Ashes 2025-26 | యాషెస్ విజేత ఆసీస్.. మూడో టెస్టులోనూ విజయం..
Ashes 2025-26 | అడిలైడ్ వేదికగా జరిగిన యాషెస్ సిరీస్ 2025-26 మూడో టెస్టులోనూ ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై ఆసీస్ 82 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఆసీస్ జట్టు యాషెస్ విజేతగా నిలిచింది.
Ashes 2025-26 | అడిలైడ్ వేదికగా జరిగిన యాషెస్ సిరీస్ 2025-26 మూడో టెస్టులోనూ ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై ఆసీస్ 82 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఆసీస్ జట్టు యాషెస్ విజేతగా నిలిచింది. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆసీస్ ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో ఉండడమే కాక సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మిగిలిన రెండు టెస్టులను నామమాత్రంగా ఆడనున్నారు. కాగా మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 371 పరుగులకు ఆలౌట్ అవగా ఆసీస్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ క్యారీ, ఉస్మాన్ ఖవాజా, మిచెల్ స్టార్క్ రాణించారు. 143 బంతులు ఆడిన క్యారీ 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 106 పరుగులు చేయగా, 126 బంతుల్లో ఖవాజా 10 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. అలాగే మిచెల్ స్టార్క్ 75 బంతుల్లో 9 ఫోర్లతో 54 పరుగులు చేశాడు.
ఇక ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 5 వికెట్లు పడగొట్టగా, బ్రైడాన్ కార్స్, విల్ జాక్స్ చెరో 2 వికెట్లు తీశారు. జాష్ టంగ్‌కు 1 వికెట్ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 286 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ 198 బంతుల్లో 8 ఫోర్లతో 83 పరుగులు చేయగా, జోఫ్రా ఆర్చర్ 105 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 51 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఈ క్రమంలో ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలండ్‌లు చెరో 3 వికెట్లను పడగొట్టగా, నాథన్ లయాన్ 2 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, కామెరాన్ గ్రీన్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ 349 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 170 పరుగులతో రాణించాడు. హెడ్ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అలాగే మరో ప్లేయర్ అలెక్స్ క్యాలరీ 128 బంతుల్లో 6 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లలో జాష్ టంగ్ 4 వికెట్లు పడగొట్టగా, బ్రైడాన్ కార్స్ 3 వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, బెన్ స్టోక్స్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
కాగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ అనంతరం 435 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 352 పరుగులకు ఆలౌట్ అయింది. ఓ దశలో లక్ష్యాన్ని ఛేదించే విధంగానే ఇంగ్లండ్ జట్టు కనిపించింది. కానీ ఆసీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ప్లేయర్లు క్రీజులో కొనసాగలేకపోయారు. దీంతో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ జాక్ క్రాలీ 151 బంతుల్లో 8 ఫోర్లతో 85 పరుగులు చేసి ఆకట్టుకోగా, మరో ప్లేయర్ జేమీ స్మిత్ 83 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు చేసి జట్టును రక్షించే ప్రయత్నం చేశాడు. అలాగే చివర్లో వచ్చిన విల్ జాక్స్ (47), బ్రైడాన్ కార్స్ (39) కూడా స్కోరును ఛేజ్ చేసేందుకు యత్నించారు. కానీ వీలు కాలేదు. మరో వైపు నుంచి ఆసీస్ బౌలర్లు వికెట్లను తీస్తూ వచ్చారు. దీంతో ఆసీస్ సునాయాసంగా విజయం సాధించింది.
ఇక ఈ గెలుపుతో యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఈ రెండు జట్ల మధ్య నాలుగో టెస్టు డిసెంబర్ 26వ తేదీన మెల్‌బోర్న్‌లో జరగనుంది. చివరిదైన ఐదో టెస్టును జనవరి 4 నుంచి సిడ్నీలో నిర్వహిస్తారు.
సంబంధిత వార్తలు

ICC Test Rankings | ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. మూడో స్థానానికి భారత్
మే 1, 2026

David Warner | చిక్కుల్లో డేవిడ్ వార్నర్.. డ్రంక్ డ్రైవ్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు..!
ఏప్రిల్ 7, 2026

SRH | సన్‌రైజర్స్‌కు షాక్.. ఆస్ట్రేలియాకు కెప్టెన్ పాట్ కమిన్స్..! మళ్లీ తిరిగి వచ్చేనా..?
ఏప్రిల్ 4, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



