అన్నింటినీ మరిచిపోయి మళ్లీ బ్యాట్ పట్టిన స్మృతి మంధాన.. క్రికెట్ పట్ల కమిట్‌మెంట్ అంటున్న ఫ్యాన్స్..
భారత మహిళల క్రికెట్ జట్టు ప్లేయర్ స్మృతి మంధాన ప్రస్తుతం తన వివాహం రద్దు కావడంతో తీవ్ర మనస్థాపం చెందుతున్న విషయం తెలిసిందే. పలాశ్ ముచ్చల్‌తో జరగాల్సిన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు ఆమె ప్రకటించింది. అయితే వెంటనే మరుసటి రోజు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. ఆమె సోదరుడు శ్రవణ్ మంధన ఆమె ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో క్రికెట్ పట్ల ఆమెకు ఉన్న కమిట్‌మెంట్, అంకిత భావానికి ఫ్యాన్స్ ముగ్ధులు అవుతున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో ఉన్నవారు అంత త్వరగా కోలుకోరని, కానీ స్మృతి మాత్రం అన్నింటినీ పక్కన బెట్టి క్రికెట్‌కు ప్రాధాన్యతను ఇవ్వడం అత్యంత అభినందించాల్సిన విషయమని ఫ్యాన్స్ అంటున్నారు.
భారత మహిళల క్రికెట్ జట్టు ఈ ఏడాది భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ఓ ఐసీసీ ట్రోఫీని సాధించగా యావత్ దేశ ప్రజలందరూ వారి ప్రతిభకు పట్టం కట్టారు. చాలా మంది ప్లేయర్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నగదు ప్రోత్సాహకాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంటి సంస్థలాలను కూడా అందించాయి. అయితే అప్పటి నుంచి టీమిండియాకు మ్యాచ్‌లు లేవు. దీంతో ఇదే సరైన సమయం అని భావించిన స్మృతి మంధాన తన ప్రియుడు పలాశ్ ముచ్చల్‌ను నవంబర్ 23వ తేదీన వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె తోటి మహిళా ప్లేయర్లు, స్నేహితులు ఆమె వివాహ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున సండి చేశారు. కానీ ఏం జరిగిందో తెలియదు, ఉన్నట్లుండి సడెన్‌గా వివాహం రద్దైంది.
వివాహానికి ముందు స్మతి మంధాన తండ్రి అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. తరువాత కొద్ది గంటల్లోనే ఆయనకు అంతా బాగానే ఉందని నిర్దారించారు. కానీ పెళ్లిని మాత్రం రద్దు చేసుకుంటున్నట్లు అప్పుడు ప్రకటించలేదు. కేవలం వాయిదా వేస్తున్నట్లు మాత్రమే చెప్పారు. అయితే అప్పటికే తోటి మహిళా క్రికెటర్లు పలాశ్ ముచ్చల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం, స్మతి మంధానకు చెందిన వివాహ కార్యక్రమాల ఫొటోలు, ఇతర పోస్టులను తొలగించడం చేశారు. దీంతో ఏదో జరిగింది, వివాహం రద్దు అవుతుందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే తాజాగా స్మృతి తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో తన వివాహం రద్దు అయిందని స్పష్టం చేసింది. ఈ సమయంలో తమ ఇరు కుటుంబాలకు ప్రైవసీ కావాలని కోరింది. అయితే వెంటనే మరుసటి రోజు నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. దీంతో ఆమె ఫొటోను ఆమె సోదరుడు శ్రవణ్ మంధాన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఆమె రాబోయే శ్రీలంక సిరీస్‌తోపాటు డబ్ల్యూపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తుందని చెప్పాడు. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో అన్నింటినీ మరిచిపోయి మళ్లీ క్రికెట్ ఆడడమే ఆమెకు మంచిదని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

ICC Women’s T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ నందినికి ఛాన్స్..!
మే 2, 2026

ICC Women’s T20 Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన షెఫాలీ వర్మ..!
ఏప్రిల్ 21, 2026

Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. రోహిత్ రికార్డు బ్రేక్..!
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



