త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Zainullah Ihsan | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. స్కాట్లాండ్ జ‌ట్టులో అఫ్ఘాన్ క్రికెట‌ర్‌

భ‌ద్రతా కార‌ణాలు చూపుతూ ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి బంగ్లాదేశ్ (Bangladesh) నిష్క్ర‌మించింది. మ‌రో ప‌ది రోజుల్లో ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభమ‌వ‌నుండ‌గా అనుకోకుండా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క టోర్నీలోకి స్కాట్లాండ్ (Scotland) ఎంట్రీ ఇచ్చింది.

G

Sports | Published On Jan 27, 2026, 10.50 am IST

Zainullah Ihsan | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. స్కాట్లాండ్ జ‌ట్టులో అఫ్ఘాన్ క్రికెట‌ర్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: భ‌ద్రతా కార‌ణాలు చూపుతూ ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి బంగ్లాదేశ్ (Bangladesh) నిష్క్ర‌మించింది. మ‌రో ప‌ది రోజుల్లో ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభమ‌వ‌నుండ‌గా అనుకోకుండా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క టోర్నీలోకి స్కాట్లాండ్ (Scotland) ఎంట్రీ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా మెగా టోర్నీలో పాల్గొనే జ‌ట్టును ప్ర‌క‌టించింది. స్కాటిష్ జ‌ట్టును బెరింగ్‌ట‌న్ జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు. అఫ్ఘానిస్థాన్ మూలాలున్న ఫాస్ట్‌బౌల‌ర్ జైనుల్లా ఇహ్సాన్ (Zainullah Ihsan) తొలిసారిగా టీమ్‌కు ఎంపిక‌య్యాడు.

గ‌తేడాది కాలంగా స్కాట్లాండ్ వ‌న్డే, టీ20 జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఒలివ‌ర్ డేవిడ్స‌న్‌, ఫిన్లే మెక్‌క్రీత్ తొలిసారిగా వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడ‌నున్నారు. వ‌చ్చే నెల 7 నుంచి భార‌త్‌, శ్రీలంక సంయుక్త ఆధ్వ‌ర్యంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

స్కాట్లాండ్ జ‌ట్టు..

రిచీ బెరింగ్ట‌న్ (కెప్టెన్‌), టామ్ బ్రూస్‌, మాథ్యూ క్రాస్‌, బ్రాడ్లీ క్యూరీ, ఒలివ‌ర్ డేవిడ్స‌న్‌, క్రిస్ గ్రీవ్స్‌, జైనుల్లా ఇహ్సాన్‌, మైఖేల్ జోన్స్‌, మైఖేల్ లీస్క్‌, ఫిన్లే మెక్‌క్రీత్‌, బ్రాండ‌న్ మెక్‌ముల్లెన్‌, జార్జ్ మున్సే, స‌ఫ్యాన్ ష‌రీఫ్‌, మార్క్ వాట్‌, బ్రాడ్లీ వీల్‌.

Advertisement

తాజావార్తలు

Advertisement