతని వయస్సుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం వైభవ్‌కు మద్దతుగా నిలుస్తుండడం విశేషం. సచిన్ కూడా ఆ వయస్సులో అలాగే ఆడాడని, అప్పుడు ఆయనపై లేని అనుమానాలు ఇప్పుడు వైభవ్‌పై ఎందుకని ప్రశ్నిస్తున్నారు. టాలెంట్ అనేది కొందరికి ఆ వయస్సు నుంచే ఉంటుందని, అది ఎవరి సొత్తు కాదని పేర్కొంటున్నారు. వైభవ్‌ను ఆటకు దూరం చేయడం కోసమే కొందరు కావాలని పనిగట్టుకుని ఇలా ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక వైభవ్ ను అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడితే చూడాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఐసీసీ నియమావళి ప్రకారం 15 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో ఆడటానికి వీల్లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వయస్సు 14 ఏళ్ల 9 నెలల 17 రోజులు కాగా వచ్చే 2026 మార్చి 27వ తేదీకి అతనికి 15 ఏళ్లు నిండుతాయి. దీంతో అతను ఆ తరువాత అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆ తరువాత అయినా బీసీసీఐ అతన్ని సీనియర్ల టీమ్‌లోకి ఎంపిక చేస్తుందా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



