త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Smriti Mandhana | చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌.. రోహిత్ రికార్డు బ్రేక్‌..!

Smriti Mandhana | భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్ల జాబితాలో (పురుషులు, మహిళలు కలిపి) అగ్రస్థానానికి చేరింది. ఈ క్రమంలో రోహిత్ శ‌ర్మ రికార్డును అధిగ‌మించింది.

P

Sports | Published On Apr 18, 2026, 4.21 pm IST

Smriti Mandhana | చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌.. రోహిత్ రికార్డు బ్రేక్‌..!
Advertisement

Smriti Mandhana | భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్ల జాబితాలో (పురుషులు, మహిళలు కలిపి) అగ్రస్థానానికి చేరింది. ఈ క్రమంలో రోహిత్ శ‌ర్మ రికార్డును అధిగ‌మించింది. ఇక అన్ని దేశాల ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో జాబ‌ర్ ఆజామ్ రికార్డుకు చేరువైంది. అయితే, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓటమిని చవిచూసింది. డర్బన్‌లోని కింగ్స్‌మేడ్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో స్మృతి భారీ ఇన్నింగ్స్ ఆడ‌లేక‌పోయింది.

కేవలం 13 పరుగులకే ఔట్ అయినా.. రోహిత్ శర్మ 4,231 పరుగుల రికార్డును అధిగ‌మించింది. ప్రస్తుతం మందానా 161 మ్యాచ్‌లలో 155 ఇన్నింగ్స్‌ల్లో 4,244 పరుగులు చేసింది. ఆమె స్ట్ర‌యిక్ రేట్ 124.39గా ఉండ‌గా.. ఇందులో 33 అర్ధశతకాలు, ఒక శతకం ఉంది. టీ20ల నుంచి రిటైర్ అయిన రోహిత్ శర్మ 159 మ్యాచుల్లో 151 ఇన్నింగ్స్‌ల్లో 140.90 స్ట్రయిక్ రేట్‌తో 4,231 పరుగులు చేశాడు. ఇందులో 32 హాఫ్ సెంచ‌రీలు, ఐదు సెంచ‌రీలున్నాయి. పురుషుల టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు బాబర్ ఆజమ్ పేరిట ఉంది. 145 మ్యాచుల్లో 4,596 పరుగులు చేశాడు. ఈ రికార్డుకు 352 పరుగుల దూరంలో ఉంది. మ‌హిళ‌ల విభాగంలో సుజీ బేట్స్ 4,717 పరుగులతో టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోంది.

ఇక ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ శుక్ర‌వారం జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ ఆరు వికెట్ల తేడాతో ఓట‌మిపాలైంది. ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వోర్డ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు తరఫున షెఫాలి వర్మ 34 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చింది. స్మృతి 13 ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరి నిరాశ ప‌రిచింది. ఆ తర్వాత జెమీయా రొడ్రిక్స్, కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఇన్సింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. ఇద్ద‌రు మూడో వికెట్‌కు 71 ప‌రుగులు జోడించారు. రోడ్రిగ్స్ 36 పరుగులు చేసి ఔట్ కాగా, హర్మన్‌ప్రీత్ కౌర్ 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరఫున అయ‌బోంగ ఖాకా మూడు వికెట్లు ప‌డ‌గొట్టింది.

158 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ వోల్వార్డ్ 51 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేసింది. అన్నెరీ డెర్క్సెన్ 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీసింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ ఆదివారం జరగనుంది. మ్యాచ్ అనంతరం జెమిమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ జట్టు 15-20 పరుగులు తక్కువ చేసిందని తెలిపింది. అయితే, చివరి ఓవర్ల వరకు పోరాడటం మాత్రమే సానుకూల అంశమని పేర్కొంది.

Advertisement
Advertisement