Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ కీలక నిర్ణయం..
Vaibhav Sooryavanshi | త్రినేత్ర.న్యూస్: వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi).. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది దనాదన్ హిట్టింగ్. బౌలర్ ఎవరనేది చూడకుండా బంతిని బౌండరీ దాటించడమే అతని లక్ష్యం. ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనలతో నయా సంచలనంగా మారాడు. దేశంలోనే కాదు క్రికెట్ ప్రపంచంలో ఈ 15 ఏండ్ల బుడ్డోడి గురించే చర్చ. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ (IPL) 19వ సీజన్‌లో ఆడిన వైభవ్ 16 మ్యాచ్‌లలో 776 పరుగులు ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. దీంతోపాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. తన అసాధారణ బ్యాటింగ్ ప్రతిభతో భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు టీమ్ ఇండియాకు సెలక్ట్ అయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు బీసీసీఐ (BCCI) అతనికి జట్టులో స్థానం కల్పించింది.
ఈ నేపథ్యంలో సూర్యవంశీ కోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు తన కంటే ఒకటి రెండేండ్ల పెద్ద వయస్కులతోనే కలిసి ఆడిన వైభవ్.. ఇకపై భారత సీనియర్ జట్టుతో పయణించాల్సి ఉంటుంది. విదేశీ పర్యటనల్లో అతనికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కుటుంబ సభ్యుల సహకారం అవసరమని భావించింది. దీంతో అతని తల్లిదండ్రులను కూడా వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అతని మానసిక సౌకర్యం, కుటుంబ మద్దతును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా తెలిపారు.

ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనలో ఉన్న వైభవ్ త్వరలో భారత సీనియర్ జట్టుతో కలిసి ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో అతని తండ్రి ఇప్పటికే శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంగ్లాండ్ పర్యటనకు కూడా తల్లిదండ్రులు వెళ్లాలనుకుంటే పూర్తి సహకారం అందించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా, 15 ఏండ్ల వయస్సులోనే సీనియర్ జట్టులో స్థానం దక్కించుకోవడంతో ఇప్పటివరకు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరున ఉన్న రికార్డును వైభవ్ తుడిచేయనున్నాడు. 16 ఏండ్ల 207 రోజుల వయస్సులో సచిన్ భారత జట్టులోకి ప్రవేశించాడు.
సంబంధిత వార్తలు

Asia Cup | ఈ కప్పూ అందుకోలే.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ.. నిరాకరించిన భారత్
సెప్టెంబర్ 14, 2026

Supreme Court | బీసీసీఐని జాతీయ క్రీడా చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదు..? : సుప్రీంకోర్టు
సెప్టెంబర్ 9, 2026

PM Modi | మీ ప్రతి కన్నీటి చుక్కా బంగారు పతకంతో సమానం.. కామన్వెల్త్ పతక విజేతలను అభినందించిన ప్రధాని మోదీ
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Kargil War Veteran Attacked Gurugram | గురుగ్రామ్‌లో దారుణం: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో పార్కింగ్ సిబ్బంది దాడి
- ●Ganesh Chaturthi 2026: గణపతికి 21 రకాల ఆకులే ఎందుకు సమర్పిస్తారు? ఒక్కో పత్రం వెనుక ఆసక్తికరమైన అర్థం!
- ●Gadwal Vijayalakshmi | పర్యావరణహితంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి: గద్వాల్ విజయలక్ష్మి
- ●Asia Cup | ఈ కప్పూ అందుకోలే.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ.. నిరాకరించిన భారత్
- ●Horoscope | సెప్టెంబర్ 14 రాశిఫలాలు.. ఈ రాశివారికి సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది!
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Kargil War Veteran Attacked Gurugram | గురుగ్రామ్‌లో దారుణం: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో పార్కింగ్ సిబ్బంది దాడి

Ganesh Chaturthi 2026: గణపతికి 21 రకాల ఆకులే ఎందుకు సమర్పిస్తారు? ఒక్కో పత్రం వెనుక ఆసక్తికరమైన అర్థం!

Gadwal Vijayalakshmi | పర్యావరణహితంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి: గద్వాల్ విజయలక్ష్మి

Asia Cup | ఈ కప్పూ అందుకోలే.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ.. నిరాకరించిన భారత్



