IPL 2026 Schedule | క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరో 2 రోజుల్లో ఐపీఎల్ షెడ్యూల్..
IPL 2026 Schedule | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి 20 రోజుల షెడ్యూల్‌ను మార్చి 12న విడుదల చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28 నుంచి మే 31 వరకు జరుగనుంది.
IPL 2026 Schedule | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి 20 రోజుల షెడ్యూల్‌ను మార్చి 12న విడుదల చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28 నుంచి మే 31 వరకు జరుగనుంది. అంతకు ముందు ఈ టోర్నమెంట్‌ను మార్చి 26 నుంచి మే 30 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మంగళవారం మీడియాతో మాట్లాడిన సైకియా.. మార్చి 12 వరకు ఐపీఎల్ 2026 షెడ్యూల్‌ను ప్రకటించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మొదటి 20 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించనున్నామని చెప్పారు. మిగిలిన టోర్నమెంట్ షెడ్యూల్‌ను తరువాత ప్రకటిస్తామని అన్నారు.
దశలవారీగా షెడ్యూల్..
పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడులలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో మ్యాచ్‌లు క్లాష్ అవకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ విధంగా దశల వారీగా షెడ్యూల్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జట్లు ఇప్పటికే ప్రీ-సీజన్ సన్నాహాలను ప్రారంభించాయి. 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 1న నవలూర్‌లోని తమ హై-పర్ఫార్మెన్స్ సెంటర్లో శిక్షణ ప్రారంభించింది. ఈ శిక్షణ శిబిరంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోని పాల్గొన్నారు. ప్రస్తుత ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫిబ్రవరి 10న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రిపరేషన్ క్యాంప్ నిర్వహించింది. 2022 విజేత అయిన గుజరాత్ టైటాన్స్ నాథ్ద్వారాలోని మిరాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండు సార్లు ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించారు.
శిక్షణ శిబిరాల నిర్వహణ..
పంజాబ్ కింగ్స్ ఫిబ్రవరి ప్రారంభంలో అబుదాబిలో శిక్షణ పొందగా, ప్రస్తుతం ధర్మశాలలో ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహిస్తోంది. 2016 విజేతలు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్చి 1న తమ దేశీయ ఆటగాళ్లతో కలిసి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించింది. 5 సార్లు విజేతలైన ముంబై ఇండియన్స్ కూడా రాబోయే సీజన్ కోసం శిక్షణ ప్రారంభించింది. 2008లో తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మార్చి 15 నుంచి జైపూర్‌లో ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహించనుంది. 3 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ మార్చి 18 నుంచి తమ ప్రీ-సీజన్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇటీవల హైదరాబాద్లోఒక శిక్షణ శిబిరం నిర్వహించింది. త్వరలో న్యూ ఢిల్లీలో మరో క్యాంప్ నిర్వహించే అవకాశం ఉంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఇప్పటికే లక్నోలో ఒక సన్నాహక శిక్షణ సెషన్ నిర్వహించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






