Ashes Series 2025-26 | యాషెస్ సిరీస్.. ఎట్టకేలకు నెగ్గిన ఇంగ్లండ్.. పరువు దక్కించుకున్నారుగా..!
Ashes Series 2025-26 | మెల్‌బోర్న్ వేదికగా యాషెస్ సిరీస్ 2025-26 టోర్నీలో భాగంగా జరిగిన 4వ టెస్టులో ఆస్ట్రేలియాపై ఎట్టకేలకు ఇంగ్లండ్ నెగ్గింది. ఇప్పటికే 3 టెస్టులలో గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్‌ను కైవసం చేసుకోగా, ఆ మిగితా రెండు టెస్టులను కూడా క్లీన్ స్వీప్ చేయాలని చూసింది. కానీ ఆసీస్ ఆశలు ఫలించలేదు.
Ashes Series 2025-26 | మెల్‌బోర్న్ వేదికగా యాషెస్ సిరీస్ 2025-26 టోర్నీలో భాగంగా జరిగిన 4వ టెస్టులో ఆస్ట్రేలియాపై ఎట్టకేలకు ఇంగ్లండ్ నెగ్గింది. ఇప్పటికే 3 టెస్టులలో గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్‌ను కైవసం చేసుకోగా, ఆ మిగితా రెండు టెస్టులను కూడా క్లీన్ స్వీప్ చేయాలని చూసింది. కానీ ఆసీస్ ఆశలు ఫలించలేదు. 4వ టెస్టును కోల్పోయింది. మరోవైపు ఇంగ్లండ్ కూడా 4వ టెస్టులో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ అవకుండా పరువు దక్కించుకుంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ అనంతరం నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ కష్టపడుతూనే ఛేదించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ బౌలర్ జాష్ టంగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆసీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ ప్లేయర్లలో ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో జాష్ టంగ్ 5 వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. మరో బౌలర్ గస్ అట్కిన్సన్ 2 వికెట్లు తీయగా, బ్రైడాన్ కార్స్, కెప్టెన్ బెన్ స్టోక్స్‌లకు చెరొక వికెట్ దక్కింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ కూడా తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. ఈ జట్టు బ్యాట్స్‌మెన్ కూడా విఫలం అయ్యారు. ఇక ఆసీస్ బౌలర్లలో మైకేల్ నెసర్ 4 వికెట్లు పడగొట్టగా, స్కాట్ బోలండ్ 3 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్‌కు 2 వికెట్లు దక్కాయి. కామరాన్ గ్రీన్ 1 వికెట్ తీశాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా మళ్లీ తడబడింది. కేవలం 132 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు ప్లేయర్లలో ట్రావిస్ హెడ్ (46) ఒక్కడే కాసేపు పోరాటం చేశాడు. మిగిలిన ఎవరూ రాణించలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడాన్ కార్స్ 4 వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ బెన్ స్టోక్స్ 3 వికెట్లు తీశాడు. మరో బౌలర్ జాష్ టంగ్ 2 వికెట్లు తీయగా, గస్ అట్కిన్సన్‌కు 1 వికెట్ దక్కింది. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. అయినప్పటికీ ఆసీస్ బౌలర్లు వికెట్లు తీస్తూనే వచ్చారు. అయితే ఇంగ్లండ్ అలా దూకుడుగా ఆడడం వల్ల తక్కువ స్కోరును సులభంగానే ఛేదించింది. 6 వికెట్లను కోల్పోయి 178 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్లేయర్లలో జాకొబ్ బెతెల్ (40), జాక్ క్రాలీ (37), బెన్ డకెట్ (34) జట్టును విజయపథంలో నడిపించారు. దీంతో ఎట్టకేలకు లక్ష్యాన్ని ఛేదించి ఈ మ్యాచ్‌లో విజయం సాధించారు. ఇక ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, జై రిచర్డ్సన్, స్కాట్ బోలండ్ తలా 2 వికెట్లు తీశారు.
కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించినప్పటికీ ప్రస్తుతం ఆసీస్ 3-1 ఆధిక్యంలోనే ఉంది. ఇక ఈ సిరీస్‌లో చివరిదైన 5వ టెస్టు జనవరి 4వ తేదీ నుంచి సిడ్నీలో జరగనుంది. ఇక పెర్త్ టెస్టు లాగే ఈ మ్యాచ్ కూడా కేవలం రెండు రోజుల్లోనే ముగియడం విశేషం.
సంబంధిత వార్తలు

ICC Test Rankings | ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. మూడో స్థానానికి భారత్
మే 1, 2026

David Warner | చిక్కుల్లో డేవిడ్ వార్నర్.. డ్రంక్ డ్రైవ్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు..!
ఏప్రిల్ 7, 2026

SRH | సన్‌రైజర్స్‌కు షాక్.. ఆస్ట్రేలియాకు కెప్టెన్ పాట్ కమిన్స్..! మళ్లీ తిరిగి వచ్చేనా..?
ఏప్రిల్ 4, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



