త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arshdeep Singh | త‌న‌ను ట్రోల్ చేసి మీమ్స్ వేసిన వారికి గ‌ట్టి రిప్లై ఇచ్చిన అర్ష‌దీప్‌.. మ్యాచ్‌లో ఏం చేశాడంటే..?

S

Sports | Published On Dec 15, 2025, 5.27 pm IST

Arshdeep Singh | త‌న‌ను ట్రోల్ చేసి మీమ్స్ వేసిన వారికి గ‌ట్టి రిప్లై ఇచ్చిన అర్ష‌దీప్‌.. మ్యాచ్‌లో ఏం చేశాడంటే..?
Advertisement

Arshdeep Singh | ధ‌ర్మ‌శాల‌లోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌న అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో సౌతాఫ్రికాను మ‌ట్టి క‌రిపించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే స‌ఫారిలు ఆది నుంచి వికెట్ల‌ను క్ర‌మంగా కోల్పోతూ వ‌చ్చారు. దీంతో చాలా స్వ‌ల్ప స్కోరుకు ఆ జ‌ట్టు ఆలౌట్ అయింది. అర్ష‌దీప్ సింగ్‌, హ‌ర్షిత్ రాణాలు ప‌వ‌ర్ ప్లేలో వికెట్లు తీయ‌డంతో సౌతాఫ్రికాకు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ఆ త‌రువాత కూడా ఆ జ‌ట్టు ఏ ద‌శ‌లోనూ రాణించ‌లేదు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో 117 ప‌రుగుల‌కు సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. అర్ష‌దీప్ సింగ్‌, హ‌ర్షిత్ రాణాల‌తోపాటు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల‌దీప్ యాద‌వ్‌లు చెరో 2 వికెట్ల‌ను తీసి ఆక‌ట్టుకున్నారు.

ఇక శివం దూబె, హార్దిక్ పాండ్యాలు కూడా చెరో వికెట్ తీయ‌డం విశేషం. అయితే 117 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో భార‌త్ 3 వికెట్ల‌ను కోల్పోయింది. అభిషేక్ శ‌ర్మ‌, శుబ‌మ‌న్ గిల్‌, సూర్య‌కుమార్ యాద‌వ్ ఔట్ అయ్యారు. అభిషేక్ శ‌ర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకోగా, గిల్‌, సూర్య మ‌రోసారి నిరాశ ప‌రిచారు. అయితే సౌతాఫ్రికాతో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అర్ష‌దీప్ సింగ్ తాను వేసిన ఓ ఓవ‌ర్‌లో ఏకంగా 7 వైడ్లు బౌల్ చేశాడు. దీంతో ఆ మ్యాచ్ అనంత‌రం సోష‌ల్ మీడియాలో అత‌నిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వ‌చ్చాయి. చాలా మంది అత‌నిపై మీమ్స్ వేశారు. వైడ్స్ వేసి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు విన్ ఇచ్చేయండి.. అని కొంద‌రు మీమ్స్‌ పెడితే.. రియో డి జెనెరియోలో ఉన్న జీస‌స్ క్రీస్తు విగ్ర‌హంలాగా అర్ష‌దీప్ వైడ్స్ వేస్తున్నాడ‌ని కొంద‌రు మీమ్స్ పెట్టారు. అయితే ఆ మీమ్స్‌కు అర్ష‌దీప్ సింగ్ మూడో టీ20లో గట్టి రిప్లై ఇచ్చాడు.

మూడో టీ20లో అర్ష‌దీప్ సింగ్ త‌న బౌలింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. 4 ఓవ‌ర్లు వేసిన అర్ష‌దీప్ కేవ‌లం 13 ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చి 2 కీల‌క వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. ఓపెన‌ర్ రీజా హెండ్రిక్స్‌తోపాటు కెప్టెన్ మార్క‌ర‌మ్‌ను అత‌ను ఔట్ చేశాడు. అయితే వికెట్ ప‌డిన‌ప్పుడు అత‌ను సెల‌బ్రేట్ చేసుకున్న విధానం అచ్చం అత‌నిపై వేసిన జీసస్ మీమ్‌లా ఉండ‌డం విశేషం. గ‌త మ్యాచ్‌లో అత‌ని ప్ర‌ద‌ర్శ‌న‌కు అత‌నిపై కొంద‌రు జీస‌స్ విగ్ర‌హంతో మీమ్స్ వేయ‌గా, ఈ మ్యాచ్‌లో అత‌ను వికెట్ ప‌డిన‌ప్పుడు చేతుల‌ను అలాగే వైడ్‌గా పెట్టాడు. దీంతో ఆ ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. త‌న‌పై వ‌చ్చిన మీమ్స్‌ను అత‌ను చూసి ఉంటాడ‌ని, అందుక‌నే అర్ష‌దీప్ అలా సెల‌బ్రేట్ చేసుకుని త‌న‌ను ట్రోల్ చేసిన వారికి గట్టి రిప్లై ఇచ్చాడ‌ని నెటిజ‌న్లు అంటున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ స‌మిష్టిగా రాణించ‌డంతో భార‌త్ సునాయాసంగా గెలిచింది.

https://twitter.com/Vipintiwari952/status/2000223277315477981

Advertisement

తాజావార్తలు

Advertisement